ఏదైనా సినిమా థియేటర్లో విడుదలకు ముందు సెన్సార్ బోర్డు వెళ్తుంది. అక్కడ సినిమాల్లో మితిమీరిన రోమాన్స్ సీన్స్ ఉంటే సెన్సార్ బోర్డు.. కత్తెరకు పని చెబుతూ ఉంటుంది. ఇలా సినిమాలకు పలు నిబంధనలు ఉండడంతో చాలా తక్కువగానే రొమాంటిక్ సన్నివేశాలు కనిపిస్తాయి. కానీ ఓటీటిల హవా బోల్డ్ వెబ్ సిరీస్ ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది అని చెప్పాలి. అవసరం లేకపోయిన శృతిమించిన రోమాన్స్ సీన్స్ వెబ్ సిరీస్ లో పెడుతూ.. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అదే విధంగా సినిమాల్లో ఎంతో హుందా గా ఉండే పాత్రలో నటించిన హీరో హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్ ల్లో బోల్డ్ గా నటిస్తున్నారు.
సీతారామం సినిమాలో సీత పాత్రతో మృణాల్ ఠాగూర్ ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది.. ఈ అమ్మడు కూడా సినిమాల్లో ఎంతో పద్ధతిగా కనిపించి.. వెబ్ సిరీస్ లో ఓ రెంజ్ లో రెచ్చిపోయింది. ఇటీవలే లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లో రొమాన్స్ తో ఈ అమ్మడు రెచ్చిపోయింది. ఇదొక యాంథాలజీ సిరీస్. జీవితంలో సె*క్స్ ప్రాముఖ్యతను తెలియజేసేలా ‘లస్ట్ స్టోరీస్ 2’ సిరీస్ రూపొందింది. జూలై 29 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో ఓ బోల్డ్ సీన్‌లో నటించిన మృణాల్ ఫిక్స్, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ బెంగాలి బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో సె*క్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ..”శృంగారం, లస్ట్ గురించి ప్రతి ఇంట్లో ఎంతో మెచ్యూర్ మైండ్ ఓపెన్ గా మాట్లాడుకోవడం ఎంతో ముఖ్యం అని నేను నమ్ముతాను.
ముఖ్యంగా టీనేజ్ లో ఉన్న వారికి ఇది ఎంతో అవసరం. ఇలాంటి అంశాలపై ఇంట్లోని పిల్లలకు నిజాయితీగా వివరించేందుకు ఒకరైన ఉండాలి. అప్పుడే బయట నుంచి వచ్చే తప్పుడు సమాచారం పైన యుక్త వయస్సుపిల్లలకు తెలుస్తుంది” అంటూ మృణాలు ఠాగూర్ చెప్పుకొచ్చింది. సీతారామం సినిమాలో ఆమెను చూసిన తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ సినిమాలో ఆమె చేసిన సీత పాత్ర ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. అయితే తర్వాత వచ్చిన బాలీవుడ్ సినిమాలు, సిరీస్, సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన హాట్ ఫొటోలతో మన తెలుగు అభిమానులు కాస్త హార్ట్ అయ్యారనే చెప్పాలి. తాజాగా మృణాల్ ఠాగూర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.