Tirupathi Rao
Siddhu Jonnalagadda: యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ తన లైఫ్ లో జరిగిన కొన్ని విషయాలను పంచుకున్నాడు. అదే జరిగుంటే అసలు తను ఇప్పుడు ఉండే వాడిని కాదంటూ కామెంట్స్ చేశాడు.
Siddhu Jonnalagadda: యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ తన లైఫ్ లో జరిగిన కొన్ని విషయాలను పంచుకున్నాడు. అదే జరిగుంటే అసలు తను ఇప్పుడు ఉండే వాడిని కాదంటూ కామెంట్స్ చేశాడు.
Tirupathi Rao
టాలీవుడ్ లో ప్రస్తుతం ఎంతో మంది యంగ్ హీరోలు ఉన్నారు. ఒక్కొక్కరు సొంత కష్టాన్ని, టాలెంట్ ని నమ్ముకుని ఒక్కో మెట్టు ఎక్కుతూ.. ఇప్పుడు తెలుగు చలనచిత్ర సీమలో హీరోలుగా ఎదిగారు. వారిలో యంగ్ అండ్ టాలెంటెడ్ స్టార బాయ్ సిద్ధు జొన్నలగడ్డ కూడా ఒకడు. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన చిత్రాలతో అలరించిన సిద్ధు.. డీజే టిల్లుతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాడు. ఇప్పుడు టిల్లు స్క్వేర్ గా మరోసారి ఆడియన్స్ కి గిలిగిలంతలు పెట్టేందుకు రెడీ అయిపోయాడు. అయితే ఇంతటి నేమ్, ఫేమ్ చూడకుండానే తాను ఎప్పుడో చనిపోయి ఉండేవాడిని అంటూ సిద్ధు షాకింగ్ కామెంట్స్ చేశాడు.
స్టార్ బాయ్ సిద్ధూకి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. తన టాలెంట్ తో ముఖ్యంగా యువతలో మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ స్థాయికి రావడానికి సిద్ధు ఎంతో కష్టపడ్డాడు అని అందరికీ తెలిసిందే. అయితే ఈ స్టార్డమ్, ఈ ఫ్యాన్ బేస్, ఈ ఫాలోయింగ్ ఏమీ చూడకుండానే తాను ఇంజినీరింగ్ చదువుతున్న రోజుల్లోనే చనిపోయేవాడిని అంటూ సిద్ధూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. విషయం ఏంటంటే.. సిద్ధు జొన్నలగడ్డ పోలీసులు నిర్వహిస్తున్న రోడ్డు భద్రతా వారోత్సవాల్లో పాల్గొన్నాడు. ఆ సందర్భంగా తన లైఫ్ లో జరిగిన రెండు విషయాల గురించి ఫస్ట్ టైమ్ స్టేజ్ మీద కామెంట్స్ చేశాడు.
“నేను ఇంజినీరింగ్ చదువుతున్న రోజుల్లో ఎగ్జామ్స్ రాసి ఇంటికి వెళ్తున్నాను. కీసర నుంచి ఈసీఐఎల్ వైపు వెళ్తున్నాను. నా ఫ్రెండ్స్ కూడా వెనుక బైక్ మీద వస్తున్నారు. మా ఫ్రెండ్స్ లో ఒకడు నన్ను ఓవర్ టేక్ చేయాలి అని స్పీడుగా వచ్చాడు. అప్పుడు నేను కూడా 70 కిలోమీటర్ల స్పీడుతో ఉన్నాను. మా బైక్స్ హ్యాండిల్స్ గుద్దుకున్నాయి. మా రెండు బైక్స్ కిందపడిపోయాయి. అప్పుడు నా హెల్మెట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం విరిగిపోయింది. నా హెల్మెట్ పైన పెద్ద హోల్ పడింది. ఆ హెల్మెట్ చూసిన తర్వాత ఆ ప్లేస్ లో నా తలను ఊహించుకుంటే చాలా భయం వేసింది. హెల్మెట్ లేకపోతే నా తలకు ఆ హోల్ పడేది.. నా స్కల్ విరిగిపోయేది.
కొన్నేళ్ల తర్వాత నేను నా ఫ్రెండ్స్ కారులో వస్తున్నాం. నా ఫ్రెండ్ డ్రైవ్ చేస్తున్నాడు. మా కారుకు ఏదో అడ్డం రావడంతో ప్రమాదం జరిగింది. కారు మొత్తం 360 డిగ్రీలు రోల్ అయ్యి పల్టీ కొట్టింది. ఆ ప్రమాదంలో మా ముగ్గురు ఒంటి మీద కనీసం గీత కూడా పడలేదు. ఒక్క గీత కూడా పడకుండా మేము భయపడ్డాం. అందుకు ఒకటే కారణం మేము సీట్ బెల్ట్ పెట్టుకుని ఉన్నాం. ఆ రెండు సందర్భాల్లో నాకు లైఫ్ మరో ఛాన్స్ ఇచ్చింది. అలా రెండు అవకాశాలు దక్కాయి కాబట్టే ఆ తర్వాత డీజే టిల్లుగా మిమ్మల్ని ఎంటర్ టైన్ చేయగలిగాను. అందరికీ లైఫ్ లో అలాంటి అవకాశాలు వస్తాయని చెప్పలేం. అందుకే అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో మీకోసం కూడా రాధిక వెయిట్ చేస్తూ ఉంటుంది కదా? అందుకైనా జాగ్రత్తగా ఉండాలి” అంటూ సిద్ధు జొన్నలగడ్డ వ్యాఖ్యానించాడు. తన లైఫ్ లో జరిగిన విషయాలనే ఉదాహరణగా చెప్తూ సిద్ధూ రోడ్డు భద్రత మీద అవగాహన కల్పించాడు. సిద్ధు వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సినిమాల విషయానికి వస్తే.. టిల్లుస్క్వేర్ మూవీ మార్చి 29న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది.
#SiddhuJonnalagadda Joined Road Safety & Awareness Drive as Chief Guest conducted by Hyderabad Police at Sultan-Ul-Uloom Educational Society. Addresses students & requests them to wear helmets & avoid Drunk & Drive.#siddhujonnalagadda #Tollywood #Hyderabad #TSPolice… pic.twitter.com/PZ7x1IMb85
— Aadhan Telugu (@AadhanTelugu) February 13, 2024