iDreamPost
android-app
ios-app

ZOMATO నుంచి అదిరిపోయే జాబ్ ఆఫర్..! అందరూ అర్హులే..! జీతం రూ.50 లక్షలు.. కానీ?

  • Published Nov 21, 2024 | 11:06 AM Updated Updated Nov 21, 2024 | 11:06 AM

ZOMATO: నిరుద్యోగులకు జోమాటో సూపర్ జాబ్ ఆఫర్ ఇస్తుంది. 50 లక్షల జీతం ఇస్తుంది.

ZOMATO: నిరుద్యోగులకు జోమాటో సూపర్ జాబ్ ఆఫర్ ఇస్తుంది. 50 లక్షల జీతం ఇస్తుంది.

ZOMATO నుంచి అదిరిపోయే జాబ్ ఆఫర్..! అందరూ అర్హులే..! జీతం రూ.50 లక్షలు.. కానీ?

ఫేమస్ ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటో ప్రస్తుతం సెన్సేషన్ అవుతుంది. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తుంది. తాజాగా సూపర్ జాబ్ ఆఫర్ ఇస్తుంది. జీతం ఎంతో తెలుసా? ఏకంగా 50 లక్షలు ఆఫర్ చేస్తుంది. 50 లక్షలు అంటే కిందిస్థాయి వాళ్ళకి ఇవ్వరేమో మినిమమ్ డిగ్రీ లేదా ఆపై చదవలేమో అనుకునేరు. అసలు ఈ జాబ్ కి ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. అందరూ ఎంచక్కా అప్లై చేసుకోవచ్చు.పైగా ఇది ఫేక్ కూడా కాదు. ఈ జాబ్ ఆఫర్ గురించి ఏకంగా ZOMATO CEO దీపిందర్ గోయల్‌ X లో అఫీషియల్ గా ట్వీట్ చేశాడు. కానీ ఈ జాబ్ రావాలంటే ఒక షరతు ఉంది. ఇంతకీ ఏంటి ఆ షరతు? ఈ జాబ్ రావాలంటే మనం ఏం చేయాలి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మామూలుగా జాబ్ అంటే కంపెనీ మనకు ప్రతినెలా కూడా శాలరీ ఇస్తుంది. కానీ ఈ ఆఫర్‌లో మాత్రం మొదటి సంవత్సరం శాలరీ రాదట. అభ్యర్థే ఏకంగా రూ. 20 లక్షలు కట్టాలట. అలాగే అప్లై చేసుకునే అభ్యర్థి రెజ్యూమ్‌ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని ఒక నిబంధన విధించింది. ఇంతకీ రూ. 20 లక్షలు కట్టడం ఏంటి.? రెజ్యూమ్‌ అవసరం లేకపోవడం ఏంటి.? అని ఆలోచిస్తున్నారా? దీని వెనుక ఒక కారణం ఉంది. ఏంటంటే.. ఈ జాబ్ రోల్ పేరు చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌. అయితే ఈ జాబ్ వచ్చిన వారికి ఫస్ట్ ఇయర్ ఎలాంటి జీతం ఇవ్వరు. ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన అభ్యర్థి గురుగ్రామ్‌లోని జొమాటో మెయిన్‌ ఆఫీస్‌లో పని చేయాల్సి ఉంటుంది. పైగా ఈ జాబ్ కి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు. అయితే ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ మాత్రం ఉండాలట. కేవలం అలాంటి వారు మాత్రమే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలని తెలిపారు.

ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన కాండిడేట్ రూ. 20 లక్షలు ఫీడింగ్‌ ఇండియాకు డొనేట్‌ చేయాలని తెలిపారు. అయితే ఒకవేళ ఉద్యోగి కోరితే జొమాటో కూడా 50 లక్షలు తన తరఫున ఎన్జీఓవకు విరాళంగా ఇస్తుందని గోయల్‌ తెలిపారు. ఇక ఫస్ట్ ఇయర్ ఎలాంటి జీతం ఉండదని సెకండ్ ఇయర్ అంటే రెండవ సంవత్సరం నుంచి ఏడాదికి రూ. 50 లక్షల పైగా జీతం ఉంటుందని తెలిపారు. ఈ జాబ్ కి అప్లై చేసుకోవడానికి రెజ్యూమ్‌ కూడా పంపాల్సిన అసరం లేదని కేవలం 200 పదాల్లో మీ గురించి చెబుతూ d@zomato.comకు డైరెక్ట్ గా మెయిల్‌ పంపాలని ఆయన తెలిపారు. ఇక ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారు జొమాటో, బ్లింకిట్‌, హైపర్‌ ప్యూర్‌, జొమాటోకు చెందిన ఫీడింగ్‌ ఇండియా ఎన్జీఓ సంస్థల కోసం పని చేయాల్సి ఉంటుంది. దీపిందర్ గోయల్‌ చేసిన ఈ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజనులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇదీ సంగతి. మరి ZOMATO ఆఫర్ చేస్తున్న ఈ జాబ్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.