iDreamPost
iDreamPost
రాష్ట్రంలో అదాని గ్రూపు పెట్టుబడులు పెట్టబోతోందంటూ ఎల్లోమీడియా తాజాగా చెప్పింది. జగన్మోహన్ రెడ్డితో మే 30వ తేదీన అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ శాంతిలాల్ సమావేశమైనట్లు చెప్పింది. ఈ సమావేశంలో కృష్ణపట్నం, మచిలీపట్నం ఓడరేవుల అభివృద్ధి, విశాఖపట్నంలో ప్రతిష్టాత్మక డేటా సెంటర్ ఏర్పాటుకు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టబోతున్నదట. తమ పెట్టుబడుల ప్రతిపాదనలపై ముఖ్యమంత్రితో గౌతమ్ వివరంగా చర్చించారట. అందుకు జగన్మోహన్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారని ఎల్లోమీడియా చెప్పింది.
ఇక్కడ గమనిచాంల్సిన విషయం ఏమిటంటే ఇదే ఎల్లోమీడియా, చంద్రబాబు అండ్ కో అదాని గ్రూపు ఏపి నుండి తరలిపోయినట్లు విపరీతమైన బురద చల్లేసింది. చంద్రబాబునాయుడు సిఎంగా ఉన్నంత కాలం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టటానికి పారిశ్రామికవేత్తలు పోటి పడినట్లు కలరింగ్ ఇచ్చింది. ఎప్పుడైతే జగన్ అధికారంలోకి వచ్చాడో వెంటనే పెట్టుబడులన్నీ ఏపి నుండి వెళ్ళిపోయాయని బుర్రకు ఎంత తోస్తే అంతా రాసేసింది. చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చిందీ అబద్ధమే అలాగే జగన్ అధికారంలోకి రాగానే ఏపి నుండి వెళ్ళిపోయాయని చెప్పిందీ అబద్ధమే.
ఏ పారిశ్రామికవేత్తయినా పెట్టబడులు పెట్టేముందు ఆ రాష్ట్రంలో అమలవుతున్న పాలసీలు, రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే తమకేంటి లాభమన్న విషయాన్నే ముందు చూస్తాడు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్ పాలసీలు చూసే అనేకమంది పారిశ్రామికవేత్తలు ఏపివైపు చూస్తున్నారు. ఈ మధ్యనే కియా మోటార్స్ కూడా విస్తరణకు నిర్ణయించుకోవటం అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదానీ గ్రూపు ఏపిలో పెట్టుబడులు పెట్టడానికి రెడీ అయ్యిందంటే అమలవుతున్న పాలసీలే కారణం. కాకపోతే ఏపిలో అదాని గ్రూపు పెట్టుబడులు పెడుతోందన్న విషయాన్ని జీర్ణించుకోలేని ఎల్లోమీడియా ఈ వార్తను 8 పేజీలో చాలా చిన్నదిగా అచ్చేసింది.
ఏపికి పెట్టుబుడులు రావటాన్ని ఎల్లీమీడియా తట్టుకోలేకపోతోందన్న విషయం దీంతో అర్ధమైపోయింది. చంద్రబాబు హయాంలో కేవలం చర్చలు జరిపినా పెట్టుబడులు వచ్చేసినట్లు, పరిశ్రమలు ప్రారంభమైపోయినట్లుగా ఎంత హడావుడి చేసిందో అందరూ చూసిందే. అప్పట్లో ఏమీ జరగకపోయినా అంతా జరిగిపోయిందని, ఇపుడు పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుంటుంటే కూడా ఏమీ జరగటం లేదని చెప్పటం లేకపోతే అసలు ఆ విషయాన్నే పట్టించుకోకపోవటం ఎల్లోమీడియాకు మాత్రమే సాధ్యం.
తొందరలోనే 18 వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏపికి తొమ్మిది పరిశ్రమలు వస్తుంటే దాన్ని కూడా ఎల్లోమీడియా పట్టించుకోలేదు. తొమ్మిది పరిశ్రమల యాజమాన్యాలు ప్రభుత్వంతో చర్చలు జరపటం, ఒప్పందాలు చేసుకోవటం కూడా పూర్తయ్యింది. అనంతపురం, నెల్లూరు, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాలో పరిశ్రమలు రాబోతున్నాయి. కరోనా వైరస్ కారణంగా లేటయ్యింది కానీ లేకపోతే ఈ తొమ్మిది పరిశ్రమల ఏర్పాటు ఈపాటికి మొదలయ్యేదే. మొత్తానికి తమకు ఇష్టమున్నా లేకపోయినా ఏపికి పెట్టుబడులు వస్తున్న విషయాన్ని ఎక్కడో ఓ మూలైనా అచ్చేసి తీరాల్సిన పరిస్ధితిలు ఏర్పడుతున్నందుకే పాపం ఎల్లోమీడియా ఎంత బాధపడుతోందో.