అంబానీ కొడుకుకి రూల్స్ వర్తించవా.. మండిపడుతున్న నెటిజన్స్

దేశంలో వాహనాదారులు అధికారులు ప్పటికప్పుడు కఠినమైన నిబంధనలను జారీ చేస్తుంటారు. ముఖ్యంగా వాటిలో ద్విచక్ర వాహనదారులైతే హెల్మెట్‌ పెట్టుకోవడం,, కార్లలో ప్రయాణించే వారు అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలని అనే రూల్స్ ను జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ట్రాఫిక్ రూల్స్ ను ముకేశ్ అంబానీ కొడుకు ఆకాశ్ అంబాని ఉల్లఘించరనే వార్త ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

దేశంలో వాహనాదారులు అధికారులు ప్పటికప్పుడు కఠినమైన నిబంధనలను జారీ చేస్తుంటారు. ముఖ్యంగా వాటిలో ద్విచక్ర వాహనదారులైతే హెల్మెట్‌ పెట్టుకోవడం,, కార్లలో ప్రయాణించే వారు అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలని అనే రూల్స్ ను జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ట్రాఫిక్ రూల్స్ ను ముకేశ్ అంబానీ కొడుకు ఆకాశ్ అంబాని ఉల్లఘించరనే వార్త ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

దేశంలో వాహనాదారులు నిత్యం ట్రాఫిక్ సమస్య అనేది వెంటాడుతూనే ఉంటుంది. ముఖ్యంగా ప్రధాన నగరంలో అయితే ఈ ట్రాఫిక్ సమస్యలు అడుగడుగునా అద్దం పట్టినట్లుగా కనిపిస్తునే ఉంటాయి. ఇక ట్రాఫిక్ సమస్యలకు తోడు ప్రమాదాలు కూడా ఎక్కువగానే చోటు చేసుకుంటాయి. ఈ క్రమంలోనే.. ప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టికొని అధికారులు వాహనదారులకు ఎప్పటికప్పుడు కఠినమైన నిబంధనలను జారీ చేస్తుంటారు. ముఖ్యంగా వాటిలో ద్విచక్ర వాహనదారులైతే హెల్మెట్‌ పెట్టుకోవడం,, కార్లలో ప్రయాణించే వారు అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలని అనే రూల్స్ ను జారీ చేశారు. అయితే ఈ రూల్స్ ను ఇప్పటికి చాలామంది పాటించకపోవడంతో.. ప్రమాదాలకు గురవ్వడం, ప్రాణాలు పొగొట్టుకోవడం, పోలీసులకు జరిమానా కట్టడం వంటివి చేస్తుంటారు. కనుక ట్రాఫిక్ రూల్స్ ని ఉల్లంఘిస్తే ఎలాంటి వారికైనా అధికారులు కట్టుదిట్టమైనా చర్యలు తీసుకోవడం తప్పనిసరి. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ, తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కొడుకు ఆకాశ్ అంబానీ మాత్రం ఈ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రస్తుతం ఈ వార్త కాస్త వైరల్ గా మారడంతో.. నెటిజన్స్ దీనిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తాజాగా ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపణలు వచ్చాయి. కాగా, ఇటీవలే సీట్ బెల్ట్ పెట్టుకోకుండా.. ఆయన ఖరీదైన సూపర్‌ లగ్జరీ కారులో ప్రయాణించినట్లు ఓ వీడియో వైరల్ అవ్వడంతో.. అప్పటి నుంచి ఆకాశ్ అంబానీ చుట్టూ తీవ్ర వివాదం నడుస్తుంది. ప్రస్తుతం ముఖేష్ అంబానీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ పెద్ద లగ్జరీ కార్ల ప్రేమికులు ఉన్నారు. అయితే వారి ఇంట్రలో  అత్యంత ఖరీదైన మోడల్ కార్లలో ఫెరారీ ప్రోసాంగ్ ఒకటి. ఇక ఈ కారును అంబానీ కుటుంబం ఇటీవలే కొనుగోలు చేసింది. ఇది ఫెరారీ మొదటి ఎస్‌యూవీగా ఉంది. ఇక ఈ కారు ధర రూ.10.5 కోట్లకు పైగా ఉంటుంది. అయితే ఈ కారులోనే ఆకాశ్ అంబానీ సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కారులో ప్రయాణించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఈ క్రమంలోనే.. దేశంలో అత్యంత ధనవంతుడి  కుమారుడు ఇలా ట్రాఫిక్ ఉల్లంఘనలో చిక్కుకోవడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే ఈ ఉల్లంఘన కారణంగా ఆకాశ్ అంబానీపై చర్యలు తీసుకుంటారా అని పలువురు నెటిజన్లు తమదైన శైలిలో ప్రశ్నిస్తున్నారు. అయితే భారత్లో సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే రూ.1,000కు పైగా జరిమానా విధిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ తరహా పెనాల్టీ ఆకాశ్ అంబానీపై పడే అవకాశం ఉందా  లేదా  అని నెట్టింట చర్చలు కొనసాగుతున్నాయి. మరి, అంబానీ కొడుకు ఆకాశ్ అంబానీ ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లఘించడనే వార్త పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments