iDreamPost
iDreamPost
విడుదల వాయిదా అని తెలిసినప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తిట్టుకున్నారు కానీ భీమ్లా నాయక్ తీసుకున్న నిర్ణయం ఎంత ప్లస్ అవుతుందో మెల్లగా వాళ్లకు అర్థమవుతోంది. ఒకవేళ జనవరి 12కే కట్టుబడి ఉంటే ఓపెనింగ్స్ మాట ఎలా ఉన్నా ఇతరత్రా అంశాల వల్ల కలెక్షన్లు గట్టిగానే ప్రభావితం చెందేవి. ఇది తెలివైన పని అని చెప్పడానికి పలు కారణాలు ఉన్నాయి. జనవరి 7న రాబోతున్న ఆర్ఆర్ఆర్ కోసం వేల స్క్రీన్లు సిద్ధమవుతున్నాయి. ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే కనీసం మూడు వారాల పాటు థియేటర్లలో ఉండేందుకు అగ్రిమెంట్లు జరుగుతున్నాయి. రాధే శ్యామ్ కూడా ఇదే తరహా ఒప్పందాలతో దేశవ్యాప్తంగా డీల్స్ ని లాక్ చేసుకుంటోంది.
వీటితో పాటు అజిత్ వలిమై తెలుగు డబ్బింగ్ బలం కూడా బరిలో దిగడం అఫీషియల్ అయ్యింది. జనవరి 13న తెలుగు రాష్ట్రాల్లోనూ తమిళంతో పాటు రిలీజ్ చేస్తారు. భారీగా కాకపోయినా ప్రొడ్యూసర్ పలుకుబడిని బట్టి దీనికీ థియేటర్లు దొరుకుతాయి. ఒకవేళ భీమ్లా నాయక్ ఉంటే బలం ఖచ్చితంగా తప్పుకోవాల్సి వచ్చేది లేదా సింగల్ డిజిట్ థియేటర్లతో సర్దుకోవాల్సి వచ్చేది. ఇప్పుడా సమస్య లేదు. బంగార్రాజు వ్యవహారం ఇంకా తేలనే లేదు. వచ్చేది లేనిది చెప్పడం లేదు. అవుట్ డోర్ ప్రమోషన్లు ఇంకా స్టార్ట్ చేయలేదు. ఒకవేళ రావడం కన్ఫర్మ్ అయితే అప్పుడు స్క్రీన్ల పంపిణి వ్యవహారం ఇంకా జఠిలంగా మారుతుంది. ట్రేడ్ కి ఇదంతా తలనెప్పి వ్యవహారమే
ఇవన్నీ పక్కనపెడితే మెల్లగా ఒమిక్రాన్ ఆందోళన పెరుగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో ఆంక్షలు, పాక్షిక లాక్ డౌన్ లు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. సంక్రాంతి టైంకి అంతా మాములుగా ఉంటుందో లేదో ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఒకవేళ పండగ తర్వాత కేసులు పెరిగినా అదో నరకం. పైగా ఏపిలో టికెట్ రేట్ల వ్యవహారం ఇంకా తేలలేదు. ఎక్కడ ఆగుతుందో ఎలా పరిష్కారమవుతుందో ఎవరికీ తెలియదు. ఈ నేపథ్యంలో టెన్షన్ ని నెత్తినేసుకోవడం కన్నా ఫిబ్రవరికి షిఫ్ట్ అవ్వడం పరమ సుఖం. భీమ్లా నాయక్ కు జరిగింది అదే. అప్పటికంతా ఒమీక్రాన్ తో సహా అన్ని సమస్యలు సెట్ అయిపోయే అవకాశం లేకపోలేదు. పైగా శివరాత్రికి సోలో రిలీజ్ కన్నా బంపర్ ఆఫర్ ఇంకేముంటుంది
Also Read : Guduputani Report : గూడుపుఠాణి రిపోర్ట్