చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వినడం సర్వసాధారణమే. అయితే అవి జరిగినప్పుడు కాకుండా.. కొన్ని రోజుల తర్వాత సదరు తారలు తమపై జరిగిన లైంగిక దాడుల గురించి వెల్లడిస్తూ ఉంటారు. ఇక ఈ క్యాస్టింగ్ కౌచ్ వివాదాల్లో సీనియర్ స్టార్ హీరోయిన్స్ చేసిన ఆరోపణలు ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ నటి చేసిన షాకింగ్స్ కామెంట్స్ మెుత్తం సినిమా పరిశ్రమనే ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ నటి 16 ఏళ్లకే ఓ నటుడి చేతిలో లైంగిక దాడికి గురైనట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సదరు నటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ కు గురైనట్లు ఎంతో మంది హీరోయిన్స్, నటీమణులు చెప్పుకొచ్చారు. అయితే వారిపై లైంగిక దాడి జరిగిన తర్వాత చాలా రోజుల తర్వాత ఆ విషయాలను వెల్లడిస్తుంటారు తారలు. తాజాగా ఓ హాలీవుడ్ నటి చేసిన షాకింగ్స్ కామెంట్స్ ప్రపంచ సినీ పరిశ్రమనే దిగ్భ్రాంతికి గురిచేశాయి. వివరాల్లోకి వెళితే.. హాలీవుడ్ నటి అలెక్సా నికోలస్ నటుడు జోనా హిల్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 16 సంవత్సరాలకే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అలెక్సా జోనా హిల్ వల్ల లైంగిక దాడికి గురైంది.
తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అలెక్సా మాట్లాడుతూ..”నేను ఇండస్ట్రీలోకి వచ్చాక జోనా హిల్ తో కలిసి ఓ పార్టీకి వెళ్లాను. అప్పుడు అతడి వయసు 24 సంవత్సరాలు. ఆ పార్టీలో అతడు ఫుల్ గా తాగి.. నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నేను వెళ్తున్న టైమ్ లో బలవంతంగా లాగి లిప్ కిస్ ఇచ్చాడు. నా మూతిలో మూతి పెట్టి లిప్ లాక్ ఇస్తున్న క్రమంలో ఏకంగా అతడి నాలుక నా గొంతు వరకు పెట్టేశాడు” అంటూ సంచలన ఆరోపణలు చేసింది. అందుకే జోనా హిల్ మాజీ లవర్ సారా బ్రాడీ అతన్ని’మిసోజనిస్ట్ నార్సిసిస్ట్ అని ఎందుకు పిలిచేదో ఇప్పుడు అర్ధం అయ్యిందని’ అలెక్సా నికోలస్ చెప్పుకొచ్చింది. దాంతో నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఏంటి బ్రో కామాంధుడు 2.O లాగా ఉన్నావే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ఆరోపణలపై జోనా హిల్ ఏవిధంగా స్పందిస్తాడో వేచి చూడాలి.
ఇదికూడా చదవండి: విదేశీ వీధుల్లో అనసూయ హాట్ ఫోజులు! పిక్స్ వైరల్!