iDreamPost

అడవి శేష్ అసలు పేరు తెలుసా? ఏడిపిస్తున్నారని పేరు మార్చుకున్నాడట!

అడవి శేష్ అసలు పేరు మీకు తెలుసా? ఆ పేరు పెట్టుకోవడంతో.. అందరూ ఏడిపిస్తున్నారన్న బాధతో తన పేరును శేష్ గా మార్చుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా అతడే వెల్లడించాడు. ఇంతకీ అతడి అసలు పేరు ఏంటి? తెలుసుకుందాం పదండి.

అడవి శేష్ అసలు పేరు మీకు తెలుసా? ఆ పేరు పెట్టుకోవడంతో.. అందరూ ఏడిపిస్తున్నారన్న బాధతో తన పేరును శేష్ గా మార్చుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా అతడే వెల్లడించాడు. ఇంతకీ అతడి అసలు పేరు ఏంటి? తెలుసుకుందాం పదండి.

అడవి శేష్ అసలు పేరు తెలుసా? ఏడిపిస్తున్నారని పేరు మార్చుకున్నాడట!

అడవి శేష్.. టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోగా ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నాడు. గూఢాచారి, హిట్ 2, ఎవరు సినిమాలతో శేష్ పేరు మారుమోగిపోయింది. హీరోగా, రైటర్ గా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. ప్రస్తుతం గూఢాచారి 2, డెకాయిట్ మూవీలో హీరోగా నటించడమే కాకుండా.. ఈ రెండు చిత్రాలకు రచయితగా కూడా వ్యవహరిస్తున్నాడు. కాగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు.. తన అసలు పేరు చెప్పి అందరికి షాకిచ్చాడు. ఆ పేరు పెట్టుకోవడంతో అందరూ ఏడిపిస్తున్నారని పేరు మార్చుకున్నట్లు తెలిపాడు. ఇంతకీ అడవి శేష్ అసలు పేరు ఏంటంటే?

సాధారణంగా ఇండస్ట్రీలో వచ్చాక తమ ఒరిజినల్ పేరును మార్చుకుని స్క్రీన్ నేమ్ గా ఓ పేరును పెట్టుకుంటూ ఉంటారు కొందరు నటీ, నటులు. ఆ పేర్లు డైరెక్టర్లు, నిర్మాతలు పెడుతూ ఉంటారు. అయితే తాను ఇండస్ట్రీలోకి రాకముందే.. తన పేరు మార్చుకున్నట్లు చెప్పుకొచ్చాడు స్టార్ హీరో అడవి శేష్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అడవి శేష్ మాట్లాడుతూ..”నా ఒరిజినల్ పేరు సన్నీ చంద్ర. మా నాన్న సునీల్ గవాస్కర్ అభిమాని, అందుకే సన్నీ అని పెట్టారు. ఇక నేను అమెరికాలో ఉన్నప్పుడు నా పేరు చూసి అందరూ ఏడిపించేవారు.

అక్కడ ఆరెంజ్ ప్లేవర్ లో సన్నీ డిలైట్ అనే ఓ జ్యూస్ ఉండేది.. అలాగే సన్నీ లియోన్ అప్పట్లో పాపులర్. ఇక నా పేరులో సన్నీ ఉండటంతో.. అందరూ నన్ను ఏడిపించేవారు. నేను కూడా ఎంతో బాధపడేవాడిని. ఇదే విషయం మా నాన్నతో చెప్పాడు. ఆయన శేష్ అనే పేరు పెట్టుకో అని సూచించారు. నన్ను ఏడిపించారన్న బాధతోనే పేరు మార్చుకున్నాను” అంటూ పేరు మార్చుకోవడం వెనకున్న బాధను వెల్లడించాడు శేష్. కాగా.. ప్రస్తుతం అడవి శేష్ గూఢాచారి 2, డెకాయిట్ చిత్రాల్లో నటిస్తున్నాడు. డెకాయిట్ లో శృతిహసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటున్నాయి. ఇక డెకాయిట్ లోని ప్రతీసిన్ అండ్ డైలాగ్ ను తెలుగుతో పాటుగా హిందీలోనూ చిత్రీకరించడం విశేషం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి