iDreamPost
android-app
ios-app

కొత్తపల్లిలో ఒకప్పుడు OTT స్ట్రీమింగ్ డేట్ ఇదే..

  • Published Aug 09, 2025 | 9:39 AM Updated Updated Aug 09, 2025 | 9:39 AM

టాలీవుడ్ లో కేర్ ఆఫ్ కంచెరపాలెం సినిమా ఎలాంటి హిట్ అందుకుందో తెలియనిది కాదు. ఇలాంటి సినిమాలన్నీ కాస్త లేట్ గా పాపులర్ అవుతూ ఉంటాయి. కానీ మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తూ ఉంటాయి. ఆ సినిమా నిర్మాత ప్రవీణ పరుచూరి. ఆమె రీసెంట్ గా కొత్తపల్లిలో ఒకప్పుడు అనే సినిమాను డైరెక్ట్ చేశారు

  • Published Aug 09, 2025 | 9:39 AMUpdated Aug 09, 2025 | 9:39 AM
కొత్తపల్లిలో ఒకప్పుడు OTT స్ట్రీమింగ్ డేట్ ఇదే..

టాలీవుడ్ లో కేర్ ఆఫ్ కంచెరపాలెం సినిమా ఎలాంటి హిట్ అందుకుందో తెలియనిది కాదు. ఇలాంటి సినిమాలన్నీ కాస్త లేట్ గా పాపులర్ అవుతూ ఉంటాయి. కానీ మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తూ ఉంటాయి. ఆ సినిమా నిర్మాత ప్రవీణ పరుచూరి. ఆమె రీసెంట్ గా కొత్తపల్లిలో ఒకప్పుడు అనే సినిమాను డైరెక్ట్ చేశారు. జూలై 19న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయింది. సూపర్ హిట్ కాదు కానీ ఉన్నంతలో ప్రేక్షకుల నుంచి డీసెంట్ టాక్ నే సంపాదించుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటిటి ఎంట్రీ ఇవ్వనుంది.

ఈ సినిమాకు ప్రవీణ పరుచూరి దర్శకత్వం వహించడంతో పాటు.. నిర్మాతగా కూడా వ్యవహరించారు. రాణా దగ్గుబాటి , ప్రవీణ పరుచూరి కలిసి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ ఆహా మంచి ధరకు సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఆగష్టు 22 నుంచి ఈ సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నట్లుగా అనౌన్స్ చేశారు మేకర్స్. థియేటర్ లో ఎలా ఉన్నాయా ఓటిటి లో ఈ సినిమాకు మంచి మార్కులే పడతాయని ఆశిస్తున్నారు మేకర్స్. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.