దళపతి విజయ్ ప్రస్తుతం లియో సినిమా కంప్లీట్ చేసి.. తదుపరి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన లియో మూవీ.. అక్టోబర్ 19న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతుంది. ఇది ఖైదీ, విక్రమ్ లతో పాటు ‘లోకి సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా రానుందట. ఈ సినిమాపై భారీ అంచనాలు సెట్ అవ్వగా.. త్వరలోనే ప్రమోషన్స్ ప్రారంభించనున్నారు మేకర్స్. అయితే.. విజయ్ నెక్స్ట్ మూవీ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి లుక్ టెస్ట్ కోసం విజయ్ విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇది విజయ్ కెరీర్ లో 68వ సినిమాగా రాబోతుంది.
ఇక వెంకట్ ప్రభు సినిమా తర్వాత.. విజయ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. తన పొలిటికల్ ఎంట్రీ, కెరీర్ పై ఫోకస్ పెట్టబోతున్నాడని కొన్నాళ్ళుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. విజయ్ కి పాలిటిక్స్ పై మొదటి నుండి ఇంటరెస్ట్ ఉందని.. కానీ, ఇన్నాళ్లు సరైన సమయం కోసం వెయిట్ చేస్తూ వచ్చాడని టాక్. అయితే.. తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పొలిటికల్ కెరీర్ ని చాలా పకడ్బంధీగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే.. ఇటీవల తన ఫ్యాన్స్ తో పాటు పలు పొలిటికల్ ఎంట్రీపై యూత్ తో మీటింగ్స్ లో పాల్గొన్నాడు. మరోవైపు విజయ్ ప్రజా సంఘం పేరున ఫ్యాన్స్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ లెక్కన విజయ్ రాజకీయ రంగ ప్రవేశం ఖచ్చితంగా ఉంటుంది. కానీ.. ఎప్పుడు అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే.. విజయ్ ప్రెజెంట్ సినిమాలలో నుండి ఇంకా తప్పుకోలేదు. అయితే.. ఇటీవల విజయ్ తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాల నుండి అభిమానులను పిలిచి చర్చలు కూడా జరిపాడు. విజయ్ పేరు జనాల్లోకి మరింతగా వెళ్లేందుకు ఆల్రెడీ వేలమంది యువకులను సోషల్ మీడియా మేనేజ్ చేయడానికి నియమించారట. ఈ క్రమంలో విజయ్ కి సంబంధించి ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే.. పొలిటికల్ ఎంట్రీ కోసం విజయ్ త్వరలోనే ఓ న్యూస్ ఛానల్ ని లీజ్ కి తీసుకోవడం లేదా కొత్త న్యూస్ ఛానల్ ని స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు. కానీ.. పాలిటిక్స్ అన్నాక ఛానల్ ఉంటే బాగుంటుందని.. విజయ్ కూడా అలాగే ఆలోచన చేస్తున్నాడేమో అని నెటిజన్స్ టాక్. మరి దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.