అందరి కళ్ళు విశాఖ పైనే..

  • Published - 09:21 AM, Wed - 25 December 19
అందరి కళ్ళు విశాఖ పైనే..

ఒకవైపు విశాఖని కార్యనిర్వాహక రాజధాని గా చేస్తామంటూ అసెంబ్లీలో జగన్ చేసిన ప్రకటన, తదనంతరం రాజధాని పై జియన్ రావు కమిటీ తుది నివేదిక, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ మధ్యంతర నివేదిక లో కూడా ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసిన ప్రకటనకి బలం చేకూర్చుతూ విశాఖని కార్యనిర్వాహక రాజధానిగా చెయ్యాలని సూచించడం, మంత్రులు విశాఖకు అనుకూలంగా ప్రకటనలు చేస్తుండడంతో పాటు ఈ నెల 27 న విశాఖలో జరగనున్న క్యాబినెట్ సమావేశంలో 3 రాజధానులు అంశంపై పలు కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తుంది

అమరావతి రాజధానిగా ప్రకటించిన తర్వాత అమరావతి బయట జరుగుతున్న మొట్ట మొదటి కేబినెట్ సమావేశం ఇదే కావడంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే అధికారులు తమ ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనిపై రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ 27న విశాఖలో జరగనున్న కేబినెట్ సమావేశానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఈ సమావేశంలోనే జియన్ రావు నివేదిక పై చర్చించి కీలక నిర్ణయం తీసుకుంటామని, అదేరోజున మంత్రివర్గంలో తీసుకున్ననిర్ణయాలని అధికారికంగా వెల్లడిస్తామని చెప్పారు. అమరావతిలో ఆందోళన చేస్తున్న రాజధాని రైతులను ఉద్దేశించి ఈ కేబినెట్ సమావేశంలోనే భూములిచ్చిన రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు మరో రెండు మూడు రోజులు విశాఖ లోనే ఉండనున్నారు. ఈ నెల 28,29 న విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున జరపతలపెట్టిన విశాఖ ఉత్సవాలతో పాటు పలు శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని తెలుస్తుంది.

ఇప్పటికే విశాఖ లో కొర్ క్యాపిటల్ ఏర్పాటుకి అనువైన స్థలాలను గుర్తించాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుండి జిల్లా అధికారులకి అనధికారికంగా ఆదేశాలు అందాయని, జిలా కలెక్టార్ జాయిట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కొన్ని అనువైన ప్రాంతాలను ఎంపిక చేశారని మీడియా ఊహాగానాల నేపథ్యంలో ఈ వారం రోజుల్లో జరగబోయే పరిణామాలు కీలకం కానున్నాయని ఇప్ప

Show comments