iDreamPost
android-app
ios-app

నాని బర్త్ డే ట్రీట్ ఇవ్వనున్న సరిపోదా శనివారం టీమ్?

  • Published Feb 18, 2024 | 3:10 PM Updated Updated Feb 18, 2024 | 3:10 PM

Saripoda Sanivaram Surprise: న్యాచురల్ స్టార్ నాని వరుస ప్రాజెక్టులతో కెరీర్ లో జోరు పెంచేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సరిపోదా శనివారం టీమ్ నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది.

Saripoda Sanivaram Surprise: న్యాచురల్ స్టార్ నాని వరుస ప్రాజెక్టులతో కెరీర్ లో జోరు పెంచేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సరిపోదా శనివారం టీమ్ నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది.

  • Published Feb 18, 2024 | 3:10 PMUpdated Feb 18, 2024 | 3:10 PM
నాని బర్త్ డే ట్రీట్ ఇవ్వనున్న సరిపోదా శనివారం టీమ్?

గ‌త ఏడాది చివర్లో వ‌చ్చిన హాయ్ నాన్న సినిమాతో మంచి హిట్ అందుకున్నారు న్యాచురల్‌ స్టార్‌ నాని. ఇక ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో తన పూర్తి దృష్టిని నెక్ట్స్ ప్రాజెక్ట్‌ ‘సరిపోదా శనివారం’ పైనే పెట్టారు. నాని 31వ సినిమాగా వ‌స్తున్న ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వ‌హిస్తున్నారు. ఇది వరకే ‘అంటే సుందరానికి’ సినిమాకి నాని – వివేక్ కలిసి పని చేశారు. అయితే ఆ సినిమా అనుకున్న స్థాయిలో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించకపోయినా ఒక వర్గం ప్రేక్షకులు ఆ సినిమాని బాగా ఆదరించారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుండ‌గా… వచ్చే శనివారం అంటే నాని పుట్టిన రోజు సినిమా నుంచి ఒక స్పెషల్ అప్డేట్ ఇవ్వబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

నాని బర్త్ డే సందర్భంగా ఫిబ్రవరి 24, 2024న స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఆ స్పెషల్ ట్రీట్ ఏంటి అనే దానిపై ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉన్నప్పటికీ ఆ రోజు స్పెషల్ టీజర్ ను విడుదల చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు సమాచారం. ఫాంటసీ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఇక టీజర్ తో అవి మరింత పెరగవచ్చు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య సగర్వంగా నిర్మిస్తున్న ‘సరిపోదా శనివారం’లో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఎస్ .జె.సూర్య ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. గతేడాది నానికి బాగా కలిసి వచ్చింది. సమ్మర్ లో దసరా, డిసెంబర్ లో హాయ్ నాన్న సినిమాలను విడుదల చేయగా రెండు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్లు గా నిలిచాయి. దసరా ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేయగా, హాయ్ నాన్న 70 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş