iDreamPost
android-app
ios-app

వామ్మో Train టికెట్ ధర 20 లక్షలా ?.. ఇంతకీ ఆ ట్రైన్ ఏంటి? దాని ప్రత్యేకత ఏంటి? పూర్తి వివరాలు!

  • Published Nov 06, 2024 | 11:11 AM Updated Updated Nov 06, 2024 | 11:11 AM

Train: మనకు అత్యంత చౌకగా లభించే ప్రయాణం రైలు ప్రయాణం. అలాంటి ప్రయాణం లక్షల్లో ఉంటే షాకింగ్ అనే చెప్పాలి.

Train: మనకు అత్యంత చౌకగా లభించే ప్రయాణం రైలు ప్రయాణం. అలాంటి ప్రయాణం లక్షల్లో ఉంటే షాకింగ్ అనే చెప్పాలి.

వామ్మో Train టికెట్ ధర 20 లక్షలా ?.. ఇంతకీ ఆ ట్రైన్ ఏంటి? దాని ప్రత్యేకత ఏంటి? పూర్తి వివరాలు!

మన దేశంలో అత్యంత చవకైనా ప్రయాణం ఏంటంటే అందరికీ వెంటనే గుర్తొచ్చే పేరు ట్రైన్. రైలు ప్రయాణం అనేది అందరికీ అందుబాటులో ఉంటుంది. దేశంలో ఎక్కడికైనా వెళ్లాలంటే చాలా తక్కువ ధరకే వెళ్ళవచ్చు. సాధారణంగా ట్రైన్ టికెట్ ధర ఎంత ఉంటుంది? ఎంత హై క్లాస్ టికెట్ కొనుకున్న మహా అంటే 1000 ఉంటుందేమో. అంతకంటే ఎక్కువ ఉండవు. కానీ ట్రైన్ టికెట్ ధర 20 లక్షలు ఉండటం గురించి మీరెప్పుడైనా విన్నారా? ఇదెక్కడో విదేశాల్లో అనుకునేరు.. కాదు మన ఆసియా ఖండంలోనే. అది కూడా ట్రైన్ టికెట్లు చాలా తక్కువ ధరకు లభించే మన ఇండియా లోనే కావడం విశేషం. ఇంతకీ ఆ ట్రైన్ ఏంటి? దాని స్పెషాలిటీ ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ ట్రైన్ పేరు మహారాజా ఎక్స్‌ప్రెస్.. ఇది మన దేశంలోనే కాదు ఏకంగా ఆసియా ఖండంలోనే అత్యంత ఖరీదైన ట్రైన్. దీన్ని 2010లో ప్రారంభించారు. ఇదొక లగ్జరీ ట్రైన్. ఈ ట్రైన్ ప్రయాణికులకు ఫైవ్ స్టార్ హోటల్ లాంటి ప్రయాణాన్ని అందిస్తుంది. అంటే ఇందులోని ప్రయాణికులకు ఫైవ్ స్టార్ సర్వీసెస్ ఉంటాయి. అయితే ఈ రైలులో ప్రయాణించాలంటే ఏకంగా రూ.20 లక్షలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మొత్తం ఏడు రోజుల పాటు ఈ రైలు ప్రయాణం సాగుతుంది. ఈ రైలు ప్రయాణంలో ప్రయాణీకులు లగ్జరీ సర్వీసెస్ ని ఎంజాయ్ చేస్తూ మంచి మంచి టూరిస్ట్ ప్లేస్ లను చూడవచ్చు. తాజ్ మహల్, ఖజురహో టెంపుల్, రణథంబోర్ లాంటి టూరిస్ట్ ప్లేస్ లను చూడొచ్చు. ఇంకా అలాగే ఫతేపూర్ సిక్రి, వారణాసి లాంటి హిస్టారికల్ టూరిస్ట్ ప్లేస్ లను కూడా సందర్శించవచ్చు.

ఇక అత్యంత ఖరీదైన ఈ రైలు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఆధ్వర్యంలో రన్ అవుతుంది. ప్రతి కోచ్‌ కూడా అదిరిపోయే రేంజిలో ఉంటుందనే చెప్పాలి. ప్రతి కోచ్ లో కూడా బాత్‌రూమ్‌లు, రెండు మాస్టర్ బెడ్‌రూమ్‌లు ఉంటాయి. అంతే కాదండోయ్ ప్రయాణికుల కోసం ప్రతి కోచ్‌లో మినీ బార్‌ను కూడా ఏర్పాటు చేశారు. మీకు నచ్చిన ఫుడ్ తినవచ్చు. బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఇంకా అంతేగాక లైవ్ టీవీ, ఎయిర్ కండీషనర్, ప్రకృతిని ఆస్వాదించేందుకు పెద్ద పెద్ద కిటికీలు కూడా ఉన్నాయి. ఇదీ సంగతి. అందుకే ఈ లగ్జరీ ట్రైన్ ఇంత కాస్ట్లీ. ఈ ట్రైన్ గురించి తెలిసిన నెటిజనులు రక రకాలుగా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ట్రైన్ టికెట్ ధరతో హాయిగా గోవా, బ్యాంకాక్, మాల్దీవ్స్ లాంటి ప్లేసెస్ చుట్టేయవచ్చు అని కామెంట్స్ చేస్తున్నారు. మరీ ఈ ట్రైన్ గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.