iDreamPost
android-app
ios-app

ది గోట్ లైఫ్ ట్రైలర్ రివ్యూ

  • Published Mar 09, 2024 | 4:37 PM Updated Updated Mar 09, 2024 | 4:37 PM

ఇటీవలే ప్రభాస్ నటించిన పాన్ ఇండియన్ యాక్షన్ డ్రామా ‘సలార్’ లో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తానే స్వయంగా లీడ్ రోల్ లో నటించిన ఓ పాన్ ఇండియా ఫిల్మ్ ను అందరి ముందుకు తీసుకుని వస్తున్నారు.

ఇటీవలే ప్రభాస్ నటించిన పాన్ ఇండియన్ యాక్షన్ డ్రామా ‘సలార్’ లో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తానే స్వయంగా లీడ్ రోల్ లో నటించిన ఓ పాన్ ఇండియా ఫిల్మ్ ను అందరి ముందుకు తీసుకుని వస్తున్నారు.

  • Published Mar 09, 2024 | 4:37 PMUpdated Mar 09, 2024 | 4:37 PM
ది గోట్ లైఫ్ ట్రైలర్ రివ్యూ

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్.. ఇటీవలే ప్రభాస్ నటించిన పాన్ ఇండియన్ యాక్షన్ డ్రామా ‘సలార్’ లో కనిపించిన సంగతి తెలిసిందే. తాజాగా తానే ప్రధాన పాత్ర పోషించిన ఓ పాన్ ఇండియా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ సినిమా కోసం పృథ్వీరాజ్ ఎన్నో ఏళ్ళు కష్టపడ్డారు. కొన్ని యధార్థ సంఘటనల నేపథ్యంతో సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాని ‘ది గోట్ లైఫ్’ (మలయాళంలో ఆడుజీవితం) టైటిల్ తో విడుదల చేయనున్నారు.

ఇప్పటికే ఈ సినిమా తాలూకు పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ సినిమా కథ ఏంటంటే.. కేరళకి సంబంధించిన హీరో ఉద్యోగం కోసం సౌదీ అరేబియాకి వెళ్తాడు. అయితే అక్కడి వారు తనని ఒక బానిసగా చూడటం వల్ల, ఎన్నో సమస్యలు ఎదురుకున్న తరువాత ఇండియాకి తిరిగి వెళ్ళిపోదాం నిర్ణయించుకొని నడక ప్రయాణం మొదలు పెడతాడు. ఆ ప్రయాణంలో హీరో ఎలాంటి సమస్యలని ఎదురుకున్నాడు, ఇండియా చేరుకున్నాడా? లేదా? అన్నదే సినిమా కథ. ట్రైలర్ లో ఎక్కువ డైలాగ్స్ లేవు అయితే అద్భుతమైన విజువల్ ట్రీట్ తో పాటు ఒక ఎమోషనల్ జర్నీని చూడబోతున్నాం అనే ఫీలింగ్ అయితే క్రియేట్ చేయగలిగింది. బ్లెస్సీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పృథ్వీరాజ్ సరసన అమలా పాల్ హీరోయిన్ గా నటించారు.

పృథ్వీరాజ్ సుకుమారన్ ది గోట్ లైఫ్ సినిమా షూటింగ్ తో తన అనుభవాన్ని పంచుకున్నారు. ఈ సినిమా ప్రయాణం చాలా రోజులు పాటు జరిగిందని చెప్తూ దాన్ని తెరకెక్కించడం అంతగా సులభంగా కూడా జరగలేదని తెలిపారు. ఒక దశాబ్దం సుదీర్ఘ నిరీక్షణ తరువాత ప్రేక్షకులకు తన చిత్ర యూనిట్ పడిన కృషికి దక్కిన ఫలితాన్ని సినిమాలో చూస్తారని ఆయన నమ్మకంగా అన్నారు. కోవిడ్ రోజుల నుంచి నేటి వరకు సాగిన “ది గోట్ లైఫ్” ప్రయాణం మరచిపోలేనిదని పృథ్వీరాజ్ చెప్పారు. ” బ్లెస్సీ సార్ విజన్ లో భాగం కావడం, ఏఆర్ రెహమాన్ లాంటి మాస్ట్రో సంగీతానికి జీవం పోయడం గౌరవంగా భావిస్తున్నాను. ది గోట్ లైఫ్ అనేది కేవలం సినిమా మాత్రమే కాదు, మన హృదయాలను స్పృశించి ఎప్పటికీ మనతోనే ఉండే కథ. ప్రేక్షకులు కూడా అలాగే ఫీలవుతారని ఆశిస్తున్నాం” అన్నారు పృథ్వీరాజ్ సుకుమారన్.

ది గోట్ లైఫ్ ట్రైలర్: పృథ్వీరాజ్ సుకుమారన్ డ్రీమ్ వరల్డ్