iDreamPost
iDreamPost
ఎట్టకేలకు నెల రోజుల నుంచి విపరీతమైన ప్రచారాలకు చెక్ పెడుతూ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది. మొన్నటి దాకా జనవరి 12నే వస్తామని పదే పదే ప్రమోషన్లలో చెప్పిన నిర్మాతలు ఎట్టకేలకు వెనుకకు తగ్గారు. ఈ మేరకు ఫిబ్రవరి 25కి ఫిక్స్ చేసిన నిర్ణయాన్ని ప్రొడ్యూసర్స్ గిల్డ్ సంయుక్తంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో ప్రకటించారు. నిన్న ఈ సమావేశానికి సంబందించిన ఆహ్వానం అందినప్పుడే అది భీమ్లా నాయక్ వాయిదా గురించేనని మీడియాకు అర్థమైపోయింది. త్రివిక్రమ్ తో గిల్డ్ పెద్దలు చేసిన రాయబారం ఎట్టకేలకు ఫలించి పవన్ కళ్యాణ్ పోస్ట్ పోన్ కు ఒప్పుకున్నట్టు మొన్నటి నుంచే లీక్ ఉంది.
ఇప్పుడీ పరిణామం వల్ల ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ లు బాగా లాభపడనున్నాయి. భీమ్లా నాయక్ వీటి స్థాయిలో భారీ బడ్జెట్ చిత్రం కానప్పటికీ పవన్ కళ్యాణ్ ఇమేజ్ రేంజ్ దృష్ట్యా స్క్రీన్ కౌంట్ విషయంలో తీవ్ర ప్రభావం ఉంటుంది. డిజాస్టర్స్ తోనే అదిరిపోయే ఓపెనింగ్స్ తెచ్చే పవర్ స్టార్ ఒకవేళ భీమ్లా నాయక్ కు పాజిటివ్ టాక్ వస్తే జరిగే అరాచకం మాములుగా ఉండదు. బిజినెస్ పరంగా అన్ని సినిమాల మీద ఎఫెక్ట్ ఉంటుంది. పైగా రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ సినిమాలు ఇంతేసి తక్కువ గ్యాప్ లో తలపడటం మెగాభిమానులకు సైతం ఇబ్బంది కలిగించేదే. సోషల్ మీడియాలో లేనిపోని ఫ్యాన్ వార్ కు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది.
సో భీమ్లా నాయక్ తగ్గడం అందరికీ హెల్ప్ అయ్యేదే. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 25 ముందు లాక్ చేసుకున్న ఎఫ్3 ఇప్పుడు ఏకంగా ఏప్రిల్ 29కి వెళ్లిపోయింది. ఇది పరస్పర ఒప్పందంలో భాగంగానే. బంగార్రాజు వ్యవహారం మాత్రం ఇక్కడ చెప్పలేదు. ఇప్పుడు బిజినెస్ సమీకరణాలు వేగంగా మారబోతున్నాయి. భీమ్లా నాయక్ లేదు కాబట్టి దానికి అగ్రిమెంట్లు చేసుకున్న థియేటర్లను ఆర్ఆర్ఆర్ రాధే శ్యామ్ లు పంచుకుంటాయి. ఒకవేళ బంగార్రాజు వచ్చినా కూడా పెద్దగా ప్రభావం ఉండదు. దాని ప్రస్తావన రాలేదు కాబట్టి అది తప్పకుందా లేదా క్లారిటీ లేదు. ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ లు పాన్ ఇండియా సినిమాలు అందులోనూ మూడేళ్లుగా నిర్మాణంలో ఉన్నందువల్ల రిక్వెస్ట్ చేశామని దాన్ని మన్నించినందుకు దిల్ రాజు సితార బ్యానర్ కు కృతజ్ఞతలు చెప్పారు
Also Read : Godse : సేవ ముసుగులో అరాచకాన్ని ప్రశ్నించిన నిరుద్యోగి