Keerthi
ఈ మధ్య కాలంలో టికెట లేకుండా రైల‍్లో ప్రయాణిస్తున్న ప్యాంసిజర‍్ల పై టీసీలు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో అందరికి తెలిసిందే. అయితే ఆ సంఘటనలకు భిన్నంగా తాజాగా ఓ ప్రయాణికుడు ఏకంగా టీటీఈ పై దారుణంగా దాడి చేశాడు. ఎందుకంటే..
ఈ మధ్య కాలంలో టికెట లేకుండా రైల‍్లో ప్రయాణిస్తున్న ప్యాంసిజర‍్ల పై టీసీలు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో అందరికి తెలిసిందే. అయితే ఆ సంఘటనలకు భిన్నంగా తాజాగా ఓ ప్రయాణికుడు ఏకంగా టీటీఈ పై దారుణంగా దాడి చేశాడు. ఎందుకంటే..
Keerthi
ఈ మధ్య కాలంలో టికెట లేకుండా రైల‍్లో ప్రయాణిస్తున్న ప్యాంసిజర‍్ల పై టీసీలు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో అందరికి తెలిసిందే. టికెట్ల తనిఖీ కోసం వచ్చిన టీసీలు.. ప్రయాణికుల వద్ద టికెట్లు లేకపోయే సరికి ఆగ్రహానికి గురవుతూ.. వారి పై దాడులు చేస్తున్నారు. కాగా, రైల్లో టీసీలకు ప్రయాణికుల మధ్య ఇలాంటి ఘటనలు ఇంతకముందు చాలానే చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు రైల్లలో ప్రయాణించిన వారి పై టీసీలు ప్రవర్తించే తీరు ఒక ఎత్తు అయితే.. తాజాగా జరిగిన ఓ సంఘటనలో మాత్రం ఓ ప్రయాణికుడే ఏకంగా టీసీ పై దాడికి పాల్పడ్డాడు. ఎందుకంటే..
తాజాగా రైలు టికెట్ గురించి అడిగినందుకు గాను ఓ ప్రయాణికుడు ఏకంగా టీటీఈ నే దారుణంగా కొట్టి దాడి చేశాడు. ఈ ఆశ్చర్యకరమైన ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. కాగా, మంగళూరు నుంచి తిరువనంతపురం వెళ్తున్న మావేలి ఎక్స్‌ప్రెస్‌లో.. రిజర్వేషన్ కోచ్‌లో ఉన్న రాజస్థాన్‌కు చెందిన టీటీఈ విక్రమ్‌కుమార్ మీనాపై ఓ వ్యక్తి దాడి చేశాడు. అయితే టీటీఈపై దాడి చేసినందుకు తిరువనంతపురం వాసి ఎస్ స్టాలిన్‌ను రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే రిజర్వ్‌డ్ టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నందున జనరల్ కోచ్‌లోకి వెళ్లమని చెప్పినందుకు స్టాలిన్ అనే ప్రయాణికుడు టీటీఈ దాడి చేసినట్లు సమాచారం. అంతేకాకుండా.. కోజికోడ్ నుంచి రైలు ఎక్కినప్పటి నుంచి నిందితుడు గొడవ పడ్డాడని టీటీఈ తెలిపారు. అతన్ని జనరల్ కోచ్‌గా మార్చమని కోరినప్పటికీ, అతను చేయలేదు. అనంతరం కోపోద్రిక్తుడైన ప్రయాణికుడు టీటీఈపై దాడి చేశాడు.
కాగా, ఆ ప్రయాణికుడు తన ముఖం, ముక్కుపై పలుమార్లు కొట్టాడని టీటీఈ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇక దెబ్బలు తగిలి ముక్కు నుంచి రక్తం కారుతున్న టీటీఈ చిత్రాలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఘటన జరిగిన తర్వాత కోజికోడ్ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం నిందితుడిని తిరుర్ వద్ద రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన టీటీఈ ని మొదట షోరనూర్‌లోని ఆస్పత్రిలో చేర్చి, అనంతరం పాలక్కాడ్ రైల్వే ఆస్పత్రికి తరలించారు. అయితే ఇప్పటి వరకు టికెట్ కోసం ప్రయాణికులపై టీటీఈ దాడి చేయడం చూసి ఉంటాం. కానీ, ఆ ఘటనలకు భిన్నంగా టీటీఈనే ఓ ప్రయాణికుడు అతి దారుణంగా దాడి చేయడం అందరికి ఆశ్చర్యం కలిగించింది. మరి, టికెట్ అడిగితే టీటీఈ పై దాడి చేసే ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.