సియం సహాయ నిధికి విద్యుత్ ఉద్యోగుల భారీ విరాళం

కరోనా వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పలు కార్యక్రమాలకు బాసటగా ఇప్పటికే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి వివిద వర్గాలు విరాళాలు ప్రకటించి అండగా నిలిచారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు స్వచందంగా స్పందించి కరోనా మహమ్మారి నుండి రాష్ట్ర ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. దీంతో సి.యం సహాయ నిధికి విరివిగా విరాళాలు వచ్చి చేరుతున్నాయి . రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి పలు వర్గాల నుండి పూర్తి సహకారం అందడం హర్షణీయం.

తాజాగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రాష్ట్ర విద్యుత్ విభాగాల ఉద్యోగులు సైతం తమ వంతు సాయంగా 7.87 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. ట్రాన్స్ కో, జెన్ కో, ఏపిఎస్ పిడిసిఎల్, ఏపి ఈపి డిసి ఎల్ , ఏపి సిపి డిసిఎల్ సంస్థలు సంయుక్తంగా ఈ మొత్తాన్ని సియం సహాయ నిధికి ఇస్తునట్టు ప్రకటించారు. మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్, ట్రాన్స్ కో జేఏండీ కేవియన్ చక్రధర్ తదితరులు ముఖ్యమంత్రిని కలిసి ఈ మేరకు చెక్కుని అందజేశారు.

Show comments