iDreamPost
android-app
ios-app

బాబాయ్ హోటల్లో సందడి చేసిన వెంకీ మామ

  • Published Dec 11, 2023 | 4:50 PM Updated Updated Dec 11, 2023 | 4:50 PM

వెంకీ మామ నుండి రాబోతున్న తదుపరి మూవీ సైంధవ్. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ మూవీ విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లను షురూ చేసింది చిత్ర యూనిట్. అయితే ఈ సినిమా సెకండ్ సింగిల్ లాంచ్ ఈవెంట్ ను గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలో ఉన్న కేఎల్ యూనివర్శిటీలో ప్లాన్ చేసింది.

వెంకీ మామ నుండి రాబోతున్న తదుపరి మూవీ సైంధవ్. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ మూవీ విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లను షురూ చేసింది చిత్ర యూనిట్. అయితే ఈ సినిమా సెకండ్ సింగిల్ లాంచ్ ఈవెంట్ ను గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలో ఉన్న కేఎల్ యూనివర్శిటీలో ప్లాన్ చేసింది.

  • Published Dec 11, 2023 | 4:50 PMUpdated Dec 11, 2023 | 4:50 PM
బాబాయ్ హోటల్లో సందడి చేసిన వెంకీ మామ

ప్రతి ఒక్కరికీ ఓ ఫేవరేట్ హీరో ఉంటాడు. కానీ అందరికి నచ్చిన హీరోగా పేరు తెచ్చుకున్నాడు విక్టరీ వెంకటేష్. ఆయన సినిమాలు వస్తున్నాయంటే.. ఇంటిల్లిపాదీ చూడొచ్చని, హాయిగా నవ్వుకోవచ్చుని భావిస్తుంటారు ప్రేక్షకులు. ఇటీవల వచ్చిన రానా నాయుడు వెబ్ సిరీస్ తప్ప.. ఆయన గురించి, ఆయన మూవీస్ గురించి క్లీన్ చీట్ ఉంది. వెంకీ మామగా ఇప్పటి యూత్‌ను ఆకట్టుకుంటున్న వెంకటేష్.. వచ్చే ఏడాది సంక్రాంతికి సైంధవ్ మూవీతో రాబోతున్నాడు. ఈ మూవీ జనవరి 13న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ టీజర్, ఫస్ట్ సింగిల్ ఆకట్టుకున్న సంగతి విదితమే.

వెంకటేష్ 75 చిత్రంగా వస్తోన్న సైంధవ్‌కు హిట్ మూవీ సిరీస్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధికీ ఈ మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఆర్య, రుహనీ శర్మ, ఆండ్రియా జెర్మియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో అప్పుడే ప్రమోషన్లను షురూ చేసింది మూవీ టీం. ఈ సందర్భంగా డిసెంబర్ 11న విజయవాడ, గుంటూరు ప్రాంతాలను చుట్టేస్తోంది. ఈ రోజే సెకండ్ సింగిల్ లాంచ్ ఈవెంట్ కూడా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో విజయవాడకు చేరుకుంది చిత్ర యూనిట్. అదే సమయంలో వెంకీ విజయవాడలో సందడి చేశారు.

కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు వెంకటేష్. డైరెక్టర్, శ్రద్ధా కూడా దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆశీర్వాదం అందించారు. ఆ తర్వాత బెజవాడలో ఫేమస్ టిఫిన్ సెంటర్.. బాబాయ్ హోటల్లో సందడి చేశారు వెంకీ. అక్కడ కొంత మందితో ముచ్చటించి.. ఇక్కడ ఏం తినాలని అడిగారు. ఇక్కడ ఇడ్లీ బాగుంటుందని తెలిసి.. ఆర్డర్ చేశారు. కాసేపు అక్కడ టిఫిన్ చేస్తున్న అభిమానులతో మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. అలాగే ఈ టీం విజయవాడ బస్సుల్లో కూడా సందడి చేసింది. అనంతరం గుంటూరులో పర్యటించారు. వీవీఐటీ కాలేజీకి వెళ్లారు. సాయంత్రం కేఎల్ యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సెకండ్ సింగిల్ లాంచ్ చేయనున్నారు మేకర్స్. మరీ ఈ సినిమా ఎలా ఉండబోతుందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJokerbetJokerbetJokerbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgoo girişgrandpashabetEscortes Belgique