Idream media
Idream media
కరోనా కారణంగా దాదాపు రెండున్నర నెలల తర్వాత సమావేశమైన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ రోజు జంబో అజెండాపై సీఎం వైఎస్ అధ్యక్షతన చర్చించిన మంత్రిమండలి భారీ సంఖ్యలో నిర్ణయాలు తీసుకుంది. పరిపాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించిన తీర్మానాలకు, ముసాయిదా బిల్లులకు ఆమోద ముద్ర వేసింది.
కేబినెట్ నిర్ణయాలు ఇవే..
– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపుల్లో 45 –60 ఏళ్ల మహిళలకు ఆర్థిక సహాయం చేసే వైఎస్సార్ చేయూత పథకానికి ఆమోదం.
– చిరు వ్యాపారులకు వడ్డిలేకుండా 10 వేలు రుణం ఇచ్చే జగనన్న తోడు పథకానికి గ్రీన్ సిగ్నల్
– గర్భవతులు, బాలింతలు, పిల్లలకు మరింత పౌష్టికాహారం అందించే వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలకు ఆమోదం.
– ఇళ్ల పట్టాలు, గృహాల మంజూరులో చేసిన తర్వాత ఐదేళ్లు నివాసం ఉన్న తర్వాతే అమ్ముకునేలా హైకోర్టు ఆదేశాల మేరకు తీర్మానం
– విశాఖ జిల్లా ఆనందపురం మండలం జగన్నాథపురం గ్రామంలో గ్రేహౌండ్స్ శిక్షణా స్థలం కోసం 385 ఎకరాల కేటాయింపు.
– ఏపీ బిల్డ్‌లో భాగంగా గుర్తించిన 16 స్థలాల్లో 11 స్థలాల అమ్మకానికి గ్రీన్ సిగ్నల్
– ఏపీ ఉన్నత విద్యా మండలి రెగ్యులేటరీ మానిటరింగ్ కమిషన్ చట్టంలో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీకి ఆమోద ముద్ర.
– విజయనగరం జిల్లా కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటుకు నిర్ణయం
– ఏపీ ఉన్నత విద్యా సోసైటీ కింద తెలుగు, సంస్కృత అకాడమీ సొసైటీ తిరుపతిలో ఏర్పాటుకు నిర్ణయం.
– నాలుగు దఫాలుగా ఫీజు రియంబర్స్‌మెంట్ నిధులు తల్లుల చేతికే ఇచ్చే విధానానికి ఆమోద ముద్ర.
– గుంటూరు, శ్రీకాకుళం, మచిలిపట్నం ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో 282 టీచిగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
– ఏలూరు, ఒంగోలు, తిరుపతి ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో మరో 144 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నిర్ణయం.
– పగటి పూటే రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు 10 వేల మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు నిర్ణయం
– పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు కాంట్రాక్టు రివర్స్ టెండరింగ్ అప్పగించేందుకు హైకోర్టు ముందు జాయింట్ మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ ఫైల్ చేయడానికి నిర్ణయం.
– ఏపీ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా 55 పోస్టుల భర్తీకి ఆమోదం.
– రామాయపట్నం పోర్టు నిర్మాణంపై రైట్స్‌సంస్థ ఇచ్చిన డీపీఆర్‌కు ఆమోదం. మొదటి దశ కింద 802 ఎకరాల్లో మూడు ఏళ్లలో పోర్టు నిర్మాణం.
– గండికోట నిర్వాసితులను తరలించేందుకు అవసరమైన 522.85 కోట్ల రూపాయల మంజూరుకు గ్రీన్ సిగ్నల్.
– వెలిగొండ ప్రాజెక్టులో ఆర్ అండ్ ఆర్‌కు 1301.56 కోట్లు మంజూరు.
– తీగలేరు, ఈప్ట్రన్ మెయిన్ కెనాల్ భూ సేకరణకు 110 కోట్లు మంజూరు
– పన్ను ఎగవేతలపై నిఘా కోసం ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ రెవిన్యూ ఇంటిలిజెన్స్ ఏర్పాటుకు నిర్ణయం. 55 నూతన పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.
– ఏపీ ఫైబర్ నెట్, చంద్రన్న కానుక, చంద్రన్న తోఫా, చంద్రన్న క్రిస్మస్ కానుకల కార్యక్రమాల్లో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ.
– కర్నూలు జిల్లా పిన్నాపురంలో ఇంటిగ్రేటెడ్ రెన్యువల్ ఎనర్జీ ప్రాజెక్టు ఏర్పాటుకు నిర్ణయం.
– భోగాపురం ఎయిర్‌పోర్టు పరిధి 2700 ఎకరాల నుంచి 2200 ఎకరాలకు కుదింపు.