iDreamPost
android-app
ios-app

సెంటిమెంట్ రిపీట్ అయితే ఫ్లాప్ తప్పదు – Nostalgia

  • Published Aug 01, 2021 | 7:49 AM Updated Updated Aug 01, 2021 | 7:49 AM
సెంటిమెంట్ రిపీట్ అయితే ఫ్లాప్ తప్పదు  – Nostalgia

సెంటిమెంట్ అనొచ్చు లేదా అలా అనుకోకుండా కుదిరిపోయింది అనొచ్చు కొన్ని పదాలు కాంబినేషన్లు దర్శకులు వరసగా ఫాలో కావడం కాకతాళీయం అనలేం. దానకో ఉదాహరణ చూద్దాం. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు 1992లో మోహన్ బాబు హీరోగా రూపొందించిన ‘అల్లరి మొగుడు’ ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్యకృష్ణ, మీనా హీరోయిన్లుగా ఎంఎం కీరవాణి అదిరిపోయే పాటలతో కలెక్షన్ కింగ్ ని ఇద్దరు పెళ్లాల మొగుడిగా చూపించి ప్రేక్షకులతో శబాష్ అనిపించుకుంది, వసూళ్ల వర్షం కురిపించింది. ముఖ్యంగా పాటల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ముద్దిమ్మంది ఓ చామంతి, నా పాట పంచామృతం ఎవర్ గ్రీన్.

Also Read: స్వచ్ఛమైన ప్రేమకు అభినందన – Nostalgia

1993లో యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ హీరోగా ఈయనే తీసిన ‘అల్లరి ప్రియుడు’ మరో పెద్ద మ్యూజికల్ హిట్. అంకుశం, ఆగ్రహం లాంటి పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాలతో ఒక డిఫరెంట్ ఇమేజ్ తెచ్చుకున్న రాజశేఖర్ ని లవ్ బాయ్ గా చూపించిన తీరు వందరోజుల దాకా పరుగులు పెట్టించింది. రోజ్ రోజ్ రోజా పువ్వా, అహో ఒక మనసుకు నేడే పుట్టినరోజు, అందమా నీ పేరేమిటి అందమా ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పాటా ఆణిముత్యమే. 1994లో జగపతిబాబుని కూడా ఇలాగే చూపించాలన్న ఆలోచనతో తీసిన మూవీ ‘అల్లరి ప్రేమికుడు’. ఇందులో ముగ్గురు హీరోయిన్లని పెట్టేశారు. సౌందర్య, రంభ, కాంచనలతో క్రేజీ కాంబో సెట్ చేశారు.

Also Read: వెలుగు సరిపోని నక్షత్రాలు – Nostalgia

సినిమా విడుదలకు ముందే ఆడియో సూపర్ సక్సెస్. కానీ ఈ మూవీ సెంటిమెంట్ ని అందుకోలేకపోయింది. అంచనాలకు తగ్గట్టు లేక డ్రామా కాస్త అటుఇటు కావడంతో అల్లరి ప్రేమికుడు యావరేజ్ దగ్గరే ఆగిపోయింది. తిరిగి 2005లో నితిన్ డ్యూయల్ రోల్ లో రాఘవేంద్ర రావు ‘అల్లరి బుల్లోడు’ తీశారు. ఇది అన్నింటి కంటే దారుణంగా బోల్తా కొట్టి అల్లరి పదానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఈ నాలుగు సినిమాలకు సంగీతం కీరవాణే కావడం విశేషం. దర్శకేంద్రులు తీయని అల్లరి సినిమాలు కూడా ఉన్నాయి. నాగార్జున అల్లరి అల్లుడు, నరేష్ అల్లరి, మీనా అల్లరి పిల్ల, కృష్ణ అల్లరి బావ, శివాజీరాజా అల్లరి పెళ్ళాం చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడంత.

Also Read: ఆప్యాయతలకు నిలువుట్టద్దం ఈ కుటుంబం – Nostalgia