iDreamPost

రాసిపెట్టుకోండి.. ఈసారి వరల్డ్ కప్ టీమిండియాదే.. ఫైనల్లో ప్రత్యర్థి కూడా ఫిక్స్!

  • Author singhj Published - 03:40 PM, Mon - 25 September 23
  • Author singhj Published - 03:40 PM, Mon - 25 September 23
రాసిపెట్టుకోండి.. ఈసారి వరల్డ్ కప్ టీమిండియాదే.. ఫైనల్లో ప్రత్యర్థి కూడా ఫిక్స్!

ఆసియా కప్-2023 ముందు వరకు భారత జట్టు ప్రదర్శనపై, టీమ్ సెలెక్షన్ మీద పలు సందేహాలు ఉండేవి. కానీ ఆ టోర్నీతో అవన్నీ పటాపంచలు అయిపోయాయి. ఎదురొచ్చిన ప్రతి ప్రత్యర్థిని ఓడిస్తూ ఫైనల్​కు చేరుకున్న భారత్.. తుది సమరంలో లంకను చిత్తు చేసింది. ఆసియా కప్​తో పాటు ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్​ను కూడా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే గెలుచుకొంది టీమిండియా. అన్ని విభాగాల్లోనూ అద్భుతంగా రాణిస్తుండటం, ప్లేయర్లు సమష్టిగా ఆడుతుండం, అందరూ భీకర ఫామ్​లో ఉండటం విశేషం. వరుస విజయాలతో వన్డే ర్యాంకింగ్స్​లో ఫస్ట్ ప్లేసుకు చేరుకుంది టీమిండియా.

సక్సెస్ ట్రాక్​లో ఉన్న భారత్​కు వచ్చే వన్డే వరల్డ్ కప్​లో ఎదురు ఉండకపోవచ్చునని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. టీమిండియా అభిమానులు కూడా ఈసారి కప్ మనదేనని చెబుతున్నారు. దీనికి ప్రపంచ కప్​ల సెంటిమెంట్​ను ప్రస్తావిస్తున్నారు. 2015 వరల్డ్ కప్​కు ముందు ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్​లో ఆస్ట్రేలియా నంబర్ వన్​గా ఉంది. ఆ జట్టే ఆ ఏడాది కప్ గెలిచింది. 2019లోనూ అదే జరిగింది. 2019 ప్రపంచ కప్​కు ముందు ఇంగ్లండ్ ర్యాంకింగ్స్​లో అగ్రస్థానంలో ఉంది. ఆ సంవత్సరం కప్పును ఇంగ్లీష్ టీమ్ ఎగరేసుకుపోయింది. దీంతో ఈసారి ఆ సెంటిమెంట్ ప్రకారం నంబర్ వన్ వన్డే టీమ్​గా ఉన్న భారత్​దే కప్పు అని ఫ్యాన్స్ అంటున్నారు.

2015 వరల్డ్ కప్​ ఫైనల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఫైనల్స్​కు చేరుకున్నాయి. తుది సమరంలో కివీస్​పై 7 వికెట్ల తేడాతో గెలిచింది ఆసీస్. 2019లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ ఫైనల్లో తలపడ్డాయి. టైగా ముగిసిన ఈ మ్యాచ్​లో ఎక్కువ బౌండరీలు కొట్టిన కారణంగా ఇంగ్లీష్ టీమ్​ను విజేతగా ప్రకటించారు. ఈ సెంటిమెంట్ ప్రకారం ప్రస్తుతం ప్రపంచ నంబర్​ వన్​గా టీమిండియా ఫైనల్​కు చేరితే.. అప్పుడు ప్రత్యర్థి కూడా న్యూజిలాండ్ అవుతుందని, ఇది ఫిక్స్ అని అభిమానులు చెబుతున్నారు.

ప్రపంచ కప్ విషయంలో మరో సెంటిమెంట్ కూడా భారత్​కు అనుకూలంగా ఉంది. 2011లో సొంతగడ్డపై జరిగిన వరల్డ్ కప్​ను టీమిండియా గెలుచుకుంది. 2015లో ఆతిథ్య జట్టయిన ఆసీస్ కప్ సాధించింది. 2019లో సొంతగడ్డపై తొలిసారి వన్డే ప్రపంచ కప్​ను ఇంగ్లండ్ ముద్దాడింది. ఈ లెక్కన.. రాసిపెట్టుకోండి, కప్ భారత్​దేనని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఈసారి వరల్డ్ కప్ ఎవరు నెగ్గుతారని మీరు భావిస్తున్నారు? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: సిరాజ్ అంటే షమీకి పడదా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి