సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు UP సర్కార్‌ బంపరాఫర్‌.. ఇలా చేస్తే నెలకు రూ.8 లక్షలు

Social‌ media Influencers: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు తీపి కబురును అందించింది ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం. ఇలా చేస్తే నెలకు రూ.8 లక్షలు సంపాదించుకోవచ్చు. ఇంతకీ ఏం చేయాలంటే?

Social‌ media Influencers: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు తీపి కబురును అందించింది ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం. ఇలా చేస్తే నెలకు రూ.8 లక్షలు సంపాదించుకోవచ్చు. ఇంతకీ ఏం చేయాలంటే?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సామాన్యులు సైతం సెలబ్రిటీలైపోతున్నారు. తమ ట్యాలెంట్ నిరూపించుకునేందుకు సోషల్ మీడియా చక్కటి వేదికగా మారింది. ఓవర్ నైట్ లోనే స్టార్స్ గా మారిపోతున్నారు. కొందరు టైమ్ పాస్ కోసం సోషల్ మీడియా వినియోగిస్తుంటే.. మరికొందరేమో ఉపాధి మార్గంగా మలుచుకుంటున్నారు. క్రియేటివ్ కంటెంట్ తో వీడియోలు చేసి లక్షల్లో వ్యూస్ పొందుతున్నారు. దీంతో సోషల్ మీడియా ద్వారా మంచి సంపాదన ఆర్జిస్తున్నారు. మరి మీరు కూడా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లా? అయితే మీకు బంపరాఫర్. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసే ఇన్ ఫ్లూ యెన్సర్లు నెలకు రూ. 8 లక్షలు ఆర్జించుకునేలా సోషల్ మీడియా పాలసీని తీసుకొచ్చింది.

మీడియా కంటే సోషల్ మీడియాకే క్రేజ్ ఎక్కువగా పెరిగిపోయింది. దీంతో పొలిటికల్ పార్టీలన్నీ ప్రజలతో టచ్ లో ఉండేందుకు సోషల్ మీడియానే యూజ్ చేస్తున్నారు. ప్రచారానికి, పథకాలకు, కార్యక్రమాలకు, విజయాలకు ఇలా అన్నింటికీ సోషల్ మీడియానే ఎంచుకుంటున్నారు. ప్రచారాల కోసం ఏకంగా సోషల్ మీడియా వింగ్ ను ఏర్పర్చుకుంటున్నారంటే.. వీటి ప్రభావం ఏ రేంజ్ లో ఉందో వేరే చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలో యూపీలోని యోగి సర్కార్ కూడా తమ ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసేందుకు ఇన్‌ఫ్లుయెన్సర్లను రంగంలోకి దించనున్నది. ఈ మేరకు నూతన సోషల్‌మీడియా పాలసీని రూపొందించింది.

ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తే ఇన్‌ఫ్లుయెన్సర్లు నెలకు రూ.8 లక్షల వరకు ఆర్జించవచ్చు. యూపీ గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయం ఇన్‌ఫ్లుయెన్సర్లుకు వరంగా మారనున్నది. యోగి సర్కార్ తీసుకున్న నిర్ణయంతో మీరు సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు అయితే లక్షాధికారి అయిపోవచ్చు. వీరు చేయాల్సిందల్లా పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీ కార్యక్రమాలు, విజయాలకు ప్రచారం కల్పించడం చేస్తే చాలు. మరోవైపు, సోషల్‌మీడియాలో దేశ వ్యతిరేక పోస్ట్‌లు పెట్టేవారికి మూడేళ్ల జైలు శిక్ష నుంచి జీవిత ఖైదు విధించేలా నూతన పాలసీలో నిబంధనలు పొందుపరిచారు.

Show comments