iDreamPost
android-app
ios-app

300 సినిమాల్లో విలన్‌.. కోట్ల ఆస్తులు.. చివరకు చేతిలో చిల్లిగవ్వ లేకుండా చితికిపోయి

  • Published Jun 05, 2024 | 11:27 AM Updated Updated Jun 05, 2024 | 11:27 AM

Mahesh Anand: టాలీవుడ్‌, బాలీవుడ్‌లో విలన్‌గా రాణించి ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఓ నటుడు.. చివరకు అనాథలా ప్రాణాలు విడిచాడు. ఆ వివరాలు..

Mahesh Anand: టాలీవుడ్‌, బాలీవుడ్‌లో విలన్‌గా రాణించి ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఓ నటుడు.. చివరకు అనాథలా ప్రాణాలు విడిచాడు. ఆ వివరాలు..

  • Published Jun 05, 2024 | 11:27 AMUpdated Jun 05, 2024 | 11:27 AM
300 సినిమాల్లో విలన్‌.. కోట్ల ఆస్తులు.. చివరకు చేతిలో చిల్లిగవ్వ లేకుండా చితికిపోయి

సినిమా పరిశ్రమ అనేది ఓ రంగుల ప్రపంచం. బయట నుంచి చూసేవారికి అక్కడ ఉన్న వెలుగుజిలుగులే కనిపిస్తాయి. కానీ లోపల ఉన్న వారికి అక్కడి లోటుపాట్లు తెలుస్తాయి. ఇక పరిశ్రమలో డబ్బు, నేము, ఫేము ఉన్నంత కాలమే బంధువులు, బంధాలు ఉంటాయి. ఒక్కసారి అవి దూరమైతే.. బంధాలు కూడా దూరమవుతాయి. అప్పటి దాక మనల్ని గొప్పగా చూసిన వారు.. ఆ తర్వాత మనల్ని కనీసం పలకరించరు కూడా. మనం కాస్త మెతగ్గా ఉంటే నిండా ముంచుతారు. ఓ టాలీవుడ్‌ నటుడికి ఇదే పరిస్థితి ఎదురయ్యింది. ఆయన ఏకంగా వందల సినిమాల్లో నటించాడు.. కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించాడు. కానీ అయిన వారి చేతిలో మోసపోయి.. చివరకు చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా చితికి చేరుకున్నాడు. ఇంతకు ఎవరా నటుడంటే..

ఇప్పుడు మనం చెప్పుకోబోయే నటుడు టాలీవుడ్‌, బాలీవుడ్‌లో వందల సినిమాల్లో విలన్‌గా నటించాడు. కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించాడు. కానీ చివరకు అనాథలా మరణించాడు. అతడే మహేష్‌ ఆనంద్‌. బాలీవుడ్, టాలీవుడ్‌ పరిశ్రమలో 1990 దశకంలో సుమారు 300కుపైగా సినిమాల్లో విలన్‌గా చేశాడు మహేష్ ఆనంద్. హిందీ, తెలుగుతోపాటు మలయాళం సినిమాల్లోనూ తనదైన ముద్ర వేశాడు. ఎంతో ఆస్తి సంపాదించినా.. చివరకు కడు పేదరికంలో, ఎవరూ లేని అనాథలా ఒంటరిగా కన్నుమూశాడు. మద్యానికి బానిసైన అతడు చివరికి ఓ మందు బాటిల్ పక్కన పెట్టుకుని మరీ తుది శ్వాస విడిచాడు.

మహేష్ ఆనంద్ 2019, ఫిబ్రవరిలో కన్నుమూశాడు. ఆ సమయంలో ఇంట్లో అతడితో పాటు ఎవరూ లేరు. పని చేయడానికి వచ్చిన పని మనిషి ఎంత సేపు డోర్‌ కొట్టినా ఎలాంటి రెస్పాన్స్‌ లే దు. దాంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి డోరు తీసి చూడగా అప్పటికే అతడు చనిపోయాడు. ఆ సమయంలో అతని పక్కనే ఓ మందు బాటిల్, ముందు రోజు తినకుండా అలాగే వదిలేసిన ఆహారం కనిపించాయి. ఇక తాను చనిపోవడానికి రెండేళ్ల ముందు సోషల్ మీడియా ద్వారా తనకు ఎందుకీ పరిస్థితి వచ్చిందో ఓ పోస్టులో రాసుకొచ్చాడు మహేష్‌ ఆనంద్‌.

దీనిలో మహేష్‌ ఎవరు తనను ఎలా మోసం చేశారో వివరించాడు. ‘‘నా స్నేహితులు, సన్నిహితులందరూ నన్ను ఆల్కహాలిక్ అనేవారు. నాకు కుటుంబం లేదు. నా సవతి సోదరుడు నన్ను రూ.6 కోట్లకు మోసం చేశాడు. నేను 300కుపైగా సినిమాలు చేశాను. కానీ ఇప్పుడు కనీసం నీళ్లు కొనడానికి కూడా డబ్బులు లేవు. ఈ ప్రపంచంలో నాకు ఒక్క స్నేహితుడు కూడా లేడు’’ అంటూ ఎమోషనల్‌ పోస్ట్‌ చేశాడు.

మహేష్ ఆనంద్ ఎక్కువగా హిందీ సినిమాల్లోనే నటించాడు. 1982లో వచ్చిన సనమ్ తేరీ కసమ్ మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ.. టాప్ విలన్లలో ఒకడిగా ఎదిగాడు. తెలుగులోనూ 16 సినిమాల్లో నటించాడు. 1989లో చిరంజీవి లంకేశ్వరుడు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. చివరిగా 2005లో పవన్ కల్యాణ్ నటించిన బాలు సినిమాలో కనిపించాడు మహేష్‌ ఆనంద్‌.