iDreamPost
android-app
ios-app

రివ్యూలో స్టార్స్ తక్కువ ఇచ్చినా.. 100 రోజులు ఆడిన 6 సినిమాలు ఇవే!

సినిమా రివ్యూలు ఒకలా ఉన్నా.. ఫలితాలు మాత్రం అద్భుతంగా వచ్చిన టాలీవుడ్‌ చిత్రాలు చాలానే ఉన్నాయి. 100 రోజులకు పైగా థియేటర్లలో సందడి చేశాయి.

సినిమా రివ్యూలు ఒకలా ఉన్నా.. ఫలితాలు మాత్రం అద్భుతంగా వచ్చిన టాలీవుడ్‌ చిత్రాలు చాలానే ఉన్నాయి. 100 రోజులకు పైగా థియేటర్లలో సందడి చేశాయి.

రివ్యూలో స్టార్స్ తక్కువ ఇచ్చినా.. 100 రోజులు ఆడిన 6 సినిమాలు ఇవే!

సినిమాలకు రివ్యూలు ఇవ్వటం అన్న సంప్రదాయం ఇప్పటిది కాదు. టాకీ సినిమాలు మొదలైన నాటి నుంచి రివ్యూలు ఇవ్వటం అన్నది జరుగుతూ ఉంది. సోషల్‌ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత రివ్యూలు ఇచ్చే వాళ్లు పెరిగిపోయారు. సినిమా చూసి తమకు నచ్చింది రాస్తూ ఉన్నారు. కొంతమంది ప్రేక్షకులు కూడా రివ్యూలు చదివే సినిమాలకు వెళుతూ ఉన్నారంటే.. రివ్యూలకు ఉన్న ప్రాధాన్యత ఏంటో అర్థం అయిపోతుంది. కొన్ని సార్లు రివ్యూలు ఒకలా ఉంటే.. వాటి ఫలితాలు ఒకలా ఉండటం జరుగుతూ ఉంది.

రివ్యూలు బాలేకపోయినా.. సూపర్‌ సక్సెస్‌ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. గత కొద్దిరోజుల నుంచి రివ్యూవర్లకు- సినిమా నిర్మాతలకు మధ్య ఓ వివాదం నడుస్తోంది. కోట బొమ్మాళి పీఎస్‌ సినిమా విడుదల నేపథ్యంలో.. నిర్మాతలు.. రివ్యూవర్లతో క్వశ్చన్స్‌ అండ్‌ ఆన్సర్స్‌ సెషన్స్‌ నిర్వహించారు. అసలు సినిమాలకు రివ్యూలు అవసరమా అని ప్రశ్నించారు. ఈ సమయంలో రివ్యూలు సినిమా విజయాన్ని ప్రభావితం చేస్తాయా? అన్న చర్చ జరుగుతోంది. ఇక, కొన్ని సినిమాలు బ్యాడ్‌ రివ్యూలను దాటుకుని సూపర్‌ హిట్‌గా నిలిచాయి.

గంగోత్రి

ఈ సినిమా 2003 మార్చి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు కే రాఘవేంద్ర రావు గంగోత్రిని తెరకెక్కించారు. అల్లు అర్జున్‌, అదితి అగర్వాల్‌లు లీడ్‌ రోల్స్‌ చేశారు. ఇది అల్లు అర్జున్‌కు మొదటి సినిమా కావటం విశేషం. అయితే, ఈ సినిమాకు రివ్యూలు సరిగా రాలేదు. కొంతమంది నటీ,నటుల నటన సరిగా లేదని రివ్యూవర్లు రాశారు. చిన్న పిల్లల కథలా ఉందని అన్నారు. అయితే, ఈ సినిమా బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ అయింది. మూవీలోని పాటలు తెలుగు నాడును ఓ ఊపు ఊపేశాయి. కేవలం పాటల కోసమే కొంతమంది సినిమాకు వెళ్లారు. కలెక్షన్ల పరంగా సినిమా సూపర్‌ సక్సెస్‌ అయింది. వంద రోజులకు పైగా ఆడింది.

పోకిరి

ఈ సినిమా సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. పోకిరిపై ఇప్పటికీ కొన్ని చెరిగిపోని రికార్డులు ఉన్నాయి. ఈ చిత్రం 2006లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. మహేష్‌ బాబు, ఇలియానా డీక్రూజ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించారు. విడుదలవ్వగానే సినిమా బాలేదంటూ రివ్యూలు వచ్చాయి. కానీ, రెండో రోజు నుంచి కేవలం మౌత్‌ పబ్లిసిటీ ద్వారా జనం థియేటర్లకు క్యూ కట్టారు. కొన్ని ఏరియాల్లో సంవత్సరం పాటు ఆడింది. పోకిరి డైలాగులు ఎంత పాపులర్‌ అయ్యాయో మనందరికీ తెలుసు.

లక్ష్మీ

విక్టరీ వెంకటేష్‌ కెరీర్‌లో లక్ష్మీ సినిమా ఓ మైలు రాయిగా నిలిచింది. 2006, జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో వెంకటేష్‌, నయనతార, ఛార్మీలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా విడుదలైనపుడు మిక్స్‌డ్‌ రివ్యూలు వచ్చాయి. లక్ష్మీ కథ పాత చింతకాయ పచ్చడిలా ఉందంటూ కొందరు రివ్యూవర్లు ఘాటుగానే స్పందించారు. అయితే, సినిమా మాత్రం రివ్యూలను పక్కకు నెట్టి.. మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. 100 రోజులు ఆడింది.

దేశముదురు

దేశముదురు సినిమా 2007లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అల్లు అర్జున్‌, హన్సిక హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించారు. మొదట ఈ మూవీకి నెగిటవ్‌ రివ్యూలు వచ్చాయి. మాస్‌, వాయిలెన్స్‌ ఎక్కువగా ఉందంటూ.. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు అస్సలు నచ్చదంటూ రివ్యూవర్లు తేల్చేశారు. ఎమోషన్స్‌ కూడా సరిగా లేవని అన్నారు. కట్‌ చేస్తే దేశముదురు సూపర్‌ హిట్‌ అయింది. పాటలు ఓ ఊపు ఉపాయి. కేవలం తెలుగునాట మాత్రమే కాదు.. కన్నడ నాట కూడా ఈ పాటల్ని వినే వారు ఇప్పటికి కూడా ఉన్నారు.

రచ్చ

రామ్‌ చరణ్‌కు కమెర్షియల్‌గా మంచి హిట్‌ను అందించిన సినిమా ‘రచ్చ’. ఈ చిత్రం 2012 ఏప్రిల్‌ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్‌చరణ్‌ సరసన తమన్నా భాటియా నటించారు. ఈ మూవీకి మొదటి రోజు చాలా దారుణమైన రివ్యూలు వచ్చాయి. రెటీన్‌ కథ అని, మాస్‌ ఎలిమెంట్స్‌ తప్పితే సినిమాలో చూడ్డానికి ఏమీ లేవంటూ రివ్యూవర్లు సినిమాపై విరుచుకుపడ్డారు. అయితే, రివ్యూలకు భిన్నంగా సినిమా ఫలితాలు వచ్చాయి. దాదాపు 80 కోట్ల రూపాయల కలెక్షన్లను కొల్లగొట్టింది. రామ్‌ చరణ్‌ కెరీర్‌లో 100 రోజుల సినిమాగా నిలిచింది.

ధమాకా!

ధమాకా సినిమా డిసెంబర్‌ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో రవితేజ, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించారు. నక్కిన త్రినాథ్‌ రావు దర్శకత్వం వహించారు. ధమాకాకు రివ్యూలు చాలా నెగిటివ్‌గా వచ్చాయి. సినిమా మొత్తం జబర్థస్త్‌ షోలా ఉందని కొందరు రివ్యూవర్లు రాశారు. అయితే, రివ్యూలను వ్యతిరేకంగా సినిమా సూపర్‌ సక్సెస్‌ అయింది. కలెక్షన్ల వర్షం కురిపించింది. రవితేజ కెరీర్‌లో మైలు సినిమాగా నిలిచింది. మరి, రివ్యూలను దాటి సూపర్‌ సక్సెస్‌ అయిన ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.