కోల్‌కతా ఘటన మరువక ముందే..హర్యానాలో వైద్య విద్యార్థిని కిడ్నాప్!

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య చేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసింది. అంతేకాక వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినీల తల్లిదండ్రులు ఒక్కసారిగా ఉల్కిపాటుకు గురయ్యారు. ఈ ఘటన మరుక ముందే మరో ఘటన చోటుచేసుకుంది.

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య చేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసింది. అంతేకాక వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినీల తల్లిదండ్రులు ఒక్కసారిగా ఉల్కిపాటుకు గురయ్యారు. ఈ ఘటన మరుక ముందే మరో ఘటన చోటుచేసుకుంది.

కోల్‌కతాలో వైద్యురాలిపై అత్యాచారం, హత్య చేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసింది. అంతేకాక వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినీల తల్లిదండ్రులు ఒక్కసారిగా ఉల్కిపాటుకు గురయ్యారు. అత్యంత పాశవికంగా ఆ ట్రైనీ డాక్టర్ ను హత్య చేశారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు వ్యక్తం చేస్తున్నారు. అలానే మృతురాలికి నివాళ్లు అర్పిస్తూ..రోడ్లపై నిరసనలు చేస్తున్నారు. ఈ కోల్ కతా ఘటనలు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. ఇది ఇలాంటే కోల్ కతా ఘటన మరుక ముందే హర్యానాలో మరో ఘటన చోటుచేసుకుంది. మరో వైద్య విద్యార్థిని కిడ్నాప్  చేయడం కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

హరాన్యా రాష్ట్రంలోని రోహ్ తక్ ప్రాంతంలో ఓ విద్యార్థిని  వైద్య విద్యను అభ్యసిస్తుంది. రోహ్ తక్ లోని పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాలేజీలో డెంటల్ విద్యను అభ్యసితస్తుంది. అదే కాలేజీలో చదివే ఆమె సీనియర్..కిడ్నాప్ చేసి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆగష్టు 16న జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది.   ఆ యువతి సోషల్ మీడియా ద్వారా తన ఆవేదను వ్యక్తం చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇక ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదులో కీలక అంశాలను ప్రస్తావించింది. పీజీఐఎంఎస్‌ల కాలేజీలో డెంటల్ ఫస్టియర్ సంవత్సరం చదువుతున్న బీడీఎస్ విద్యార్థినిని, పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్థి కిడ్నాప్ చేశాడని, అంతేకాక ఆమెపై భౌతిక దాడి చేసినట్లు తమకు ఆదివారం రాత్రి ఫిర్యాదు అందిందని రోహ్‌తక్ డీఎస్పీ వీరేంద్ర సింగ్ తెలిపారు. ఆగస్టు 16న నిందితుడు ఆమెను పీజీఐఎంఎస్ కళశాల నుంచి నుంచి కిడ్నాప్ చేశాడని తెలిపారు. అక్కడి నుంచి అంబాలా, చండీగఢ్‌లకు తీసుకెళ్లి దాడికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

బాధితురాలి శరీరంపై బలమైన గాయాలున్నట్లు వారు తెలిపారు. ఇక బాధితురాలి కుటుంబ సభ్యులు, లాయర్  సమక్షంలో ఆమె నుంచి వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు.  బాధితురాలికి వైద్య పరీక్షలు పూర్తి చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు బాధితురాలికి అతనితో పరిచయం ఉన్నట్లు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. మొత్తంగా కోల్ కతా ఘటనతో దేశమంత అట్టుడుకుతున్న నేపథ్యంలో తాజాగా హర్యానలో మరో విద్యార్థిని కిడ్నాప్  అంశం తీవ్ర కలకలం రేపింది. మరి..ఇలాంటి ఘటన నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి. మరి.. అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments