iDreamPost
android-app
ios-app

కొత్త సినిమా రిలీజ్​లు.. శుక్రవారం సెంటిమెంట్ ఎలా వచ్చిందంటే..?

  • Published Dec 21, 2023 | 3:26 PM Updated Updated Dec 21, 2023 | 7:40 PM

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ కొత్త సినిమా అయినా సరే దాదాపుగా శుక్రవారమే రిలీజ్ అవుతుంది. పెద్ద చిత్రాల దగ్గర నుంచి చిన్న చిత్రాల వరకూ అందరూ శుక్రవారం సెంటిమెంట్​ను ఫాలో అవుతారు. అసలు మూవీస్​ను ఫ్రైడే విడుదల చేయడానికి కారణం ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ కొత్త సినిమా అయినా సరే దాదాపుగా శుక్రవారమే రిలీజ్ అవుతుంది. పెద్ద చిత్రాల దగ్గర నుంచి చిన్న చిత్రాల వరకూ అందరూ శుక్రవారం సెంటిమెంట్​ను ఫాలో అవుతారు. అసలు మూవీస్​ను ఫ్రైడే విడుదల చేయడానికి కారణం ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..

  • Published Dec 21, 2023 | 3:26 PMUpdated Dec 21, 2023 | 7:40 PM
కొత్త సినిమా రిలీజ్​లు.. శుక్రవారం సెంటిమెంట్ ఎలా వచ్చిందంటే..?

సినీ పరిశ్రమలో శుక్రవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజునే చిత్రాలు విడుదల చేయాలని కంకణం కట్టుకుంటారు మేకర్స్. ఇండస్ట్రీలో చాలా వరకూ మూవీస్ శుక్రవారం పూటే రిలీజ్ అవుతాయి. ఈ మధ్య కొన్ని ఫిల్మ్స్ గురువారం కూడా విడుదలవుతున్నాయి. కలెక్షన్స్ తగ్గిపోవడంతో ఒకరోజు పెరుగుతుందనే ఆశతో శుక్రవారానికి ఒక్కరోజు ముందు రిలీజ్ చేస్తున్నారు. కానీ ఇండస్ట్రీలో చాలా మటుకూ ఫ్రైడే సెంటిమెంట్​కే ఇంపార్టెన్స్ ఇస్తారు. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సలార్’ డిసెంబర్ 22 (శుక్రవారం)న థియేటర్లలోకి రానుంది. నందమూరి కల్యాణ్ రామ్ యాక్ట్ చేసిన ‘డెవిల్’ డిసెంబర్ 29 (శుక్రవారం)న ఆడియెన్స్​ను పలకరించనుంది. దీన్ని బట్టే ఫ్రైడే సెంటిమెంట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే సినిమా విడుదలకు శుక్రవారాన్ని మాత్రమే ఫిల్మ్ మేకర్స్ ఎంచుకోవడానికి గల కారణం ఏంటో ఇప్పడు చూద్దాం..

శుక్రవారం రిలీజ్ అనేది భారత్​లో లేదు. మన దేశంలో ఎప్పుడు పడితే అప్పుడు సినిమాలు విడుదలయ్యేవి. అలా విడుదలైన వాటిల్లో బాలీవుడ్ నటుడు రాజ్ కపూర్ నటించిన ‘నీల్ కమల్’, తెలుగులో ‘పాతాళభైరవి’, ‘మాయాబజార్’ మూవీస్ కూడా ఉన్నాయి. ఇలా బ్లాక్​బస్టర్స్​గా నిలిచిన చాలా చిత్రాలు శుక్రవారం విడుదల కాలేదు. అయితే ఫ్రైడే రిలీజ్ సెంటిమెంట్ ఎక్కడ నుంచి వచ్చింది అంటే మాత్రం హాలీవుడ్ పేరే చెప్పాలి. అంతకు ముందు ఎప్పుడు పడితే అప్పుడు, వారాలతో సంబంధం లేకుండా సినిమాలు విడుదలయ్యేవి. మొదట్లో శుక్రవారం కాకుండా మిగతా రోజుల్లో మూవీస్ రిలీజ్ చేస్తే కలెక్షన్లు పెద్దగా వచ్చేవి కాదు. దీంతో మేకర్స్ అందరూ కూర్చొని చర్చించుకున్నారు. ఫైనల్​గా శుక్రవారం విడుదల చేయాలని నిర్ణయించారు. ఆరోజే ఎందుకంటే అప్పట్లో కార్మికులకు వేతనాలు వారానికోసారి ఇచ్చేవారు. సోమవారం నుంచి శుక్రవారం వరకూ పని చేయించుకునేవారు.

అప్పట్లో కార్మికులకు శని, ఆదివారాలు సెలవులు ఇచ్చేవారు. సోమవారం నుంచి శుక్రవారం వరకూ పని చేయించుకొని.. ఆరోజు సాయంత్రం జీతాలు ఇచ్చేవారు. వేతనం తీసుకున్న కూలీలు, కార్మికులు ఆరోజు సాయంత్రమే కుటుంబంతో కలసి సినిమా చూస్తారని.. ఆ తర్వాత రెండ్రోజులు కూడా మూవీస్ చూస్తారని శుక్రవారం నాడే ఫిల్మ్స్ రిలీజ్ చేయాలని నిర్ణయించారు. అలా మూడ్రోజులు సినిమాకు కలెక్షన్లు బాగా వచ్చేవట. హాలీవుడ్​లో మొదటగా ‘గాన్ విత్ ది విండ్’ అనే సినిమాతో శుక్రవారం రిలీజ్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఈ సినిమా 1939, డిసెంబర్ 15న విడుదలైంది. ఇక, మన దేశంలో శుక్రవారం విడుదల చేయడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి హాలీవుడ్ ట్రెండ్​ను ఫాలో అవడం, రెండు శుక్రవారం లక్ష్మీదేవి సెంటిమెంట్, శుభం కలుగుతుందని నమ్మకం. మొదట్లో మన మూవీస్ అమావాస్య రోజుల్లో విడుదల చేసేవారు.

మనది వ్యవసాయ ఆధార దేశం. అప్పట్లో సాగు చేసే రైతులు ఎక్కువగా ఉండేవారు. అమావాస్య రోజున అన్నదాతలు పని చేసేవారు కాదు. దీంతో వాళ్లు సినిమాలు చూడటానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. అమావాస్య రోజుల్లో సినిమా హాల్స్​కు వెళ్లేవారు. ఆ తర్వాత హాలీవుడ్ కల్చర్​ను బాలీవుడ్ సినిమాలు, ఆ తర్వాత టాలీవుడ్ సహా ఇతర సినీ పరిశ్రమలు అనుసరించడం మొదలుపెట్టాయి. దీనికి తోడు ప్రజలు వ్యవసాయం తగ్గించి ఇతర వృత్తులను ఎంచుకోవడం.. శని, ఆదివారాలు సెలవు రావడం వంటి కారణాలతో ఈ మూడ్రోజులూ ఫిల్మ్స్ చూసేందుకు ఇష్టపడేవారు. అలా బాలీవుడ్​లో మొదటగా శుక్రవారం విడుదలైన సినిమా ‘మొఘల్ ఏ ఆజమ్’. ఈ సినిమా 1960, ఆగస్టు 5న విడుదలైంది. ఇంకా ఈ ట్రెండ్​ను కొనసాగించడానికి కారణం.. మల్టీప్లెక్సుల్లో మిగతా రోజుల కంటే శుక్రవారం నాడు రెంట్ తక్కువగా ఉండటం.

నిర్మాతలు మల్టీప్లెక్స్ యజమానులకు శుక్రవారం నాడు తక్కువ రెంట్ పే చేస్తారు. అందుకే కొత్త సినిమాలను ఫ్రైడే రిలీజ్ చేస్తారు. ఏ ఇండస్ట్రీ అయినా యూనివర్సల్ పాయింట్ ఒకటే. వీకెండ్ అంటే ఎంజాయ్ చేయాలని చాలా మంది ఫిక్స్ అయిపోతారు. శుక్రవారం వచ్చిందంటే వీకెండ్ అని, వేడుకకు ఆరంభం అని అర్థం. శనివారం అంటే ఎక్కువ మందికి నచ్చే వారం. ఎందుకంటే తర్వాతే ఆదివారం కాబట్టి. ఇలా కొన్ని లెక్కలు వేసుకొని శుక్రవారాన్ని రిలీజ్ డేట్​గా ఫిక్స్ చేసుకున్నారు. అయితే సినిమా వసూళ్లు సరిపోవడం లేదని కొంతమంది ఒకరోజు ముందే మూవీస్ రిలీజ్ చేస్తున్నారు. అదన్నమాట విషయం. మరి శుక్రవారం పూటే సినిమాలు విడుదల చేయడానికి మీకేమైనా కారణాలు తెలిస్తే కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: Shah Rukh Khan-Salaar Movie: ప్రభాస్ ‘సలార్’కు థియేటర్లు ఇవ్వొద్దంటూ షారుఖ్ ఫోన్ చేశాడంటూ వార్తలు

Jojobet GirişmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibomromabet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GiriştestereCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap