Allu Arjun At Nandyala Ram Charan At Pithapuram: పిఠాపురంలో చరణ్ దిగే లోపే.. నంద్యాలలో సునామి సృష్టించిన బన్నీ!

Allu Arjun: పిఠాపురంలో చరణ్ దిగే లోపే.. నంద్యాలలో సునామి సృష్టించిన బన్నీ!

ఏపీ ఎన్నికల ప్రచారం నేటితో తుది దశకు చేరుకుంది. ఇక క్యాంపెయిన్‌ చివరి రోజు ఏపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇద్దరు స్టార్‌ హీరోల రాకతో.. ఏపీ ఎన్నికలు నెట్టింట్లో ట్రెండింగ్‌లో నిలిచాయి. ఆ వివరాలు..

ఏపీ ఎన్నికల ప్రచారం నేటితో తుది దశకు చేరుకుంది. ఇక క్యాంపెయిన్‌ చివరి రోజు ఏపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇద్దరు స్టార్‌ హీరోల రాకతో.. ఏపీ ఎన్నికలు నెట్టింట్లో ట్రెండింగ్‌లో నిలిచాయి. ఆ వివరాలు..

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది. నేటితో ప్రచారానికి తెర పడనుంది. మరి కొన్ని గంటల్లో మైక్‌లు మూగబోతాయి. 24 గంటల వ్యవధి తర్వాత.. అనగా మే 13, సోమవారం నాడు పోలింగ్‌ జరగనుంది. ఇక నేడు ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో.. నేతలు దూకుడు పెంచారు. వరుస సభలు, సమావేశాలు, కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన శనివారం నాడు ఏపీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇద్దరు టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు.. వేర్వేరు పార్టీల తరఫున ప్రచారం చేయడం కోసం ఏపీలో అడుగుపెట్టారు. దాంతో చివరి రోజు ఎన్నికల ప్రచారం దద్దరిల్లింది. జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌కు మద్దతుగా రామ్‌ చరణ్‌ పిఠాపురం వెళ్తే.. తన స్నేహితుడు, వైసీపీ ఎమ్మెల్యే క్యాండేట్‌ శిల్పా రవిచంద్రా రెడ్డి కోసం ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నంద్యాలకు వచ్చాడు. దాంతో ట్విట్టర్‌లో ఈ ఇద్దరి హీరోల పర్యటనలు ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి.

ఇక నంద్యాలలో బన్నీకి ఘన స్వాగతం లభించింది. భారీ గజమాలతో స్వాగతం పలికారు. బన్నీ నంద్యాల పర్యటన గురించి ముందే సమాచారం ఉండటంతో.. ఆయనను చూసేందుకు భారీ ఎత్తున జనాలు తరలి వచ్చారు. రాజకీయ నాయకుడి మీటింగ్‌కు కూడా రానంత స్పందన.. పుష్ప రాజ్‌కు వచ్చింది. ఇసుకేస్తే రాలనంత మంది తరలి రావడంతో.. నంద్యాలలో జనసంద్రం కనిపించింది. ఇక తన స్నేహితుడికి మద్దతుగా బన్నీ.. నేడు నంద్యాలలో పర్యటించారు. ఇక ఇదే రోజు అనగా శనివారం నాడు.. మరో మెగా హీరో రామ్‌ చరణ్‌.. జనసేన అధ్యక్షుడు, తన బాబాయ్‌ పవన్‌ కళ్యాణ్‌కు మద్దతుగా పిఠాపురంలో పర్యటించారు.

అయితే ఇద్దరి హీరోల పర్యటన గురించి ముందే సమాచారం ఉన్నప్పటికి.. చరణ్‌ కన్నా బన్నీని చూడటం కోసం జనాలు భారీ ఎత్తున తరలి వచ్చారు. ముందుగా చరణ్‌.. పిఠాపురంలో పర్యటించడం రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారగా.. బన్నీ పర్యటన ఊపులో అది కొట్టుకుపోయింది. ఐకాన్‌ స్టార్‌ని చూడటం కోసం సినీ, రాజకీయ అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు. బన్నీ పర్యటనకు వచ్చిన స్పందన వైసీపీలో జోరు, జోష్‌ పెంచింది. బన్నీ పర్యటనకు వచ్చిన స్పందనను చూస్తే.. పుష్ప రాజ్‌ చరణ్‌ టూర్‌ని మింగేశాడు అంటున్నారు వైసీపీ శ్రేణులు. ఇక ప్రస్తుతం వీరిద్దరి పర్యటన గురించి ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది.

Show comments