iDreamPost

ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు..! పెళ్లైన ఆరునెలలకే..

ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు..! పెళ్లైన ఆరునెలలకే..

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఎంతో మధురమైన వేడుక. ఈ కార్యాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవాలని యువత కోరుకుటుంది. అలానే ఎందరో యువతి, యువకులు వివాహలు చేసుకుని కొత్త జీవితంలో అడుగు పెడుతుంటారు. అయితే కొందరి విషయంలో మాత్రం విధి కాటేస్తోంది. కొన్ని కుటుంబాల్లో పెళ్లైన నెలల వ్యవధిలోనే వివిధ కారణాలతో వధువరులు మరణిస్తుంటారు. దీంతో ఇరుకుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంటుంది. తాజాగా ఓ మహిళ విషయంలో అలాంటిదే జరిగింది. ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టింన ఆ యువతికి.. పెళ్లైన ఆరునెలలకే నిండు నూరేళ్లు నిండాయి. ఆమె మృతితో.. వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన ఒరిస్సాలో చోటుచేసుకుంది పూర్తి వివరాల్లోకి వెళ్తే…

ఒరిస్సా రాష్ట్రం కటికి గ్రామానికి చెందిన తులసి(24) అనే యువతికి రవికుమార్ అనే యువకుడితో ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులు విజయనగరం జిల్లా కురుపాం నియోజకర్గంలో ఉంటారు. అలానే వారి కాపురం ఎంతో సంతోషంగా సాగుతోంది. ఈ క్రమంలో ఇటీవలే తులసికి జర్వం వచ్చింది. దీంతో స్థానికంగా ఉండే ఆర్ఎంపీ వైద్యులకు తులసిని చూపించారు. మలేరియా అని నిర్దారణ కావడంతో మందులు వాడుతున్నారు. శనివారం అర్ధరాత్రి గట్టిగా కేకలు వేయడంతో భర్త రవికుమార్.. ఆదివారం నీలకంఠాపురం పీహెచ్ సీకి తీసుకెళ్లారు.

అక్కడ నుంచి భద్రగరి సీహెచ్ సీకి తీసుకెళ్లగా.. అక్కడి వైద్యులు పరీక్షించి.. తులసీ మృతి చెందినట్లు తెలిపారు. తమ తులసి మృతిపై ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. జర్వం బారిన పడినట్లు తమకు సమాచారం ఇవ్వడంతో రామన్నగూడ తీసుకురావాలని సూచించామని తెలిపారు. కానీ తీసుకురాకుండా ఆంధ్రాలోని ఆస్పత్రికి తీసుకెళ్లారని, మృతిపై బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం చేయాల్సిందేనని పట్టుబట్టారు.  ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి