సామాన్య ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో వందే సాధారణ్ రైళ్లు!

దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్లలో ప్రజలు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఆనందిస్తున్నారు. కానీ ఈ రైళ్లలో ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కారణంగా పేదలు ఈ రైళ్లలో ప్రయాణించడం కష్టమైపోయింది. ఈ క్రమంలోనే సామాన్యులకు మేలు జరిగేలా ఇండియన్ రైల్వే ఇప్పుడు వందే సాధారణ్ రైళ్లను ప్రారంభించబోతోంది.

దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్లలో ప్రజలు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఆనందిస్తున్నారు. కానీ ఈ రైళ్లలో ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కారణంగా పేదలు ఈ రైళ్లలో ప్రయాణించడం కష్టమైపోయింది. ఈ క్రమంలోనే సామాన్యులకు మేలు జరిగేలా ఇండియన్ రైల్వే ఇప్పుడు వందే సాధారణ్ రైళ్లను ప్రారంభించబోతోంది.

రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ పలు సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది. ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణం, సమయం ఆదా అయ్యే విధంగా అత్యాధునిక ఫీచర్లతో కూడిన సెమీ హైస్పీడ్ ట్రైన్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. దీనిలో భాగంగానే వందే భారత్ ట్రైన్లను ప్రవేశ పెట్టింది. ఇప్పటికే దేశంలోని పలు మార్గాల్లో ఈ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఈ క్రమంలో సామాన్య ప్రజలకు మరో గుడ్ న్యూస్ అందించింది. భారతీయ రైల్వే త్వరలో వందే సాధారణ్ రైళ్లను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల్లోనే ట్రయల్ రన్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనికోసం వందే సాధారణ్ రైలు షోలాపూర్ నుంచి ముంబైకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ రైలుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్లలో ప్రజలు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఆనందిస్తున్నారు. కానీ ఈ రైళ్లలో ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కారణంగా పేదలు ఈ రైళ్లలో ప్రయాణించడం కష్టమైపోయింది. ఈ క్రమంలోనే సామాన్యులకు మేలు జరిగేలా ఇండియన్ రైల్వే ఇప్పుడు వందే సాధారణ్ రైళ్లను ప్రారంభించబోతోంది. తద్వారా సాధారణ మరియు తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన సామాన్య ప్రజలు తక్కువ ఛార్జీలతో సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలు కలుగనున్నది. త్వరలోనే ఈ రైళ్లు పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది.

వందే సాధారణ్ రైలుకు సంబంధించిన కొన్ని ప్రత్యేక విషయాలు

* ఇది వందే భారత్ రైలు యొక్క స్లీపర్ వెర్షన్. ఈ రైలు చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో రూపుదిద్దుకుంది.
*ఇది దేశవ్యాప్తంగా 30 మార్గాల్లో పరుగులు తీయనున్నట్లు తెలుస్తోంది.
*ఇందులో మొత్తం 22 కోచ్‌లు ఉంటాయి. వీటిలో ఎనిమిది అన్‌ రిజర్వుడు బోగీలు, 12 స్లీపర్‌ బోగీలు కాగా, మిగిలిన రెండు లోకో మోటివ్‌లు. పుష్‌-పుల్‌ విధానంలో రైలు పనిచేస్తుంది.
*ఈ రైలులో దాదాపు 1,800 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. దీని గరిష్ట వేగం గంటకు 130 కి.మీ. వీటిలో ఏసీ కోచ్‌లు, ఆటోమేటిక్ డోర్‌లు ఉండవు. ప్రతి కోచ్ లోను సీసీటీవీ కెమెరాలు, ఛార్జీంగ్ పాయింట్స్, స్నాక్ టేబుల్స్, లగేజీ పెట్టుకునేందుకు రాక్స్, ఫైర్ సేఫ్టీ వంటి అత్యాధునిక వసతులు ఉండనున్నాయి.

Show comments