IRCTC On Fake News: ఒకే ఐడీతో వేరే ఇంటి పేర్లున్న వారికి టికెట్లు బుక్ చేయకూడదనే వార్తలపై IRCTC క్లారిటీ

ఒకే ఐడీతో వేరే ఇంటి పేర్లున్న వారికి టికెట్లు బుక్ చేయకూడదనే వార్తలపై IRCTC క్లారిటీ

IRCTC On Fake News: ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకునే విషయంలో ఒక వ్యక్తి తన ఐడీతో కేవలం ఒకే ఇంటి పేరున్న కుటుంబ సభ్యులకు మాత్రమే బుక్ చేయాలని.. వేరే ఇంటి పేరున్న వ్యక్తులకు టికెట్ బుక్ చేస్తే జరిమానా, జైలు శిక్ష ఉంటుందని అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలపై ఐఆర్సీటీసీ క్లారిటీ ఇచ్చింది.

IRCTC On Fake News: ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకునే విషయంలో ఒక వ్యక్తి తన ఐడీతో కేవలం ఒకే ఇంటి పేరున్న కుటుంబ సభ్యులకు మాత్రమే బుక్ చేయాలని.. వేరే ఇంటి పేరున్న వ్యక్తులకు టికెట్ బుక్ చేస్తే జరిమానా, జైలు శిక్ష ఉంటుందని అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలపై ఐఆర్సీటీసీ క్లారిటీ ఇచ్చింది.

ఐఆర్సీటీసీ పర్సనల్ ఐడీ ద్వారా ఇతరుల కోసం రైలు టికెట్ ని బుక్ చేయకూడదని.. అలా చేస్తే భారతీయ రైల్వే యాక్ట్ లోని సెక్షన్ 143 ప్రకారం చట్టపరమైన రూల్స్ ని అతిక్రమించినట్టే అవుతుందని.. 10 వేల జరిమానాతో పాటు మూడేళ్ళ జైలు శిక్ష కూడా ఉంటుందనేది ఆ వార్త సారాంశం. ఐఆర్సీటీసీ వ్యక్తిగత ఐడీ ద్వారా కేవలం ఒకే ఇంటి పేరు ఉన్న తమ కుటుంబ సభ్యులకు మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలనే నిబంధనను ఐఆర్సీటీసీ తీసుకొచ్చిందన్న వార్తా ఇప్పటి వరకూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చాలా మంది ఇది నిజమని నమ్మి ఆందోళన చెందారు. అది ఐఆర్సీటీసీ దృష్టికి వెళ్లడంతో అధికారులు ఎక్స్ ఖాతాలో స్పందించారు.

ఈ టికెట్స్ బుకింగ్ విధానంలో ఐఆర్సీటీసీ కొత్త నిబంధనలు విధించిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు ఫేక్ అని ఐఆర్సీటీసీ కొట్టి పడేసింది. ఐఆర్సీటీసీ ఐడీతో వివిధ ఇంటిపేర్లతో టికెట్లు బుక్ చేయకూడదన్న రూల్ తెచ్చిందన్న వార్త అవాస్తవమని, తప్పుదోవ పట్టించేదని ఐఆర్సీటీసీ పేర్కొంది. ఇలాంటి అవాస్తవాలను వ్యాప్తి చేస్తున్నందుకు తమను నిరుత్సాపరిచిందని తెలిపింది. ఐతే రైల్వే బోర్డు గైడ్ లైన్స్ ప్రకారం ఐఆర్సీటీసీ సైట్ నుంచి టికెట్లు బుక్ చేసే విషయంలో క్లారిటీ ఇచ్చింది. దీనికి సంబంధించిన పబ్లిక్ డొమైన్  లో సమాచారం అందుబాటులో ఉందని పేర్కొంది. ఎవరైనా ఒక వ్యక్తి తన వ్యక్తిగత ఐఆర్సీటీసీ ఐడీతో ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, బంధువులకు టికెట్ బుక్ చేసుకోవచ్చునని స్పష్టతనిచ్చింది.

నెలకు 12 టికెట్ల వరకూ బుక్ చేసుకోవచ్చునని.. ఆధార్ వెరిఫై చేసుకున్న యూజర్లు నెలకు 24 టికెట్లు బుక్ చేసుకోవచ్చునని క్లారిటీ ఇచ్చింది. ఈ నిబంధన వర్తించాలంటే ఎవరో ఒక ప్యాసింజర్ కి కూడా ఆధార్ వెరిఫై అయి ఉండాలి. వ్యక్తిగత ఐడీ మీద బుక్ చేసిన టికెట్లను కమర్షియల్ గా అమ్ముకోవడానికి వీల్లేదని.. అలా చేస్తే రైల్వేస్ యాక్ట్ 1989లోని సెక్షన్ 143 ప్రకారం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని ఐఆర్సీటీసీ ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. ఇవే నిబంధనలని.. కొత్తగా ఎలాంటి రూల్స్ తీసుకురాలేదని ఐఆర్సీటీసీ స్పష్టతనిచ్చింది. కాబట్టి ఇప్పటి వరకూ వచ్చిన వార్తలు ఫేక్ అని గమనించగలరు.

Show comments