Mukesh Ambani: కొడుకుతో వాచ్​మన్​కు క్షమాపణలు చెప్పించిన ముకేశ్ అంబానీ!

అపర కుబేరుడు ముకేశ్ అంబానీ గురించి తెలిసిందే. కోట్ల రూపాయల సంపాదన, భారీ వ్యాపార సామ్రాజ్యం కలిగిన ఆయనకు ఎదురెళ్లే సాహసం ఎవరూ చేయరు. అలాంటిది ఆయన తన కొడుకుతో ఓ వాచ్​మన్​కు క్షమాపణలు చెప్పించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అపర కుబేరుడు ముకేశ్ అంబానీ గురించి తెలిసిందే. కోట్ల రూపాయల సంపాదన, భారీ వ్యాపార సామ్రాజ్యం కలిగిన ఆయనకు ఎదురెళ్లే సాహసం ఎవరూ చేయరు. అలాంటిది ఆయన తన కొడుకుతో ఓ వాచ్​మన్​కు క్షమాపణలు చెప్పించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

పిల్లల విషయంలో తల్లిండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. పెంపకాన్ని బట్టే వాళ్ల భవిష్యత్ ఉంటుందనే ఉద్దేశంతో.. వారికి ఏ లోటూ లేకుండా చూసుకుంటారు. వాళ్లకు కావాల్సినవి అందిస్తూనే.. ఎవరితో ఎలా మెలగాలో కూడా చెబుతారు. అయితే ధనికుల పిల్లల విషయంలో సొసైటీలో చాలా అపోహలు ఉన్నాయి. పేద, మధ్యతరగతి పిల్లల్లా వాళ్లు పెరగని.. వాళ్లకు రెస్పెక్ట్ ఇవ్వడం తెలీదనే విమర్శలు వినే ఉంటారు. కష్టపడాల్సిన అవసరం లేదు, లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తారు కాబట్టి వారికి సామాన్యులతో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియదని అనుకుంటారు. అయితే అందర్నీ ఒకే గాటిన కట్టలేం. సింపుల్​గా ఉండే ధనికులు కూడా ఉంటారు. పిల్లల పెంపకంపై ఫోకస్ పెడుతూ ఎవరితో ఎలా ఉండాలో నేర్పించేవారూ ఉన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ దంపతులనూ ఈ లిస్టులో చేర్చాల్సిందే. దీనికి ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు.

ముకేశ్ అంబానీ తన కొడుకు ఆకాశ్​తో ఓ వాచ్​మన్​కు సారీ చెప్పించారు. ఇది వినగానే మీరు షాకై ఉంటారు. కానీ ఇది నిజమే. వాచ్​మన్​కు ఆకాశ్ అంబానీ క్షమాపణలు చెప్పారు. ఈ విషయాన్ని స్వయంగా ముకేశ్ అంబానీ భార్య నీతా పంచుకున్నారు. పిల్లల్ని ముకేశ్ అంబానీ చాలా క్రమశిక్షణతో పెంచారని ఆమె తెలిపారు. ఒక సమయంలో తమ వాచ్​మన్​ మీద ఆకాశ్ సీరియస్ అయ్యాడని.. అయితే పక్కనే ఉన్న ముకేశ్ వెంటనే కలుగజేసుకున్నారని చెప్పుకొచ్చారు. ఆకాశ్​ను మందలించి వెంటనే అతడితో వాచ్​మన్​కు క్షమాపణలు చెప్పించారని నీతా పేర్కొన్నారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె పైకామెంట్స్ చేశారు. అయితే ఇది పాత ఇంటర్వ్యూనే అయినప్పటికీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్ ముకేశ్ దంపతుల పెంపకాన్ని మెచ్చుకుంటున్నారు. పిల్లల్ని పెంచే విధానం ఇది అని కామెంట్స్ చేస్తున్నారు.

అపర కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ తన పిల్లల్ని ఇలా పెంచారు కాబట్టే ఆయన వ్యాపార రంగంలో నంబర్​ వన్​గా కొనసాగుతున్నారని నెటిజన్స్ చెబుతున్నారు. ముకేశ్​కు ముగ్గురు పిల్లలు ఉన్నారనే విషయం తెలిసిందే. వాళ్లే ఆకాశ్ అంబానీ, అనంత్ అంబానీ, ఇషా అంబానీ. వీళ్లు జియో ప్లాట్​ఫామ్స్ అండ్ రిలయన్స్ రీటెయిల్ వెంచర్స్ వ్యవహారాల్ని చూసుకుంటున్నారు. ఇక, ముకేశ్ అంబానీ నేతృత్వంలోని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ మరో రంగంలోకి అడుగు పెట్టేందుకు రెడీ అయిందని తెలుస్తోంది. బ్లాక్​రాక్ అనే కంపెనీతో కలసి మ్యూచువల్ ఫండ్ లైసెన్స్ కోసం కోసం దరఖాస్తు చేసుకుందని నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ దరఖాస్తు సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) పరిశీలనలో ఉందని సమాచారం. మరి.. అంబానీ తన కొడుకుతో వాచ్​మన్​కు సారీ చెప్పించడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: మాల్డీవులకు నో ఫ్లైట్స్.. బుకింగ్స్ క్యాన్సిల్ చేసిన ప్రముఖ సంస్థ

Show comments