iDreamPost
iDreamPost
అడవి శేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన హిట్ 2 అంచనాలను మించి మొదటి రోజు వసూళ్లను దక్కించుకుంది. ఉదయం ఆటలకు కొంత నెమ్మదిగా ఉన్నా టాక్ త్వరగా స్ప్రెడ్ అవ్వడంతో ఒక్కసారిగా ఆక్యుపెన్సీలు పెరిగిపోయాయి. ముఖ్యంగా నగరాలు పట్టణాల్లో సాయంత్రం ప్లస్ సెకండ్ షోలు దాదాపు హౌస్ ఫుల్స్ అయ్యాయి. సి సెంటర్స్ లో స్లోగా ఉన్నా మిగిలిన వాటితో పోలిస్తే చాలా మెరుగ్గా కనిపిస్తున్న మాట వాస్తవం. సైకో కిల్లింగ్ ని కాన్సెప్ట్ గా తీసుకుని కథ కంటే ఎక్కువగా కథనంతో మేజిక్ చేసిన శైలేష్ మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఒక మీడియం రేంజ్ మూవీకి ఆరు కోట్లకు పైగా ఫస్ట్ డే షేర్ రావడం చిన్నది కాదు.
ఇక లెక్కల్లోకి వెళ్తే నైజామ్ 1 కోటి 90 లక్షలు, సీడెడ్ 40 లక్షలు, ఉత్తరాంధ్ర 53 లక్షలు, ఈస్ట్ వెస్ట్ కలిపి 48 లక్షలు, గుంటూరు 32 లక్షలు, కృష్ణా 22 లక్షలు, నెల్లూరు 15 లక్షలు ఇలా ఏపీ తెలంగాణ కలిపి చూస్తే 4 కోట్ల దాకా షేర్ వచ్చింది. కర్ణాటకతో పాటు రెస్ట్ అఫ్ ఇండియా 45 లక్షలు రాగా, ఓవర్సీస్ లో ఏకంగా 95 లక్షలు వసూలు చేసింది. వరల్డ్ వైడ్ షేర్ 6 కోట్ల 40 లక్షలకు చేరుకుంది. రెండో రోజు బుకింగ్స్ బాగున్నాయి కాబట్టి ఆదివారంతో కలిపి ఈజీగా నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్లు అంచనా వేస్తున్నారు. థియేట్రికల్ బిజినెస్ 14 కోట్లకు పైగా జరిగిన నేపథ్యంలో ఇంకో 9 కోట్లు వచ్చేస్తే లాభాలు స్టార్ట్ అవుతాయి
మొత్తానికి హిట్ 2 ఆశించినదాని కన్నా పెద్ద హిట్టు కొట్టేలా ఉండటం నిర్మాత నానికి మాములు ఆనందం ఇవ్వడం లేదు. థర్డ్ కేస్ లో తనే నటించాలని డిసైడ్ అయ్యాడు కాబట్టి దాని తగ్గ హైప్ ఇప్పుడీ సక్సెస్ వల్ల వచ్చేసింది. ఈ మల్టీ వర్స్ ని కంటిన్యూ చేస్తామని, సిరీస్ కో కొత్త హీరో వస్తాడని, ఒక కామన్ పాయింట్ దగ్గర ఏదో ఒక భాగంలో అందరినీ కలుపుతామని శైలేష్ చెప్పడం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. కలెక్షన్ల ప్రకారం చూస్తే హిట్ 1ని ఈజీగా ఓవర్ టేక్ చేస్తున్న అడవి శేష్ కు మేజర్ వల్ల వచ్చిన మార్కెట్ ప్లస్ ఇమేజ్ బాగా హెల్ప్ అవుతోంది. పోటీగా వచ్చిన మట్టి కుస్తీ ప్రమోషన్ లోపం వల్ల ఆశించిన పోటీ ఇవ్వలేక వసూళ్ల వేటలో పోరాడుతోంది.