గుడ్‌ న్యూస్‌.. APలో కొత్త క్రికెట్‌ స్టేడియం నిర్మాణాకి BCCI గ్రీన్‌ సిగ్నల్‌!

క్రికెట్‌ అభిమానులతో పాటు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు భారత క్రికెట్‌ బోర్డు(బీసీసీఐ) త్వరలో గుడ్‌న్యూస్‌ను అధికారికంగా చెప్పనుంది. ఇప్పటికే వైజాగ్‌లో ఓ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం ఉన్న విషయం తెలిసిందే. అయితే.. దేశవ్యాప్తంగా క్రికెట్‌ స్టేడియాలను నిర్మించే ప్రక్రియలో భాగంగా.. ఏపీలో కూడా సరికొత్త హంగులతో భారీ క్రికెట్‌ స్టేడియం నిర్మించే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. స్టేడియం నిర్మించే విషయమై.. ఇప్పటికే బీసీసీఐ కార్యదర్శి జై షా ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌కు హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది.

తాజాగా గోవా వేదికగా బీసీసీఐ 92వ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. వీటిలో పాల్గొనేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు పీ.శరత్ చంద్ర రెడ్డి, సెక్రటరీ ఎస్.ఆర్.గోపీనాథ్ రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, సెక్రటరీ జై షాను కలిశారు. ఈ క్రమంలోనే విశాఖపట్టణంలో మరో కొత్త క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయడం గురించి చర్చించినట్లు తెలుస్తుంది. స్టేడియం నిర్మాణానికి కావాల్సిన సహాయ సహకారాలను బీసీసీఐ వైపు నుంచి పూర్తిగా అందిస్తామని జై షా హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. వైజాగ్‌లో స్టేడియం నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు జైషా త్వరలోనే వైజాగ్‌కు రానున్నట్లు సమాచారం.

తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని కాశీలో శివుడి థీమ్‌తో సరికొత్త అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. మొత్తం రూ.451 కోట్ల ఖర్చుతో ఈ స్టేడియం నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ స్టేడియం కోసం భూసేకరణ జరుగుతోంది. శంకుస్థాపన కార్యక్రమానికి భారత దిగ్గజ మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్ హాజరయ్యారు. దాదాపు 30 వేల మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ స్టేడియం 2025 నాటికి అందుబాటులోకి రానుంది. ఇలాంటి నిర్మాణాలను మరికొన్ని రాష్ట్రాల్లో కూడా తలపెట్టేందుకు కేంద్రంతో పాటు బీసీసీఐ సిద్ధం అవుతుంది. మరి ఏపీకి మరొకొత్త క్రికెట్‌ స్టేడియం రానుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: రాసిపెట్టుకోండి.. ఈసారి వరల్డ్ కప్ టీమిండియాదే.. ఫైనల్లో ప్రత్యర్థి కూడా ఫిక్స్!

Show comments