Arjun Suravaram
Uttar Pradesh News: డబ్బులపై ప్రజలకు ఉండే అత్యాశే..వారిని నిండ మోసపోయేలా చేస్తుంది. అధిక వడ్డీలు, ఇతర ఆశలు చూపే వారిని ప్రజలు గుడ్డిగా నమ్మేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజల బలహీనతలు క్యాష్ చేసుకుని కొందరు కోట్లకు కోట్లు కొట్టేస్తున్నారు. తాజాగా యూపీలో అలాంటి ఘటనే జరిగింది.
Uttar Pradesh News: డబ్బులపై ప్రజలకు ఉండే అత్యాశే..వారిని నిండ మోసపోయేలా చేస్తుంది. అధిక వడ్డీలు, ఇతర ఆశలు చూపే వారిని ప్రజలు గుడ్డిగా నమ్మేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజల బలహీనతలు క్యాష్ చేసుకుని కొందరు కోట్లకు కోట్లు కొట్టేస్తున్నారు. తాజాగా యూపీలో అలాంటి ఘటనే జరిగింది.
Arjun Suravaram
ప్రస్తుతం సమాజంలో కేటుగాళ్ల సంఖ్య బాగా పెరిగిపోయింది. సులభంగా డబ్బులు సంపాదించేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. సామాన్యులకు డబ్బులపై ఉండే ఆశను బలహీనతగా చేసుకుని కోట్లకు కోట్లు కొట్టేస్తున్నారు. ముఖ్యంగా అధిక వడ్డీల ఆశ చూపి..సామాన్యులను నిండ ముంచేస్తున్నారు. ఇటీవలే ఓ బ్యాంకు మేనేజర్..తన కుటుంబంతో కలిసి ప్రజల నుంచి 200 కోట్లు కొట్టేసింది. చివరకు పోలీసులకు దొరికి కటకటాల పాలైంది. తాజాగా ఓ వ్యక్తి ప్రజల నుంచి 300కోట్ల రూపాయలకు కాజేసి..వేరే ప్రాంతంలో సాధువుగా చలామణి అవుతున్నాడు. చివరకు పోలీసులకు దొరకడంతో అతని కథ ముగిసింది. మరి..ఆ వ్యక్తి ఎవరు, అన్ని కోట్లు ఎలా కాజేశాడు?. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…
ఉత్తర్ ప్రదేశ్ లోని మథుర ప్రాంతంలో సాధు వేషంలో ఉన్న బబ్బన్ విశ్వనాథ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మథురలోని కృష్ణ బలరామ్ ఆలయం వద్ద యూపీ, మహారాష్ట్రకు చెందిన పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేసి.. నిందితుడిని అరెస్టు చేశాడు. అతడు మహారాష్ట్రల్లోని వివిధ ప్రాంతాల్లో జనాలకు అధిక వడ్డీ ఆశ చూపాడు. అతడి మాటలు నమ్మిన అనేక మంది జనం..భారీగా డబ్బులు సమర్పించుకున్నాడు. అలా జనం నుంచి డిపాజిట్ల రూపంలో రూ.300 కోట్లకు పైగా సొమ్మును విశ్వనాథ్ వసూలు చేశాడు.
అనంతరం అక్కడి నుంచి పారిపోయి..యూపీలో సాధువు అవతారం ఎత్తాడు. యూపీలోని మథుర ప్రాంతంలో సాధువుగా చలమణి అవుతున్నాడు. ఇక బాధితులు అతడిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ నుంచి లక్షల్లో డబ్బులు కాజేసినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక అతడి కోసం ఉత్తర్ ప్రదేశ్, మహరాష్ట్ర పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే అతడు మథురాలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం వెళ్లింది. ఈ క్రమంలో శుక్రవారం మథురలోని కృష్ణబలరామ్ ఆలయం వద్ద ఉండగా…పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఇక విశ్వనాథ్ పోలీసులకు చిక్కకుండా సాధువు వేషంలో డిల్లీ, అస్సాం, నేపాల్ , యూపీలోని పలు జిల్లాల్లో తిరిగినట్లు పోలీసులు తెలిపారు.
మంగళవారం రాత్రి విశ్వనాథ్ ను అరెస్టు చేసి…బుధవారం కోర్టులో హాజరు పరిచారు. ఇక ప్రజల నుంచి కాజేసిన సొమ్ముతో నిందితుడు భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక అతడి నుంచి సొమ్మును, ఇతర ఆస్తులను రికవరీ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. ఇలాంటి నేరాల గురించి నిత్యం వార్తలు వస్తున్నా ప్రజలు మోసపోతున్నారు. ఇటీవలే హైదరాబాద్ లోని ఓ ప్రవేటు కంపెనీ దాదాపు 700 కోట్ల రూపాయల మేర మోసం చేశారు. మరి..ఇలాంటి మోసపూరిత వ్యక్తుల విషయంలో జాగ్రత్త ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. మరి..ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు నివారణ చర్యలు ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.