iDreamPost
android-app
ios-app

జీవిత భాగస్వామి శృంగారానికి నిరాకరించడం క్రూరత్వం కిందకే వస్తుంది-ఢిల్లీ హైకోర్టు

జీవిత భాగస్వామి శృంగారానికి నిరాకరించడం క్రూరత్వం కిందకే వస్తుంది-ఢిల్లీ హైకోర్టు

భార్యాభర్తల దాంపత్య జీవితం సాఫీగా సాగాలంటే ముందుగా ఆ దంపతులు ఒకరిపై ఒకరు ప్రేమగా ఉండాలి. అప్పుడే వారి శారీరక బంధంలో పరిపూర్ణమైన తృప్తిని అనుభవించడానికి వీలుంటుంది. ఇలా కాకుండా ఎప్పుడు గొడవలు పడుతూ ఉండే దంపతుల దాంపత్య జీవితం మాత్రం అనుకున్నంత ముందుకు సాగదు. ఏ భార్యాభర్తలు శారీరకంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటారో.. ఆ దంపతుల సంసారం కూడా అంతే సంతోషంగా సాగుతుంది. కానీ, ఓ చోట మాత్రం భార్య శృంగారానికి నిరాకరించిందని భర్త న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీంతో కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. కింద కోర్టు తీర్పుపై  స్పందించిన ఢిల్లీ హైకోర్టు ఆ దంపతులకు విడాకులు మంజూరు చేయొచ్చని తెలిపింది. ఇంతకు ఈ కేసులో అసలేం జరిగిందంటే?

ఓ జంటకు 2004లో వివాహం జరిగింది. పెళ్లైన 35 రోజుల పాటు ఈ దంపతులు కలిసి ఉన్నారు. కానీ, ఆ తర్వాత ఆ మహిళ భర్తను వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇంతే కాకుండా ఎలాంటి ఆధారాలు లేకుండా అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని భర్తపై కేసు పెట్టింది. ఇక అప్పటి నుంచి భార్య పుట్టింటి నుంచి తిరిగి రాలేదు. దీంతో భర్త ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. స్పందించిన న్యాయస్థానం వీరికి విడాకులు మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది. ఈ విషయం తెలుసుకున్న అతని భార్య వెంటనే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుపై న్యాయస్థానం విచారణ జరిపి వీరికి విడాకులు మంజూరు చేయొచ్చని పేర్కొంది.

ఈ సందర్భంగా  ఢిల్లీ హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అదేంటంటే? శృంగారం లేని భార్యభర్తల బంధం శాపం లాంటిదే. జీవిత భాగస్వామి ఉద్దేశపూర్వకంగా శృంగారానికి నిరాకరిస్తే అంతకన్న క్రూరత్వం మరొకటి ఉండదు. ఈ కేసులో భార్య శృంగారానికి నిరాకరించడం ద్వారా వీరి జీవితం పరిపూర్ణం కాలేదు. ఇంతే కాకుండా ఎలాంటి ఆధారాలు లేకుండా భార్య వరకట్న కేసు పెట్టింది. ముఖ్యంగా పెళ్లైన కొత్తల్లోనే భర్తకు ఇలాంటి పరిస్థితి రావడం దారుణమైన పరిస్థితి అంటూ ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ఈ కారణంతోనే వీరికి విడాకులు మంజూరు చేయొచ్చు అని న్యాయస్థానం పేర్కొంది.