iDreamPost
iDreamPost
కొరియా నుండి దిగుమతి చెసుకున్న కోవిడ్ ర్యాపిడ్ కిట్ల ఆర్డర్ల ప్రక్రియ పై రాష్ట్రంలో విపక్షాలు చేసిన ఆరోపణలకి రాష్ట్ర ప్రభుత్వం గట్టిగానే సమాధానం చెప్పింది. కన్నా లాంటి సీనియర్ నాయకులు తెలుగుదేశం నేతలు అజండాని భుజానికెత్తుకుని విమర్శించే ముందు కేంద్ర ప్రభుత్వం, కర్నాటక ప్రభుత్వం అవే కిట్లను ఆంధ్ర రాష్ట్రానికన్న ఎక్కువ వెచ్చించి ఎందుకు కొనుగోలు చెయవలసి వచ్చిందొ పరిశీలించిన తరువాత విమర్శ చేసి వుంటే సబబుగా ఉండేదని అలాగే తెలుగుదేశం నేతలు కూడా మన రాష్ట్రం కన్న ధర ఎక్కువ చెల్లించి కిట్లను కొనుగోలు చేసిన రాష్ట్రాలను ఎంత కమీషన్ దండుకున్నారో ప్రశ్నించే దమ్ము ఉందా అంటు సవాల్ విసిరారు.
కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే నాడు కిట్లను సరఫరా చేయలేని స్థితిలో ఉన్న కారణంగా ప్రపంచంలో కిట్లు ఎక్కడ ఉన్న మీరే కొనుగోలు చేయండని రాష్ట్రాలకు సూచించిందని ఈ నేపద్యంలోనే నాడు ర్యాపిడ్ టెస్ట్ కిట్ల కోసం కొరియా కంపెనీని ఆశ్రయించామని మన రాష్ట్రం ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ కిట్లు బయట దేశంలో తయారయ్యాయని ఇప్పుడు ఆ కిట్లను మన దేశంలోనే తయారు చేయడానికి అదే కంపెనీకి ICMR అనుమతి ఇచ్చిందని అందువల్ల కిట్ల రేటు తగ్గిందని మనం ముందు చూపుతో పెట్టుకున్న షరతు కారణంగా ఇకపై మన రాష్ట్రానికి అందబొయే కిట్ల రేటు కూడా తగ్గబోతుందని, ఇందుకు సదరు కంపెనీ కూడా అంగీకరించిందని, ఇప్పటివరకు ఆ కంపెనీకి 25% మాత్రమే చెల్లించామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాగే ఇంత వత్తిడి సమయంలో కూడా ఎక్కడా రాజీ పడకుండా సరైన షరతులు పెట్టి నేడు ప్రభుత్వ ధనాన్ని కాపాడిన అధికారులని అభినందిస్తునట్టు చెప్పుకొచ్చారు.
Also Read: కొరియా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లపై చంద్రబాబు దుష్ర్పచారం
రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడెప్పుడు అవీనితి మరక అంటిద్దామా అని ఆత్రుతగా చూస్తున్న ప్రతిపక్షాలకు జగన్ పరిపాలనలో ఆ అవకాశం వచ్చేట్టు కనిపించటంలేదు. ప్రతి విషయంలో గతంలో ఏ ప్రభుత్వం కూడా చూపనంతగా పాలనలో పారదర్శకంగా వ్యవహరిస్తున్న జగన్, తాను చెప్పిన విధంగానే అవినీతీ రహిత పాలన అందిస్తున్నారు అని చెప్పడంలో సందేహం లేదు. ప్రతిపక్షాలు అన్ని ఏకమై కొండను తవ్వి ఎలుకని పట్టిన చందంగా ఆరోపణలు గుప్పించే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ పూర్తి ఆధారాలను బహిర్గతం చేసి ప్రతిపక్షాల నోళ్ళు మూతపడేలా చేస్తున్నారు. ఏది ఏమైనా కిట్ల వ్యవహారంలో అడ్డగోలు ఆరోపణలతో ప్రతిపక్షాలు అభాసుపాలు అవ్వగా ముఖ్యమంత్రి జగన్ తన మార్క్ పాలన ఎలా ఉంటుందో మరో సారి నిరూపించుకునట్టు అయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.