iDreamPost
android-app
ios-app

స్వాగతిస్తున్నా.. కానీ .. కరణం చేరికపై ఆమంచి..

స్వాగతిస్తున్నా.. కానీ .. కరణం చేరికపై ఆమంచి..

ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, ఆయన తనయుడు కరణం వెంకటేష్‌లు టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరడంపై అధికారపార్టీ స్థానిక కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరణం తమ పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నాని చెప్పిన ఆమంచి తనకు ఓ చిన్న బాధ ఉందన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కరణం పార్టీలో చేరి ఉంటే బాగుండేదని ఆమంచి వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము అన్ని స్థానాలు గెలుస్తామని, ఇప్పుడు వారి చేరికతో వారి వల్ల గెలిచామనే పేరు వచ్చే అవకాశం ఉందన్నారు. ఆ పేరు లేకుండా ఈ ఎన్నికల తర్వాత వారు చేరి ఉంటే బాగుండేదన్నారు. అయినా ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు తాము అంతా సిద్ధం చేశామన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్‌ స్థానాలకు 106 మంది అభ్యర్థులను ఫైనల్‌ చేశామని ఆమంచి చెప్పారు.

వైసీపీలో చేరుతున్నట్లు ఎమ్మెల్యే కరణం బలరాం నిన్న గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ వెంటనే తన కుమారుడు వెంకటేష్, అనుచరులతో కలసి తాడేపల్లిలో సీఎం జగన్‌కు కలిశారు. వెంకటేష్‌కు సీఎం జగన్‌ కండువా కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. బలరాం పార్టీని వీడడంతో.. టీడీపీ చీరాల ఇన్‌చార్జిగా యడం బాలాజీని చంద్రబాబు ప్రకటించారు.