iDreamPost
android-app
ios-app

భారీ వర్షాలు.. ఏకంగా 7 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్!

IMD Issues Red Alert To 7 States: భారత వాతావరణ శాఖ అధికారులు దేశ ప్రజలను వర్షాల విషయంలో హెచ్చరించారు. ఏకంగా 7 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ని జారీ చేశారు. ఆయా రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ సూచించారు.

IMD Issues Red Alert To 7 States: భారత వాతావరణ శాఖ అధికారులు దేశ ప్రజలను వర్షాల విషయంలో హెచ్చరించారు. ఏకంగా 7 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ని జారీ చేశారు. ఆయా రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ సూచించారు.

భారీ వర్షాలు.. ఏకంగా 7 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్!

ఇన్నిరోజులు ఎండలకు అల్లాడిపోయిన ఉత్తర భారతాన్ని ఇప్పుడు వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఆ రాష్ట్రాల్లో ఎడతెరిపిలేకుండా.. ఏక ధాటిగా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి. ప్రజా జీవనం కూడా స్తంభించిపోతోంది. పలు ప్రాంతాల్లో రోడ్డు రవాణా వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా మారిపోయింది. ఇదిలా ఉండగా భారత వాతావరణ శాఖ ఆ రాష్ట్రాల ప్రజలను హెచ్చరించింది. ఉత్తరాధిన ఉన్న పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ను జారీ చేసింది. మరికొన్ని రోజులు ఈ భారీ వర్షాలు ఇలాగే కొనసాగుతాయని వెల్లడించింది.

సోమవారం భారత వాతావరణ శాఖ అధికారులు నార్త్ స్టేట్స్ ని అలర్ట్ చేశారు. జూలై నెల 4వ తేదీ వరకు పలు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ను జారీ చేశారు. ఆయా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉంది అని వెల్లడించారు. త్రిపుర, సిక్కిం, పశ్చిమ బెంగాల్, మేఘాలయ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈనెల 4వ తేదీ వరకు ఈ రెడ్ అలర్ట్ అనేది అమలులో ఉంటుంది అని ప్రకటించింది. అక్కడి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని కోరింది. అలాగే పలు రాష్ట్రాల్లో సాధారణం నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే రాష్ట్రాలు ఉన్నాయి. వాటిలో హిమాచల్ ప్రదేశ్, హరియాణా, బిహార్, మహారాష్ట్ర, గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేశారు. అంతేకాకుండా రానున్న నాలుగు, అయిదు రోజుల్లో తూర్పు, ఈశాన్య, వాయవ్య ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింత చురుకుగా కదిలే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. అంటే ఆయా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది.

ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు విస్తారంగానే కురుస్తున్నాయి. బంగాళఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ప్రభావం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడ్రోజుల్లో భారీ వర్షాలు కురిసే ఆవకాశం ఉంది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈదురు గాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అలాగే ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని తెలిపారు.