రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై చర్చించేందుకు ఏర్పాటైన హైపవర్ కమిటీ నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశం కానుంది. సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. రాజధాని రైతుల సమస్యలపై హైపవర్ కమిటీ సభ్యులు సీఎం వైఎస్ జగన్‌తో చర్చించనున్నారు. ఇప్పటికే జీఎన్ రావు, బీసీజీ నివేదికలను హైపవర్ కమిటీ పరిశీలించిన సంగతి తెలిసిందే. మూడు సార్లు సమావేశమైన కమిటీ సభ్యులు రెండు నివేదికలపై విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే నేడు చివరిసారిగా […]
అందరు ఊహించినట్టు ఈ నెల 20 న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలో రాజధాని తరలింపు, అధికార వికేంధ్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి పై ప్రభుత్వానికి జియన్ రావు, బోస్టన్ కమిటీలు ఇచ్చిన నివేదికలతో పాటు గతంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామ కృష్ణ కమిటీ నివేదిక పై కూడా అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలోనే రాష్ట్రంలో అభివృద్ధి వికేంధ్రీకరణతో పాటు కార్యానిర్వాహక రాజధాని, శాసన నిర్వాహక రాజధాని, […]
జీఎన్ రావు, బీసీజీ కమిటీల నివేదికలపై చర్చించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ సమావేశం ముగిసింది. కమిటీ అధ్యక్షుడు, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి నేతృత్వంలో ఈ రోజు రెండోసారి హైపవర్ కమిటీ విజయవాడలో సమావేశమైంది. రెండు కమిటీల నివేదికలల్లోని అంశాలను పరిశీలించిన కమిటీ, వాటిపై మరింత క్షణ్నంగా చర్చించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అందుకే మరో మారు ఈ నెల 13వ తేదీన సమావేశం కావాలని నిర్ణయించినట్లు సమాచారశాఖ మంత్రి పేర్ని నాని […]
ఆంధ్రప్రదేశ్ రాజధాని, రాష్ట్ర అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణను సిఫార్సు చేసిన జీఎన్ రావు, బీసీజీ కమిటీల నివేదికలపై చర్చించేందుకు హైపవర్ కమిటీ ఈ రోజు రెండో సారి సమావేశం కాబోతోంది. జీఎన్‌రావు, బీసీజీ కమిటీలు ఇచ్చిన నివేదికల్లోన అంశాలపై సమగ్రంగా చర్చించి రాజధాని, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిపై ఏ విధంగా ముందుకెళ్లాలో రాష్ట్రప్రభుత్వానికి హై పవర్ కమిటీ దిశానిర్ధేశం చే సేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిటీని నియమించింది. ఆర్థిక మంత్రి బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు, సీనియర్ […]
ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు కాకుండా ఒకే ఒక రాజధాని అమరావతి కొనసాగాలంటే ఏమి చేయాలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పారు. ఐదు కోట్ల ఆంధ్రులు రోడ్లపైకి వచ్చి పోరాడాలని, పోరాటంతోనే రాజధాని తరలింపును ఆపగలమన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు గద్దె రామమోహన్ 24 గంటల నిరాహారదీక్షలో లోకేష్ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అనాలోచిన నిర్ణయం వల్ల పెద్ద పెద్ద పరిశ్రమలు […]
ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణకే అధికారులు, మంత్రులతో కూడిన హైపవర్ కమిటీ మొగ్గు చూపింది. జీఎన్‌రావు, బీసీజీ ఇచ్చిన నివేదికలపై చర్చించేందుకు ఆర్థిఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన హైవపర్ కమిటీ ఈ మేరకు రెండు కమిటీలపై ప్రాథమికంగా చర్చించింది. రాష్ట్రంలో ప్రజలు పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ పై ప్రజల్లో జరుగుతున్న చర్చపై సమావేశంలో చర్చించారు. ప్రజల మనోభావాలను గౌరవించి పరిపాలనా వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చామన్నారు. రెండు నివేధికలపై […]
రాజధాని, ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అంశాల పై ప్రభుత్వం నియమించిన జియన్ రావ్ కమిటీ మరియు బోస్టన్ కమిటీలు ప్రభుత్వానికి సమర్పించిన తుది నివేదికలను క్షుణ్ణంగా, కూలంకుషంగా అధ్యయనం చెయ్యడానికి రాష్ట్ర ప్రభుత్వం గత నెల 27 న మంత్రి వర్గ తీర్మానం ద్వారా నియమించిన హైపవర్ కమిటీ ఈ రోజు తొలిసారిగా భేటీ అవ్వనుంది. విజయవాడలోని ఏపి సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. హైపవర్ కమిటీలో ఉన్న మొత్తం 10 మంది మంత్రులతో పాటు ఆరుగురు ఉన్నతాధికారులు […]
ప్రస్తుతం ఏపీలో మూడు రాజధానుల అంశం రాజకీయంగానూ ప్రకంపనలు పుట్టిస్తోంది. అమరావతిలోనే రాజధాని ఉండాల్సిందేనని చంద్రబాబు పట్టుబడుతున్నారు. వివిధ జిల్లాల్లో టీడీపీ నేతలు అందుకు అనుగుణంగా అరకొరగా కార్యక్రమాలు కూడా రూపొందిస్తున్నారు. అదే సమయంలో జనసేన మాత్రం ఎక్కడయినా ఒక్క చోటే రాజధాని పెట్టాలని డిమాండ్ చేసి, ఆ వెంటనే అమరావతికి వెళ్లి రాజధాని ఎలా తరలిస్తారంటూ ప్రశ్నించడం ద్వారా ఈ విషయంలో కూడా ఆపార్టీకి స్పష్టత లేదనే అభిప్రాయం కలిగించింది. బీజేపీ మాత్రం రెండు పడవల […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై నివేదిక ఇచ్చిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ)పై మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత నారా చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నివేదిక ఎలా ఇస్తారని ప్రశ్నించారు. రిపోర్టును ఒక చెత్తగా అభివర్ణించారు. అమరావతిలో జరిగిన అభివృద్ధి కనిపించడంలేదా..? కళ్లు లేని కబోదులా..? అంటూ బీసీజీపై చంద్రబాబు మండిపడ్డారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. అమరావతిని చంపేస్తున్నారన్నారు. రాజధానికి […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన రోజు నుండి రాష్ట్రంలో రాజధాని నిర్ణయంపై ప్రభుత్వాలు పలు కమిటీలు వేస్తు వస్తున్నారు. శివరామ కృష్ణన్ కమిటి, మంత్రి నారాయణ కమిటిని గత ప్రభుత్వ హయాంలో నియమిస్తే కొత్తగా వచ్చిన జగన్ ప్రభుత్వం జీ.యన్ రావు కమిటి, బోస్టన్ కన్సల్టింగ్ కమిటీ ని రాజధాని పై అధ్యయనం చేయటానికి నియమించింది. అయితే ఈ కమిటీలపై వాటి విశ్వసనీయతపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. ముఖ్యంగా బోస్టన్ గ్రూప్ పై పొర్చుగల్ […]