iDreamPost
android-app
ios-app

పుట్టినరోజున ఖరీదైన కారు కొన్న సంజయ్ దత్.. ఎన్ని కోట్లంటే?

  • Published Jul 29, 2024 | 9:41 PM Updated Updated Jul 29, 2024 | 9:41 PM

Sanjay Dutt Treats Himself To A Luxurious Range Rover SV On His Birthday: సంజయ్ దత్ తన పుట్టినరోజు సందర్భంగా తనకు తానే ఒక ఖరీదైన బహుమతి ఇచ్చుకున్నాడు. అది కూడా అలాంటి ఇలాంటి గిఫ్ట్ కాదు.. దాని ధర ఏకంగా కోట్లలో ఉంటుంది.

Sanjay Dutt Treats Himself To A Luxurious Range Rover SV On His Birthday: సంజయ్ దత్ తన పుట్టినరోజు సందర్భంగా తనకు తానే ఒక ఖరీదైన బహుమతి ఇచ్చుకున్నాడు. అది కూడా అలాంటి ఇలాంటి గిఫ్ట్ కాదు.. దాని ధర ఏకంగా కోట్లలో ఉంటుంది.

  • Published Jul 29, 2024 | 9:41 PMUpdated Jul 29, 2024 | 9:41 PM
పుట్టినరోజున ఖరీదైన కారు కొన్న సంజయ్ దత్.. ఎన్ని కోట్లంటే?

సంజయ్ దత్.. ఈ పేరుకు పాన్ ఇండియా లెవల్లో స్పెషల్ ఇంట్రడక్షన్లు, ఎలివేషన్స్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. తానేంటో ఇప్పటికే పాన్ ఇండియా ప్రేక్షకులకు చూపించేశాడు. ఇప్పుడు బాలీవుడ్ లోనే కాకుండా.. సౌత్ లో కూడా బిజీగా మారిపోయాడు. సౌత్ నుంచి వచ్చే పాన్ ఇండియా సినిమా అంటే సంజయ్ దత్త ఉండాల్సిందే అనేలా అయిపోయింది. ముందు కేజీఎఫ్ 2లో అధీరాగా మెప్పించిన సంజయ్ దత్.. ఆ తర్వాత లియోలో తండ్రిగా మెరిసాడు. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ లో బిగ్ బుల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయిపోతున్నాడు. అలాగే కన్నడ మూవీ కేడీలో కూడా సంజయ్ దత్ ఉన్నాడు. ఇవాళ సంజయ్ దత్ పుట్టిన రోజు సందర్భంగా ఒక ఖరీదైన కారులో సంజయ్ దత్ కనిపించి ప్రేక్షకులను అలరించాడు. ఆ కారు ఎన్ని కోట్లో తెలుసుకుని అంతా నోరెళ్లబెట్టేస్తున్నారు.

సంజయ్ దత్ పుట్టిన రోజు సందర్భంగా నెట్టింట ఎక్కడ చూసినా.. ఆయన సినిమా అప్ డేట్స్, బర్త్ డే విషెస్ కనిపిస్తున్నాయి. వాటిలో ఒక వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అదేంటంటే.. ఒక కొత్త రేంజ్ రోవర్ కారుని సంజయ్ దత్ నడుపుతూ కనిపించాడు. ఆ కారు ఆయన ఇంటికి డెలివరీ అయిన దృశ్యాలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు అంతా ఆ కారు ధర, దాని ఫీచర్స్ గురించే చర్చ మొదలు పెట్టారు. ఇప్పటికే ఒక ఖరీదైనా రేంజ్ రోవర్ సంజయ్ దత్ కు ఉంది. ఇప్పుడు మరో లగ్జరీ కారును తన గరాజ్ కి తీసుకొచ్చేశాడు. ఆ కారు మరేదో కాదు.. రేంజ్ రోవర్ ఎస్వీ. ఈ కారు లుక్స్ పరంగా అద్భుతంగా ఉంటుంది. ఇంక లోపల ఇంటీరియర్ అయితే మంచి లగ్జరీ ఫీల్ ఉంటుంది.

సంజయ్ దత్ కొనుగోలు చేసిన ఈ రేంజ్ రోవర్ ఎస్వీ 2024 మోడల్ కారు ఆన్ రోడ్ ధర దాదాపుగా రూ.5 కోట్ల వరకు ఉంటుంది. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 250 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఇది ఆటోమేటిక్ ట్రాన్సషన్ లో మాత్రమే ఉంటుంది. పైగా ఇందులో మీకు 7 వరకు కలర్ ఆప్షన్స్ ఉంటాయి. సంజత్ దత్ బెల్గ్రేవియా గ్రీన్ కలర్ కారును కొనుగోలు చేశాడు. ఈ కారు కేవలం 4.7 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల స్పీడును అందుకోగలదు. ఇది 4395 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఈ కారు హైబ్రిడ్ మోడల్ కూడా. అంటే మీరు పెట్రోల్ మాత్రమే కాకుండా.. కారుకు ఈవీలాగా ఛార్జ్ కూడా పెట్టచ్చు.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

ఈ కారుకు ఫుల్ ట్యాంక్(90 లీటర్లు) కొట్టించి.. ఫుల్ ఛార్జ్ పెడితే 783 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందంట. ఇది ఆటోమేటిక్ వర్షన్.. ఇందులో 8 గేర్స్, పెడల్ షిఫ్ట్, స్పోర్ట్స్ మోడ్ ఉంటుంది. ఇంక బూట్ స్పేస్ 1050 లీటర్స్ లభిస్తుంది. ఇంక రేంజ్ రోవర్ ఇంటీరియర్ ఏ రేంజ్ లో ఉంటాయో అందరికీ తెలిసిందే. పైగా మీరు వీళ్ల అధికారిక వెబ్ సైట్ లో మీకు నచ్చిన ఎస్వీ మోడల్ ను మీరే డిజైన్ చేసుకోవచ్చు. మరి.. పుట్టినరోజున సంజయ్ దత్.. తనకి తానే ఒక రూ.5 కోట్ల విలువైన కారును గిఫ్డ్ గా ఇచ్చుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Jojobet Girişjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgit girişgrandpashabetEscortes Belgique