iDreamPost

మాల్డీవులకు నో ఫ్లైట్స్.. బుకింగ్స్ క్యాన్సిల్ చేసిన ప్రముఖ సంస్థ

మాల్డీవులు వర్సెస్ ఇండియా ఫైట్ తీవ్ర స్థాయికి చేరుకుంది. ప్రధాని మోడీ, తమపై నోరు పారేసుకున్న మాల్డీవులకు గట్టి సమాధానమే ఇస్తున్నారు భారతీయులు, ఇక్కడి సెలబ్రిటీలు. ఇప్పుడు మరో భారీ దెబ్బను ఎదుర్కోబోతోంది మాల్డీవులు..

మాల్డీవులు వర్సెస్ ఇండియా ఫైట్ తీవ్ర స్థాయికి చేరుకుంది. ప్రధాని మోడీ, తమపై నోరు పారేసుకున్న మాల్డీవులకు గట్టి సమాధానమే ఇస్తున్నారు భారతీయులు, ఇక్కడి సెలబ్రిటీలు. ఇప్పుడు మరో భారీ దెబ్బను ఎదుర్కోబోతోంది మాల్డీవులు..

మాల్డీవులకు నో ఫ్లైట్స్.. బుకింగ్స్ క్యాన్సిల్ చేసిన ప్రముఖ సంస్థ

ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల కాలంలో లక్ష ద్వీప్స్‌లోపర్యటించారు. అక్కడ స్కూబా డైవ్ చేయడంతో పాటు ఇసుక తిన్నెల్లో వాకింగ్, రిలాక్సేషన్ పొందారు. ఆ తర్వాత తన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుని..సాహసం ఇష్టపడే ఎవరైనా కచ్చితంగా లక్షద్వీప్ చూడాలంటూ పేర్కొన్నారు. ఇదిగో ఇదే అంశంపై రచ్చకు కారణమైంది. ఈ సమయంలో మాల్డీవుల మంత్రులు ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ భారతీయులను ఉద్దేశించి కూడా వల్గర్ కామెంట్స్ చేశారు. బైకాట్ ఇండియా అంటూ నినాదాలు చేశారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు ప్రధాని మోడీకి మద్దతు తెలుపుతూ వరుసగా ట్వీట్ చేశారు. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, మాజీ క్రికెటర్ సచిన్ వంటి వాళ్లు సైతం లక్ష ద్వీప్స్‌లో పర్యటించాలని పిలుపునిస్తున్నారు.

అయితే గాయమయ్యాక.. మందు రాసుకున్నట్లు అయిపోయింది మాల్డీవుల పరిస్థితి. పర్యాటకంగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని గ్రహించిన అక్కడి సర్కార్.. వెంటనే తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది. ఎవరైతే ప్రధాని మోడీ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారో .. ఆ మంత్రులను తొలగించింది. ఈ విషయాన్ని స్థానిక మీడియా వెల్లడించింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మాల్డీవులకు వెళ్లాలని భావించిన వారంతా.. ఇప్పుడు ఆ టూర్‌ను రద్దు చేసుకుంటున్నారు. ఒక్క రోజులోనే 8 వేల ట్రిప్స్ క్యాన్సిల్ అయ్యాయంటే.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్పొచ్చు. ఈ క్రమంలో మరో గట్టి షాక్ తగిలింది ఆ దేశానికి. దేశీయ ప్రయాణ సంస్థ ఈజ్ మై ట్రిప్ ఎక్స్ వేదికగా ఓ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఆ దేశానికి ఫ్లైట్ బుకింగ్స్ నిలిపివేస్తున్నామని సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిశాంత్ పిట్టి ట్వీట్ చేశారు.

ఈజ్ మై ట్రిప్.. ఆన్ లైన్ టికెట్ బుకింగ్ సేవలను అందిస్తోంది. ఇది న్యూ ఢిల్లీ కేంద్రంగా నడుస్తోంది. ఈ సంస్థను నిశాంత్ పిట్టి, రికాంత్ పిట్టి, ప్రశాంత్ పిట్టిలు స్థాపించారు. కేవలం ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ సంస్థ నిర్ణయాన్ని.. మిగిలిన సంస్థలు కూడా తీసుకుంటే.. మాల్డీవులపై తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశాలున్నాయి. ఎందుకంటే.. మాల్డీవులు పర్యాటకంపైనే ఆధారపడి కొనసాగుతున్న దేశం. ముఖ్యంగా ఇండియన్స్ వల్ల ఆ దేశ పర్యాటక రంగానికి ఆర్థికంగా 70 శాతం సమకూరుతోంది. అంతేకాకుండా దేశానికి స్నేహ హస్తం ఇస్తుంటే.. ఇప్పుడేమో బైకాట్ ఇండియా అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల భారతీయులు గుర్రుగానే ఉన్నారు. ఇప్పటికే అనేక మంది మాల్డీవులకు ట్రిప్పులను క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో ఆ దేశానికి పెద్ద దెబ్బ పడే అవకాశాలున్నాయి. మరీ మాల్డీవులు చేసుకున్న స్వయంకృతాపారాధంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి