iDreamPost
android-app
ios-app

రాయలసీమ వాళ్లకి గుడ్ న్యూస్..విజయ్ సినిమాలో నటించే ఛాన్స్!

  • Published Jun 25, 2024 | 5:33 PM Updated Updated Jun 25, 2024 | 5:33 PM

Vijay Devarakonda: ఫ్యామిలీ స్టార్ మూవీ తరువాత మరో సినిమాకు విజయ్ దేవరకొండ ఓకే చేశారు. ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతుంది. దీంతో తాజాగా ఈ సినిమా కోసం కొత్త నటీనటులను తీసుకోవాలని మూవీ టీమ్ నిర్ణయించుకుంది.

Vijay Devarakonda: ఫ్యామిలీ స్టార్ మూవీ తరువాత మరో సినిమాకు విజయ్ దేవరకొండ ఓకే చేశారు. ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతుంది. దీంతో తాజాగా ఈ సినిమా కోసం కొత్త నటీనటులను తీసుకోవాలని మూవీ టీమ్ నిర్ణయించుకుంది.

  • Published Jun 25, 2024 | 5:33 PMUpdated Jun 25, 2024 | 5:33 PM
రాయలసీమ వాళ్లకి గుడ్ న్యూస్..విజయ్ సినిమాలో నటించే ఛాన్స్!

ఇటీవల కాలంలో వివిధ ప్రాంతాల నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా చిత్తూరు యాసలో వచ్చిన ‘పుష్ప’ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టించిందో తెలిసిందే. అలానే ఇటీవలే సుధీర్ బాబు కూడా కుప్పం ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కిన ‘హరోం హర’ సినిమాలో నటించి అందరిని మెప్పించాడు. ఇది ఇలా ఉంటే.. రాయలసీమ యాస, ఆ ప్రాంత నేపథ్యంలోనే అనేక సినిమాలు వచ్చాయి. అలానే చాలా మంది హీరోలు ఈ ప్రాంత నేపథ్యంలోని సినిమాల్లో నటించారు. తాజాగా ఆ జాబితాల్లో విజయ్ దేవరకొండ చేరనున్నారు. అతడు తాజాగా నటిస్తున్న సినిమా షూటింగ్ అంత అక్కడే జరగనుంది. ఇదే సమయంలో రాయలసీమవాళ్లకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పర్లేదు. అర్జున్ రెడ్డి, గీతాగోవిందం వంటి సినిమాలో టాలీవుడ్ లో టాప్ హీరో రేంజ్ కి వెళ్లాడు. లైగర్ సినిమాతో కాస్తాస్లో అయినా ఆ తరువాత వచ్చిన ఖుషి సినిమాతో మరోసారి ట్రాక్ లోకి వచ్చాడు. ఇలానే ఇటీవలే ఫ్యామిలీ స్టార్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ విజయ్ కి జోడిగా నటించింది. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మిక్సిడ్ టాక్ వచ్చింది. ఇక ఈ సినిమా తరువాత వెంటనే వరుసగా రెండు సినిమాలను విజయ్ అనౌన్స్ చేశాడు. ఈసారి యంగ్ డైరెక్టర్స్‌తో కలిసి పనిచేసేందుకు విజయ్ సిద్ధమయ్యాడు. ఇందులో దర్శకుడు రాహుల్ సంకృత్యన్‌తో ఒక సినిమా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్న ఈ చిత్రం ‘VD 14’ అనే వర్కింగ్ టైటిల్‌ పెట్టారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ యాక్షన్ సినిమా నుంచి ఈ రోజు కాస్టింగ్ కాల్ ప్రకటన చేశారు.

ఆసక్తిగల నటీనటులను ఎంపిక చేసి.. VD14లో నటించే అవకాశం కల్పించబోతున్నారు. రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాల్లో ఆడిషన్లు నిర్వహించనున్నారు. తిరుపతి, అనంతపురం, కడప, కర్నూల్‌లో జూలై 1 నుంచి జులై 9వ తేదీ వరకూ ఈ ఆడియన్స్‌ను జరగనున్నాయి. ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఆడిషన్స్ జరగనున్నాయి. దీంతో యాక్టింగ్ ప్రతిభ ఉండి రాయలసీమ యాసలో అదరగొట్టే వారికి ఇది ఓ బంపర్ ఆఫర్ అని మూవీ టీమ్ తెలిపింది. ఈ సినిమా షూటింగ్ మొత్తం రాయలసీమలోనే జరగనుందని సమాచారం. ఈ నేపథ్యంలోనే కనుక ఆ యాస వచ్చి నటనలో ప్రతిభ ఉంటే చాలని VD14 ప్రకటన చేసింది. ఈ మేరకు ఆడిషన్స్ జరిగే టైమ్, ప్లేస్‌‌ వివరాలను తెలుపుతూ మూవీ మేకర్స్ ప్రకటన విడుదల చేశారు.

Jojobet GirişjojobetsezarcasinoJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomcasibomjojobetcasibomsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş