iDreamPost
android-app
ios-app

Varun Tej: మట్కా ఈవెంట్ లో మెగా ప్రిన్స్ సెటైర్స్.. ఎవరిని ఉద్దేశించి?

  • Published Nov 11, 2024 | 10:59 AM Updated Updated Nov 11, 2024 | 10:59 AM

Varun Tej: వరుణ్ తేజ్ మట్కా మూవీ ప్రస్తుతం విడుదలకు రెడీగా ఉంది. ఈ నేపధ్యంలో మట్కా ఈవెంట్ లో వరుణ్ తేజ్ కొన్ని కామెంట్స్ చేశారు.

Varun Tej: వరుణ్ తేజ్ మట్కా మూవీ ప్రస్తుతం విడుదలకు రెడీగా ఉంది. ఈ నేపధ్యంలో మట్కా ఈవెంట్ లో వరుణ్ తేజ్ కొన్ని కామెంట్స్ చేశారు.

  • Published Nov 11, 2024 | 10:59 AMUpdated Nov 11, 2024 | 10:59 AM
Varun Tej: మట్కా ఈవెంట్ లో మెగా ప్రిన్స్ సెటైర్స్.. ఎవరిని ఉద్దేశించి?

మెగా ప్రిన్స్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. ఈయన రూటు సెపరేటు. కెరీర్ స్టార్టింగ్ లోనే ప్రయోగాత్మక చిత్రాలు చేసి ఆకట్టుకున్నాడు. మంచి హిట్లు అందుకున్నాడు. నటుడిగా తానెంటో నిరూపించుకున్నాడు. ఇక తాజాగా వరుణ్ నుంచి మరో డిఫరెంట్ మూవీ అయిన మట్కా రాబోతుంది. ఈ సినిమా నవంబర్ 14న రిలీజ్ కాబోతుంది. దీంతో ఆదివారం నాడు వైజాగ్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపారు. ఈ ఈవెంట్ లో వరుణ్ తేజ్ స్టేజ్ మీద కొన్ని కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వరుణ్ తన పోయిన సినిమాల గురించి మాట్లాడాడు. మళ్ళీ ఈ సినిమాతో కొత్త ప్రయత్నం చేస్తున్నట్టుగా చెప్పారు. సినిమాలు పోయినప్పుడు కాస్త బాధగా అనిపిస్తుందని, ఆ టైంలోనే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందని, తన అన్న రామ్ చరణ్ తనకు అండగా నిలుస్తాడని, మోరల్ సపోర్ట్ ఇస్తాడని వరుణ్ చెప్పాడు. వంద మాటలు మాట్లాడాల్సిన పని లేదు.. కేవలం తన అన్న తన భుజం మీద చేయి వేస్తే చాలని వరుణ్ తేజ్ అన్నాడు.అలా మట్కా గురించి మాట్లాడుతూ తన ఫ్యామిలీ గురించి కూడా చెప్పాడు వరుణ్ తేజ్.

పెదనాన్న, బాబాయ్, అన్న గురించి ఎందుకు పదే పదే చెబుతావ్ అని తనను అందరూ అడుగుతారట. మనం పెద్దోళ్లం అవ్వొచ్చు.. అవ్వకపోవచ్చు.. సక్సెస్ అవ్వొచ్చు.. అవ్వకపోవచ్చు.. కానీ మనం ఎక్కడి నుంచి వచ్చాం.. ఎలా వచ్చాం.. అన్నది చెప్పుకోకపోతే ఎంత సక్సెస్ అయినా వృథానే అని వరుణ్ అన్నాడు. అయితే ఈ మాటలు జెన్యూన్ గా అనిపించినా కానీ, వరుణ్ చెప్పేది నిజమే అయినా కానీ, ఎందుకో ఈ మాటలు మాత్రం అల్లు అర్జున్‌ మీద కౌంటర్లే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.బన్నీ ఈ మధ్య స్టేజ్ ఎక్కితే తనని తాను గొప్పగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు.. ఏ సహకారం లేకుండా ఒంటరిగానే ఈ రేంజ్ కి వచ్చినట్టుగా చెప్పుకుంటున్నాడు.. ఒకప్పటిలా ఎక్కడా కూడా మెగా పేరు గురించి మాట్లాడటం లేదు.. అసలు మెగా హీరో అనే ట్యాగ్‌ని బన్నీ ఎఫ్పుడో దూరం పెట్టాడని నెటిజెన్స్ నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకే వరుణ్ తేజ్ ఇలా కౌంటర్లు వేసి ఉంటాడని కామెంట్స్ చేస్తున్నారు..

కొంతమంది అయితే వరుణ్ బన్నీ గురించి కాదని తనని అన్న వాళ్ళకి ఇలా సమాధానం ఇచ్చాడని, వాళ్ళు వాళ్ళు ఒకే ఫ్యామిలీ అని అంటున్నారు. కానీ కొందరు బన్నీ ఫ్యాన్స్ మాత్రం చిరు, పవన్, రామ్ చరణ్ పేర్లు చెప్పకపోతే వరుణ్ తేజ్ మట్కాకి క్రేజ్ రాదని అంటున్నారు.. అందుకే ఇలా మాట్లాడాడు అని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి వరుణ్ తేజ్ స్పీచ్ మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇదీ సంగతి. మరి వరుణ్ కామెంట్స్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet