Krishna Kowshik
మహిళా సాధికారితకు పలు రాష్ట్రాలు పెద్ద పీట వేస్తున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఎన్నికల హామీల్లో కూడా వారికే ప్రాధాన్యతనిస్తున్నాయి. వాటిల్లో ఒకటి ఫ్రీ బస్సు జర్నీ. ఇప్పటికే ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో అమల్లో ఉన్న సంగతి విదితమే.. అయితే..
మహిళా సాధికారితకు పలు రాష్ట్రాలు పెద్ద పీట వేస్తున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఎన్నికల హామీల్లో కూడా వారికే ప్రాధాన్యతనిస్తున్నాయి. వాటిల్లో ఒకటి ఫ్రీ బస్సు జర్నీ. ఇప్పటికే ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో అమల్లో ఉన్న సంగతి విదితమే.. అయితే..
Krishna Kowshik
ఓటు బ్యాంక్ రాజకీయాల్లో కీలకంగా మారారు మహిళలు. మహిళలకు ప్రాధాన్యతనిస్తూ మ్యానిఫెస్టోలో హామీలను పొందు పరుస్తున్నాయి వివిధ పార్టీలు. వాటిల్లో ఒకటి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం. ఈ హామీనిచ్చిన పార్టీలకే పట్టం కట్టారు స్త్రీలు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ హామీని అమల్లోకి తీసుకు వచ్చిన సంగతి విదితమే. ఢిల్లీతో పాటు కర్ణాటక, తెలంగాణ, తమిళనాడులోని రాష్ట్ర మహిళలు ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించాయి ఆయా ప్రభుత్వాలు. రాష్ట్రంలో నివసిస్తున్నట్లుగా ధ్రువీకరించే ఆధార్ లేదా ఓటర్ ఐడీ కార్డులతో మహిళలు ప్రయాణించొచ్చు. కేవలం మహిళలే కాదు విద్యార్ధినులు, ట్రాన్స్ జెండర్లకు కూడా ఈ అవకాశం ఉండగా.. సద్విని యోగ పర్చుకుంటున్నారు.
ఇటీవల తెలంగాణలో ఆర్డినరీ, మెట్రో, ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో కూడా మహిళలు ఉచితంగా జర్నీ చేసే అవకాశాన్ని కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ, తమిళనాడులో కేవలం సిటీ ఆర్డినరీ బస్సు సర్వీసుల్లో మాత్రమే మహిళలు ప్రయాణించే సదుపాయం ఉంది. ఈ క్రమంలో ఆ రాష్ట్ర మహిళలకు త్వరలోనే గుడ్ న్యూస్ చేప్పేందుకు కసర్తతు చేస్తుంది డీఎంకే ప్రభుత్వం. మున్ముందు ఎక్స్ ప్రెస్, డీలక్స్ బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని అందిస్తే ఎలా ఉంటుందన్న కోణంలో యోచన చేస్తుంది. ఇదే జరిగితే.. రాష్ట్ర మహిళలు ఈ బస్సుల్లో కూడా ఉచితంగా జర్నీ చేయొచ్చు. 2021లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమిళనాడులో ప్రతిపక్షంగా ఉన్న డీఎంకె.. తాము అధికారంలోకి వస్తే నగర బస్సుల్లో ఫ్రీ బస్సు సౌకర్యం అందిస్తామని మ్యానిఫెస్టోలో పేర్కొంది.
దీంతో ప్రజలు డీఎంకెకు అధికారాన్ని అప్పగించారు. మే 7, 2021 తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. సిటీ, టౌన్ బస్సుల్లో మహిళలకు తక్షణమే ఉచిత ప్రయాణం అందిస్తామని ప్రకటించారు. ఈ పథకం తీసుకు రావడం వెనుక ప్రధాన ఉద్దేశం, మహిళల పని భాగస్వామ్య రేటును పెంచడంతో పాటు ప్రజా రవాణాను ప్రోత్సహించడమని పేర్కొన్నారు. ఈ ఫ్రీ బస్సు సర్వీసును ప్రేక్షకులు సద్వినియోగ పర్చుకుంటున్నారు. మహిళలు తమ బస్సులను తేలికగా గుర్తించేలా.. బస్సులకు పింక్ కలర్ వేశారు. చెన్నైలో సగం బస్సులు మహిళలకు కేటాయించారు. అప్పటి నుండి తమిళనాడు ఆర్టీసీకి కూడా భారీగా ఆదాయం సమకూరుతోంది. అయితే ఈ పథకం అమల్లోకి వచ్చిన నాటి నుండి ఎక్స్ ప్రెస్, డీలక్స్ బస్సుల్లో మహిళల ప్రయాణం తగ్గిపోవడంతో ఆదాయానికి గండి పడింది. ఈ నేపథ్యంలోనే ఎక్స్ ప్రెస్, డీలక్స్ బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం అందించాలన్న యోచనలో ఉంది స్టాలిన్ ప్రభుత్వం.