iDreamPost
android-app
ios-app

బంగారం లాంటి భార్య వచ్చినా.. ఆ కారణంతో భర్త దారుణం

  • Published Nov 20, 2024 | 3:18 PM Updated Updated Nov 20, 2024 | 3:18 PM

వరకట్నం వేధింపులతో మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. అదనపు కట్నం తీసుకురావాలని వేధిస్తూ ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా కర్ణాటకలో ఓ భర్త తన భార్యను అంతమొందించాడు.

వరకట్నం వేధింపులతో మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. అదనపు కట్నం తీసుకురావాలని వేధిస్తూ ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా కర్ణాటకలో ఓ భర్త తన భార్యను అంతమొందించాడు.

  • Published Nov 20, 2024 | 3:18 PMUpdated Nov 20, 2024 | 3:18 PM
బంగారం లాంటి భార్య వచ్చినా.. ఆ కారణంతో భర్త దారుణం

సమాజాన్ని వరకట్న భూతం పీడిస్తున్నది. వరకట్న వేధింపులకు వివాహిత మహిళలు బలైపోతున్నారు. కట్నం తీసుకోవడం నేరమని చట్టాలు చెబుతున్నా సమాజంలో మార్పు రావడం లేదు. లక్షలు, కోట్లలో కట్నాలు తీసుకుని కూడా భార్యలను వేధింపులకు గురిచేస్తున్నారు. డబ్బు మీద ఆశతో దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎన్నో ఆశలతో అత్తింటిలో అడుగుపెట్టిన వారు పారాణి ఆరకముందే మృత్యువాత పడుతున్నారు. కట్నం చాల లేదని అదనపు కట్నం తీసుకురావాలని అత్త మామ, ఆడపడుచులు సూటిపోటి మాటలతో వేధిస్తూ నరకం చూపిస్తున్నారు. డబ్బుకు ఆశపడి జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. భార్యకు కష్టసుఖాల్లో తోడుండాల్సిన భర్త కాలయముడిగా మారుతున్నారు.

నూరేళ్ల వైవాహిక జీవితం మున్నాళ్లకే ముగిసిపోతున్నది. తీసుకున్న కట్నంతో తృప్తిపడక ధనదాహంతో భార్యల ప్రాణాలు తీస్తున్నారు. ఇలాంటి ఘటన తాజాగా వెలుగుచూసింది. ఓ భర్త అదనపు కట్నం తీసుకురావాలని వేధించి ఆమెను హత్య చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దావణగెరె జిల్లా చెన్నరాయపట్న తాలూకాలో ఘోరం జరిగింది. బంగారంలాంటి భార్యను భర్త హత్య చేశాడు. నూరనక్కి గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. నూరనక్కి గ్రామానికి చెందిన అయ్యప్పతో నయనకి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. రెండేళ్లపాటు వీరి కాపురం సజావుగా సాగింది. ఆ తర్వాత గొడవలు స్టార్ట్ అయ్యాయి. వారి కాపురంలో అదనపు కట్నం చిచ్చుపెట్టింది. పుట్టింటి నుంచి అదనపు కట్నం తీసుకురావాలని అయ్యప్ప తరచూ చిత్రహింసలకు గురిచేసేవాడు.

మూడు నెలల గర్భిణీ అని చూడకుండా మానసికంగా హింసించేవాడు. ఈ క్రమంలో గొడవలు ఎక్కువవడంతో నయన పుట్టింటికి చేరింది. కొద్ది నెలలుగా పుట్టింటిలోనే ఉంటోంది. ఆమె తల్లిదండ్రులు వేధింపులపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కానీ, పోలీసులు చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం అయ్యప్ప భార్యను కలిసేందుకు అత్తింటికి వచ్చాడు. ఈనెల 17న భార్యకు మాయమాటలు చెప్పి నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడే ఆమెను హత్య చేశాడు. ఆ తర్వాత నయన తల్లికి ఫోన్ చేసి మీ కుమార్తెను చంపేశానని చెప్పాడు.

ఆ తర్వాత అతడు కూడా ఆత్మహత్యకు యత్నించాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురును చంపేయడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కూతురును చంపిన అయ్యప్పపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు మృతురాలి తల్లిదండ్రులు. కంప్లైంట్ అందుకున్నపోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. మరి అదనపు కట్నానికి ఆశపడి భార్యను చంపిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet