iDreamPost
android-app
ios-app

నార్త్ మీద సౌత్ హీరోల స్పెషల్ ఫోకస్.. కారణం ఇదేనా!

  • Published Nov 13, 2024 | 12:46 PM Updated Updated Nov 13, 2024 | 12:46 PM

Movie Promotions In North: తెలుగు సినిమాలు అన్ని భాషల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టిగ సౌండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో మనదే హవా. అక్కడ కూడా మనోళ్లదే డామినేషన్. అందుకే ఇప్పుడు సౌత్ హీరోలు నార్త్ ఆడియన్స్ ను టార్గెట్ చేశారు. ఈ ప్రాసెస్ లో అక్కడే భారీ ప్రమోషనల్ ఈవెంట్స్ ను ప్లాన్ చేస్తున్నారు.

Movie Promotions In North: తెలుగు సినిమాలు అన్ని భాషల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టిగ సౌండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో మనదే హవా. అక్కడ కూడా మనోళ్లదే డామినేషన్. అందుకే ఇప్పుడు సౌత్ హీరోలు నార్త్ ఆడియన్స్ ను టార్గెట్ చేశారు. ఈ ప్రాసెస్ లో అక్కడే భారీ ప్రమోషనల్ ఈవెంట్స్ ను ప్లాన్ చేస్తున్నారు.

  • Published Nov 13, 2024 | 12:46 PMUpdated Nov 13, 2024 | 12:46 PM
నార్త్ మీద సౌత్ హీరోల స్పెషల్ ఫోకస్.. కారణం ఇదేనా!

సౌత్ సినిమాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర డామినేషన్ చూపిస్తున్నాయి. ఈ విషయాన్నీ ఎవరు కాదనలేరు. ఒకప్పుడు తెలుగు సినిమాలను ప్రాంతీయ సినిమాగానే చూసేవారు. కానీ ఇప్పుడు ఇదే సౌత్ సినిమా పాన్ ఇండియా సినిమా అయింది. ఎందుకంటే తెలుగు సినిమాలు అన్ని భాషల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టిగ సౌండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో మనదే హవా. అక్కడ కూడా మనోళ్లదే డామినేషన్. అందుకే ఇప్పుడు సౌత్ హీరోలు నార్త్ ఆడియన్స్ ను టార్గెట్ చేశారు. ఈ ప్రాసెస్ లో అక్కడే భారీ ప్రమోషనల్ ఈవెంట్స్ ను ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 5న రానున్న పుష్ప2 , సంక్రాంతికి రానున్న గేమ్ ఛేంజర్. ఈ రెండు సినిమాల ప్రమోషనల్ ఈవెంట్స్ అన్నీ కూడా నార్త్ లోనే ప్లాన్ చేశారు.

గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా తెలుగు , హిందీ , తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో లక్నో లో గ్రాండ్ గా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. చరణ్‌, ఎస్‌జే సూర్య, కియారా అద్వానీ, అంజలి సహా నిర్మాత దిల్‌ రాజు ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేశారు. తర్వాత ముంబై , యూఎస్ లోని డల్లాస్ తో పాటుగా తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషనల్ ఈవెంట్స్ ఉండబోతున్నాయి. ఇక దానికంటే ముందు రానున్న పుష్ప 2 విషయానికొస్తే.. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా నార్త్ లోనే స్టార్ట్ కానున్నాయ్. ముందుగా బీహార్ క్యాపిటల్ సిటీ పాట్నాలో ఈ నెల 17న బ్లాస్టింగ్ ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్ జరగనుంది. ఆ తర్వాత కోల్‌కతా, ముంబై , కోచి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ లాంటి నగరాలలో గ్రాండ్ ఈవెంట్స్ చేయడానికి స్కెచ్ రెడీ అయింది. పుష్ప పార్ట్1 కి విపరీతమైన క్రేజ్ లభించడంతో.. చిత్ర బృందం ఈసారి నార్త్ బెల్ట్ మీద గట్టిగా ఫోకస్ పెట్టింది.

నిజానికి పాన్ ఇండియా సినిమాలకు నార్త్ లో ఇలాంటి స్ట్రాటజిక్ మార్కెటింగ్ అత్యవసరం. ఎందుకంటే మిగిలిన భాషల్లో వసూళ్లు కాస్త అటు ఇటు అయినా హిందీలో క్లిక్ అయితే మాత్రం.. లెక్కలు తారుమారౌతాయి. అందుకే సౌత్ స్టార్స్ అంతా పాట్నా, లక్నో, ముంబై లాంటి నగరాలకు గురి పెట్టారు. గతంలో కూడా చాలా సినిమాల విషయంలో ఇలా జరిగింది. కానీ ఇప్పుడు పుష్ప 2 , గేమ్ ఛేంజర్ సినిమాలు మాత్రం.. నార్త్ ప్రమోషన్స్ ను ఇంకాస్త పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. కంటెంట్ బావుంటే కలెక్షన్స్ వాటంతట అవే కలిసి వస్తాయి. కానీ ఒకవేళ రివర్స్ కొడితే మాత్రం.. ఆ ప్రమోషన్స్ కూడా ఏమి చేయలేవు. ఆల్రెడీ ఇది అనేక మూవీస్ విషయంలో ప్రూవ్ అయింది. ఇక కొన్ని చిత్రాలకు ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. సో కథలో పట్టు ఉంటె ఆ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్ళడానికి ఈ ప్రమోషన్స్ ఇంకాస్త బాగా ఉపయోగపడతాయి. ఇక పుష్ప 2 , గేమ్ ఛేంజర్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.