iDreamPost

Shah Rukh Khan-Salaar Movie: ప్రభాస్ ‘సలార్’ కు థియేటర్లు ఇవ్వొద్దంటూ షారుఖ్ ఫోన్ చేశాడంటూ వార్తలు

  • Published Dec 21, 2023 | 1:07 PMUpdated Dec 21, 2023 | 1:07 PM

బాక్సాఫీస్ వద్ద డంకీ, సలార్ వంటి రెండు భారీ చిత్రాలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో షారుక్ ఖాన్ కి సంబంధించిన ఓ వార్త తెగ వైరలవుతోంది. ఆ వివరాలు..

బాక్సాఫీస్ వద్ద డంకీ, సలార్ వంటి రెండు భారీ చిత్రాలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో షారుక్ ఖాన్ కి సంబంధించిన ఓ వార్త తెగ వైరలవుతోంది. ఆ వివరాలు..

  • Published Dec 21, 2023 | 1:07 PMUpdated Dec 21, 2023 | 1:07 PM
Shah Rukh Khan-Salaar Movie: ప్రభాస్ ‘సలార్’ కు థియేటర్లు ఇవ్వొద్దంటూ షారుఖ్ ఫోన్ చేశాడంటూ వార్తలు

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సలార్ పేరు మార్మొగిపోతుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో సలార్ ఫీవర్ మాములుగా లేదు. కేజీఎఫ్ సినిమా ద్వారా దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో తెరకెక్కిన సలార్ మీద ప్రేక్షకులకు భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. డిసెంబర్ 22న సలార్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో సలార్ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇక సలార్ కు పోటీగా.. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన డంకీ సినిమా నేడు అనగా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే పాజిటివ్ టాక్ తెచ్చుకుని.. హిట్ దిశగా దూసుకుపోతుంది.

రాజ్ కుమార్ హిరానీ, షారుఖ్ ఖాతాలో డంకీతో మరో బ్లాక్ బాస్టర్ హిట్ పడింది అంటున్నారు. ఇదిలా ఉంచితే.. తాజాగా షారుక్ ఖాన్ కి సంబంధించిన ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. సలార్ క్రేజ్ కు భయపడ్డ షారుక్.. ఆ సినిమాకు థియేటర్లు ఇవ్వకూడదని ఫోన్ చేశారంటూ ఇంగ్లీష్ మీడియా సైట్లు వార్తలు రాసుకొచ్చాయి. ఆ వివరాలు..

ఈ వార్తలు రావడానికి కారణం.. కొన్ని థియేటర్లు డంకీ సినిమాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం. సాధారణంగా సలార్, డంకీ చిత్రాలు విడుదల నేపథ్యంలో ఈ రెండు చిత్రాలు థియేటర్లను పంచుకోవాల్సి వస్తుందని.. పరిశ్రమ వర్గాలు ముందు నుంచే చెప్పుకొచ్చాయి. ప్రాంతం, రాష్ట్రం బట్టి షారుఖ్, ప్రభాస్ క్రేజ్ బేరీజు వేసుకుని థియేటర్లు కేటాయిస్తారని అనుకున్నారు. కానీ సలార్ సినిమా విడుదల దగ్గరకు వచ్చే సరికి ఆ విధంగా జరగలేదు. ‘డంకీ’కి అనుకూలంగా సదరు థియేటర్లు నిర్ణయం తీసుకున్నాయి.

సలార్ టీమ్ ను మోసం చేసిన థియేటర్లు..

దక్షిణాది రాష్ట్రాల్లో సదరు థియేటర్లు అంటే మల్టీప్లెక్స్ స్క్రీన్లు మాత్రమే. కానీ, ఆ సంస్థకు దేశవ్యాప్తంగా 1650 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నాయి. ఈరెండు థియేటర్లు తమ అధ్వర్యంలో ఉన్న స్క్రీనల్లన్నింటిలోనూ ఆదివారం వరకు ‘డంకీ’ సినిమా షోలు షెడ్యూల్ చేశారు. బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. తొలుత ‘డంకీ’, ‘సలార్’కు సమంగా థియేటర్లు ఇస్తామని చెప్పిన సదరు థియేటర్లు.. రాత్రికి రాత్రి తన నిర్ణయాన్ని మార్చుకుంది. షారుఖ్ ఖాన్ సినిమాకు మేలు కలిగించేలా అడుగులు వేసింది. సలార్ సినిమాను పక్కకు పెట్టింది.

షాకిచ్చిన సలార్ టీమ్..

షారుఖ్ కొత్త సినిమా ‘డంకీ’కి మేలు చేయాలని ప్రయత్నించిన సదరు థియేటర్లకు ‘సలార్’ టీమ్ గట్టిగా బుద్ది చెప్పింది. ఆ సంస్థలకు చెందిన స్క్రీన్లలో తమ సినిమా విడుదల చేయకూడదని తాజాగా సలార్ టీమ్ నిర్ణయం తీసుకుంది. అయితే… సదరు థియేటర్లు తీసుకున్న నిర్ణయం, ప్రభాస్ సినిమాకు అన్యాయం జరగడం వెనుక షారుఖ్ ఉన్నారని ముంబై మీడియా వర్గాల కథనం. ఈ మేరకు కొన్ని ఇంగ్లీష్ సైట్లు కూడా వార్తలు రాసుకొచ్చాయి.

థియేటర్ల యజమానికి షారుఖ్ ఫోన్!?

సదరు థియేటర్లు రాత్రికి రాత్రే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక కింగ్ ఖాన్ షారుఖ్ ఉన్నారని బాలీవుడ్ మీడియా వర్గాలు చెబుతున్నాయి. ‘డంకీ’, ‘సలార్’… రెండు సినిమాలకు సమానంగా స్క్రీన్లు ఇవ్వాలని అనుకుంటున్న విషయం ‘డంకీ’ చిత్ర బృందానికి తెలిసిందట. దాంతో షారుఖ్ రంగంలోకి దిగి.. సదరు థియేటర్ ఓనర్ (యాజమాన్యాని)కి నేరుగా ఫోన్ చేశారట. అంత పెద్ద స్టార్ హీరో నుంచి డైరెక్ట్ ఫోన్ కాల్ రావడంతో సదరు థియేటర్ తమ అధ్వర్యంలో నడుస్తోన్న సింగిల్ స్క్రీన్లు అన్నిటినీ ‘డంకీ’కి ఇచ్చారని తెలుస్తోంది.

ఈ నిర్ణయంపై ‘సలార్’ సినిమాను నార్త్ ఇండియాలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న అనిల్ తడానీకి, హోంబలే నిర్మాణ సంస్థకు ఆగ్రహం కలిగిందట. దాంతో ఉత్తరాదిలో సలార్ సినిమాలకు స్క్రీన్లు ఇచ్చే వరకు దక్షిణాదిలో థియేటర్ స్క్రీన్లలో తమ సినిమా వేయకూడదని ‘సలార్’ టీమ్ డిసైడ్ అయ్యిందంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలపై షారుక్ ఎలా స్పందిస్తారో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి