iDreamPost
android-app
ios-app

ప్రధాని మోదీని తన పెళ్లికి ఆహ్వానించిన వరలక్ష్మి! పోస్టు వైరల్..

  • Published Jun 29, 2024 | 3:02 PM Updated Updated Jun 29, 2024 | 3:02 PM

Varalaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్..ఈమె గురించి సినీ ప్రియులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. తన ప్రతిభతో విభిన్నమైన పాత్రలతో సినీ ప్రియుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. త్వరలో ముంబైకి చెందిన పెయింట్ ఆర్టిస్ట్ నికోలయ్ సచ్‌దేవ్ ను వివాహం చేసుకోనుంది.

Varalaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్..ఈమె గురించి సినీ ప్రియులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. తన ప్రతిభతో విభిన్నమైన పాత్రలతో సినీ ప్రియుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. త్వరలో ముంబైకి చెందిన పెయింట్ ఆర్టిస్ట్ నికోలయ్ సచ్‌దేవ్ ను వివాహం చేసుకోనుంది.

  • Published Jun 29, 2024 | 3:02 PMUpdated Jun 29, 2024 | 3:02 PM
ప్రధాని మోదీని తన పెళ్లికి ఆహ్వానించిన వరలక్ష్మి! పోస్టు వైరల్..

ఇటీవల కాలంలో పలువురు సెలబ్రిటీలు పెళ్లి పీటలెక్కుతున్నారు. అంతేకాక తమకు కాబోయే భాగస్వామికి సంబంధించిన వివరాలను, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. ఇక తమ పెళ్లికి పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా నెట్టింట్లో షేర్ చేసుకుంటున్నారు. తాజాగా తమిళ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్…ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. తన పెళ్లికి ఆహ్వానిస్తూ.. ఆయనకు వెడ్డింగ్ కార్డును అందజేశారు. ఈ క్రమంలో తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ…సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది.

వరలక్ష్మి శరత్ కుమార్..ఈమె గురించి సినీ ప్రియులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. కోలీవుడ్ హీరో శరత్ కుమార్ కుమార్తెగా సినీ కెరీర్ ప్రారంభించింది. అనతికాలంలోనే తన ప్రతిభతో విభిన్నమైన పాత్రలతో సినీ ప్రియుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. టాలీవుడ్ లేడీ విలన్స్ కొరత ఉన్న నేపథ్యంలోనే ఆ ఖాళీని వరలక్ష్మి భర్తీ చేస్తోంది. విలన్ అనే కాదు.. యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్రలతో అలరిస్తోంది. ఇటీవలే ఈ అమ్మడు ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసింది. త్వరలో ముంబైకి చెందిన పెయింట్ ఆర్టిస్ట్ నికోలయ్ సచ్‌దేవ్ తో ఆమె ఏడడుగులు వేయనుంది. వరలక్ష్మి పెళ్లి చాలా సింపుల్ గా జరగనుంది. అలానే రిసెష్పెన్ మాత్రం చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకకు ఇండియాకు చెందిన చాలా మంది ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు.

Varalaxmi

ఈ నేపథ్యంలోనే తాజాగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆహ్వానం అందించారు. శరత్ కుమార్ ఫ్యామిలీ అంతా కలిసి ఇటీవల ప్రధాని మోదీని ఆహ్వానాన్ని అందించారు. ఇదే విషయాన్ని వరలక్ష్మీ శరత్ కుమార్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రధానితో కలిసిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ…దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారిని కలవడం చాలా ఆనందంగా ఉందని తెలిపింది. అంతేకాక ఆయన స్వాగతం పలకడంపై కృతజ్ఞతలు తెలిపింది. ఎంతో బిజీ షెడ్యూల్ లో కూడా తమ కోసం సమయాన్ని కేటాయించారని, అందుకు మాకు చాలా  సంతోషంగా ఉందని వరలక్ష్మి తెలిపింది. మోదీ గారిని కలిసేలా చేసినందుకు తన తండ్రి శరత్ కుమార్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అంటూ రాసుకొచ్చారు వరలక్ష్మి శరత్ కుమార్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio