iDreamPost
android-app
ios-app

యూవీ క్రియేషన్స్ సాహసం.. ‘రాధేశ్యామ్’ దర్శకుడికి మరో ఛాన్స్..!

  • Published Nov 08, 2023 | 4:38 PM Updated Updated Nov 08, 2023 | 7:58 PM

తెలుగు పరిశ్రమలో కొత్త దర్శకులు వస్తున్నారు. కథలు, కథనాలను తెరపైన సరికొత్తగా ప్రజెంట్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో బడా నిర్మాణ సంస్థలు కూడా వీరికి అవకాశాలు ఇస్తున్నాయి. ఓ సారి ఫెయిల్ అయితే.. ఆ సంస్థ నుండి పిలువు రావడం చాలా అరుదు. కానీ ఈ దర్శకుడికి మాత్రం..

తెలుగు పరిశ్రమలో కొత్త దర్శకులు వస్తున్నారు. కథలు, కథనాలను తెరపైన సరికొత్తగా ప్రజెంట్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో బడా నిర్మాణ సంస్థలు కూడా వీరికి అవకాశాలు ఇస్తున్నాయి. ఓ సారి ఫెయిల్ అయితే.. ఆ సంస్థ నుండి పిలువు రావడం చాలా అరుదు. కానీ ఈ దర్శకుడికి మాత్రం..

  • Published Nov 08, 2023 | 4:38 PMUpdated Nov 08, 2023 | 7:58 PM
యూవీ క్రియేషన్స్ సాహసం.. ‘రాధేశ్యామ్’ దర్శకుడికి మరో ఛాన్స్..!

ఇప్పుడొస్తున్న యంగ్ డైరెక్టర్స్ కొత్త కథలతో సినీ పరిశ్రమకు జీవం పోస్తున్నారు. నాలుగు ఫైట్లు, ఆరు సాంగ్స్, హారోయిన్స్‌కు రెండు సీన్లు అనే మూస పద్ధతిని బ్రేక్ చేశారు. కథ ఎలా ఉన్నా, కథనాన్ని సరికొత్తగా ప్రజెంట్ చేస్తున్నారు. టెక్నీకల్ వాల్యూస్, రిచ్ లొకేషన్స్, బెస్ట్ కెమెరా పనితనాన్ని చూపిస్తూ.. అభిరుచి ఉన్న దర్శకులుగా నిరూపించుకున్నారు. అయితే హీరోకు హిట్ ఇస్తేనే.. నెక్ట్స్ మూవీ పట్టాలెక్కుతుంది. లేదంటే.. ఇక సినిమాలకు గుడ్ బై చెప్పాల్సిందే. అయితే ఓ సారి ప్లాప్ ఇచ్చిన దర్శకుడికి మళ్లీ అవకాశం ఇవ్వడమే గ్రేట్. కానీ మళ్లీ మళ్లీ ఇవ్వడం చాలా అరుదు. కానీ ఈ సాహసం చేస్తుంది ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్. ఇంతకు ఆ దర్శకుడు ఎవరంటే..?

బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన డార్లింగ్ ప్రభాస్‌కు డిజాస్టర్ ఇచ్చిన రాధా కృష్ణ కుమార్. ఆ మూవీనే రాధే శ్యామ్.  గోపిచంద్ హీరోగా యూవీ క్రియేషన్స్ తెరకెక్కించిన జిల్ మూవీ దర్శకుడు ఆయనే. జిల్ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకున్నా.. అతడి టేకింగ్ స్టైల్ నచ్చి.. రాధా కృష్ణకు అవకాశం ఇచ్చింది ఆ బ్యానర్. ఈ సారి ఏకంగా గ్లోబల్ రేంజ్‌కు వెళ్లిన ప్రభాస్‌తో సినిమా ప్లాన్ చేసింది. అదే రాధే శ్యామ్. పీరియాడిక్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమా గతేడాది థియేటర్లలో రిలీజై.. ఘోర వైఫల్యాన్ని మూటకట్టుకుంది. బాహుబలి తర్వాత సాహో రాగా.. తెలుగు ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. రాధే శ్యామ్‌పై ఆశలు పెట్టుకోగా వాటిని గల్లంతు చేశాడు దర్శకుడు.

ఈ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ.. మూడవ సారి అవకాశం ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరోసారి ప్రభాస్ ఫ్రెండ్ గోపించంద్‌ ను డైరెక్ట్ చేయబోతున్నాడు రాధా కృష్ణ. ఈ మూవీ స్క్రిప్ట్ పనులు ముగిశాయని, ప్రస్తుం ప్రీ పొడక్షన్ వర్క్ జరుగుతుందని సమాచారం. మరీ ఈ సారైనా యువీ క్రియేషన్ పై సిరులు కురుస్తాయో లేదో వేచి చూడాల్సిందే. దీన్ని చూస్తుంటే రాధా నక్క తోక తొక్కి వచ్చినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే.. ఓసారి సినిమా ప్లాప్ అయితే.. ఆ దర్శకుడికి మరో అవకాశం ఇవ్వడానికి వెనుకాడుతుంటాయి. అలాంటిది రెండు సినిమాలు చెప్పుకోదగ్గ హిట్లు లేకపోయినా.. మరో ఛాన్స్ పిలిచి ఇచ్చింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet