Idream media
Idream media
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తమ పార్టీల వారిని నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ అడ్డుకుంటోందని, అధికారులు వారికి సహకరిస్తున్నారని ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఓ పక్క ఆరోపిస్తుండగా.. మరో వైపు ఆయా స్థానాలకు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా నామినేషన్ల సంఖ్యను ప్రకటించింది.
9696 ఎంపీటీసీ స్థానాలకు గాను 50,064 నామినేషన్లు, 652 జడ్పీటీసీ స్థానాలకు 4,778 నామినేషన్లు దాఖలైనట్లు వెల్లడించింది. నామినేషన్ల సంఖ్యను పార్టీల వారీగా కూడా ప్రకటించింది.
జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు వైసీపీ 1,866, 23,121 నామినేషన్లు, టీడీపీ 1,413, 18,242, బీజేపీ 433, 1,816, జనసేన 270, 2,027, కాంగ్రెస్ 368, 395, బీఎస్‌పీ 82, 138, సీపీఎం 68, 410, సీపీఐ 40, 238, ఎన్‌సీపీ 1, 1, ఇతర పార్టీలు 41, 599, స్వతంత్రులు 196 జడ్పీటీసీ, 3,077 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశాయి.
నామినేషన్ల పరిశీలన ఇప్పటికే పూర్తయింది. రేపు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఆ తర్వాత ఎంత మంది బరిలో ఉంటారన్నదానిపై స్పష్టత వస్తుంది.